కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 10/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1998
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1998
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1998
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1998
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 10/8 పేజీ 30

మా పాఠకుల నుండి

క్షయ “క్షయ—ఒక హంతకి పునరాగమనం” అనే శీర్షికలను నేనెంతో మెచ్చుకుంటున్నాను. (జనవరి 8, 1998) నాకు 1988లో క్షయ వచ్చింది, ఆ తర్వాత కోలుకున్నాను. రోగులు మందులను “ఎంతమాత్రం అలక్ష్యం చేయకుండా క్రమంగా” తీసుకోవాలని మీరు చెప్పిన విషయం కచ్చితంగా నిజం.

వై. ఎల్‌., ఫ్రాన్స్‌

మతసంబంధంగా అంత ఆసక్తిలేని మా అత్తగారు నా బల్ల మీదున్న ఈ పత్రిక శీర్షికను చూసి దాన్ని తీసుకుని చదివింది. దాన్ని ఇంటికి తీసుకువెళతానని ఆమె అడిగింది. నేను ఆమెకు తేజరిల్లు! యొక్క మరో రెండు సంచికలను కూడా ఇచ్చాను. ప్రతి పత్రికనూ ఉత్పత్తి చేయడానికి మీరు చేసే కృషి అంతటికీ నా అభినందనలు.

ఎల్‌. ఎన్‌., అమెరికా

నాకు 11 ఏళ్ల క్రితం క్షయ వ్యాధి వచ్చింది. మీరిచ్చిన సమాచారం ఎంతో కచ్చితంగా ఉంది. కొన్నిసార్లు, దాన్ని చదవడం నా స్వంత అనుభవాన్ని మరోసారి సజీవంగా చిత్రించినట్లు అనిపించింది. జీవమనే బహుమానాన్ని ఇచ్చినందుకూ, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తేజరిల్లు! ద్వారా మనకు క్రమంగా ఉపదేశం ఇస్తున్నందుకూ నేను యెహోవాకు కృతజ్ఞతలు తెల్పుతున్నాను.

జి. బి., ఇటలీ

నాకు ఈ వ్యాధి రావడంతో నేను ఆర్నెల్లు చికిత్స పొందాను. ఈ హంతకి వ్యాధి గురించి మరింత తెలుసుకోవడానికి నాకు మీ శీర్షిక సహాయపడింది. మరి ముఖ్యంగా, దేవుని రాజ్యం ఈ సమస్యకు విశ్వవ్యాప్త పరిష్కారాన్ని తీసుకువస్తుందనే నా విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి అది నాకు సహాయం చేసింది.

పి. పి., ఇండోనేషియా

దేవునికి భయపడ్డమా? “బైబిలు ఉద్దేశము: ప్రేమా స్వరూపియైన దేవునికి మీరెలా భయపడగలరు?” అనే శీర్షిక విషయమై నేను నా ఆనందాన్ని తెలుపకుండా ఉండలేకపోతున్నాను. (ఫిబ్రవరి 8, 1998) కొంతకాలంపాటు నేను ఈ ప్రశ్న గురించే ఆలోచిస్తున్నాను. దేవునికి భయపడడమంటే ఆయనకు అయిష్టమైనది చేయకూడదనే ఆరోగ్యకరమైన భయమని నాకర్థమయ్యింది. అయినప్పటికీ, ఈ అంశాన్ని నేను మరింత పూర్తిగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని భావించాను. తర్వాత నేనీ శీర్షిక చదివాను. చివరికి, దేవునికి భయపడడమంటే ఏమిటనే దాన్ని గురించిన సంతృప్తికరమైన సమాచారం లభించింది.

ఎమ్‌. జె. టి., అమెరికా

పిల్లలు ఇల్లు వదిలి వెళ్లడం “పిల్లలు ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు” అనే శీర్షికలకై నేను కృతజ్ఞుడిని. (ఫిబ్రవరి 8, 1998) నా అమూల్యమైన పిల్లలను వెళ్లిపోనివ్వడం చాలా బాధాకరంగా, నెమ్మదిగా జరిగింది. అయితే, మీరు చెప్పింది కరెక్టే. బోసిపోయిన ఇంట్లో జీవించడం సమయం గడుస్తుండగా, అవగాహన పెరుగుతుండగా మెరుగుపడుతుంది. తల్లిదండ్రులమైన మనం మన వివాహ జతలతో మన వైవాహిక బంధాలను పునర్నూతనం చేసుకోగల్గుతాము.

ఎ. ఇ., కెనడా

ఈ శీర్షికలు నా ప్రార్థనలకు జవాబులా వచ్చాయి. పిల్లలు ఇల్లు వదిలి వెళ్లడం బాధకు, వేదనకు కారణమౌతాయి. కాని ఈ శీర్షికలో ఇవ్వబడిన మంచి ఉపదేశంతో సమాధానమూ ప్రేమదే పైచేయి అవుతుంది.

పి. ఎన్‌., ఫ్రాన్స్‌

ఈ శీర్షికలు ప్రత్యేకంగా నా కోసమే వ్రాయబడినట్లు భావించాను. పూర్తికాల సువార్తికుల అవసరతవున్న ప్రాంతంలో సేవచేయడానికి నేను ఈ మధ్యనే ఇల్లు వదిలివెళ్లాను. నా తల్లిదండ్రులు ఎలాంటి అనుభూతికి లోనౌతారో అర్థం చేసుకోవడానికీ, వారిని విడిచి వచ్చినందుకు నాకు కల్గుతున్న అపరాధ భావాలను అధిగమించడానికీ ఈ శీర్షికలు నాకు సహాయం చేశాయి. అంతేగాక, “ఎదిగిన పిల్లలకు ఒక మాట—వెళ్లనిచ్చేందుకు తల్లిదండ్రులకు సహాయపడండి” అనే బాక్సులో ఇవ్వబడిన ఉపదేశాన్ని నేను అనుసరిస్తాను. నేను ఎంతో దూరంలో ఉన్నప్పటికీ, నేను నా తల్లిదండ్రులకు సన్నిహితంగా ఉన్నట్లు భావించగల్గుతాను. ఎల్లప్పుడు సరైన సమయంలో వచ్చే ఇలాంటి శీర్షికలకై నా కృతజ్ఞతలు.

జి. యు., ఇటలీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి