కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 5/8 పేజీలు 18-19
  • దయ్యాలు నిజంగానే ఉన్నాయా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దయ్యాలు నిజంగానే ఉన్నాయా?
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సడలిన దృక్పథం
  • అపనమ్మకం సందిగ్ధావస్థను కలుగజేస్తుంది
  • దుష్టులైన మోసగాళ్ళు
  • దేవదూతల గురించిన సత్యం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • యేసుకు దయ్యాలను నాశనం చేయగల శక్తి ఉంది
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • అపవాదిని ఎదిరించండి
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • దేవదూతలు ఎవరు, వాళ్లు ఏం చేస్తారు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 5/8 పేజీలు 18-19

బైబిలు ఉద్దేశము

దయ్యాలు నిజంగానే ఉన్నాయా?

యూరప్‌లోని చాలా ప్రాంతాల్లో, 17వ మరియు 18వ శతాబ్దాల్లో మాంత్రికులను దండించాలన్న వెర్రి ఆవేశం తాండవమాడింది. మాంత్రికులు అని ఆరోపించబడినవారనేకులు ఘోరమైన హింసకు గురయ్యారు. అబద్ధ ఆరోపణ చేయబడిన కొందరు కేవలం హింసనుండి తప్పించుకునేందుకే తాము మాంత్రికులేనని ఒప్పుకున్నారు. వదంతులు లేదా అనుమానం పేరట ఎంత మందికి మరణశిక్ష విధించబడిందో తెలియదు.

స్పష్టంగా లేఖనాల ఆధారంగానే అయినప్పటికీ, ఒక రకమైన క్షుద్రదేవతా ఉపాసనయైన మాంత్రిక విద్యకు వ్యతిరేకమైన ఈ చర్యలు కచ్చితంగా మతపిచ్చితో కూడినవే. మాంత్రికులను లేదా మరే రకమైన అభిచారాన్ని అభ్యసించేవారిని పీడించే, శిక్షించే బాధ్యత క్రైస్తవులకు ఇవ్వబడలేదు. (రోమీయులు 12:19) నేడు ప్రబలివున్న దృక్పథమేమిటి?

సడలిన దృక్పథం

నేడు క్రైస్తవమత సామ్రాజ్యంలో ఉన్న అనేక మంది ప్రజలు అలాంటి అభిచార ఆచారాలను గంభీరంగా తీసుకోరు. జిజ్ఞాస మూలంగా కొందరు, జ్యోతిశ్శాస్త్రంలోనూ, ఇంద్రజాలంలోనూ, సోదె చెప్పడంలోనూ, మంత్రవిద్యలోనూ నిమగ్నమవుతారు, కానీ, ఈ నిగూఢాచారాలను దయ్యాల సంబంధమైనవిగా దృష్టించరు. కొన్నిసార్లు, వినోదాన్నిచ్చేవాళ్ళూ, క్రీడాకారులూ, రాజకీయవేత్తలూ తాము నిగూఢ ఆచారాల్లో నిమగ్నమవుతున్న విషయాన్ని బాహాటంగా ఒప్పుకుంటారు. కొన్ని పుస్తకాలూ సినిమాలూ మంత్రగాళ్ళనూ, ఇంద్రజాలికులనూ, “ఆకర్షణీయమైనవారన్నట్లుగానూ, కాస్త అసాధారణమైన వ్యక్తులన్నట్లుగానూ, వారి మానవాతీత క్రియాశీలతలు ఎవరికీ హాని కలిగించనివన్నట్లుగానూ” చిత్రీకరిస్తాయని ఒక ఎన్‌సైక్లోపీడియా చెబుతుంది. పిల్లలకు వినోదాన్నిచ్చేందుకూ, విద్య నేర్పించేందుకు రూపొందించబడిన పుస్తకాలు నిగూఢమైన అంశాలను చర్చించవచ్చు.

క్షుద్రశక్తుల ఉపాసన విషయమై సడలిన, ఏమీ కాదులే అన్న దృక్పథం దయ్యాలు ఉనికిలో లేవన్న విశ్వాసానికి నడిపించవచ్చు. దయ్యాలు అస్తిత్వంలో ఉన్నాయనీ, అవి మనకు హాని కలిగించేందుకు చురుకుగా ప్రయత్నిస్తున్నాయనీ మీరు నమ్ముతున్నారా? తమకు దయ్యాలను కలిసిన అనుభవమూ లేదనీ, దయ్యాల క్రియాశీలతనూ తామెన్నడూ చూడనూ లేదనీ చాలామంది చెబుతారన్నది నిజమే. దయ్యాలు నిజంగా ఉన్నాయా?

అపనమ్మకం సందిగ్ధావస్థను కలుగజేస్తుంది

బైబిలును అంగీకరిస్తామని ఒప్పుకుంటూనే దయ్యాలు వాస్తవంగానే ఉన్నాయన్న విషయాన్ని సంశయించేవారు సందిగ్ధతను ఎదుర్కోవలసి ఉంటుంది. దయ్యాలు వాస్తవానికి లేవని వాళ్ళు నమ్ముతున్నట్లయితే, వాళ్ళు బైబిలు మీద కొంత అవిశ్వాసాన్ని కనబరుస్తున్నారన్నమాట. ఎందుకని? ఎందుకంటే, మానవాతీత శక్తులుగల దుష్టాత్మ ప్రాణులను గురించిన తలంపు దేవునివాక్యమైన బైబిలులో బోధించబడుతుంది మరి.

దాని మొదటి పుస్తకమైన ఆదికాండము, ఒక బుద్ధిజీవి హవ్వను మోసగించేందుకు ఒక పామును ఉపయోగించి, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా ఎలా నడిపాడో చెబుతుంది. (ఆదికాండము 3:1-5) బైబిలు చివరి గ్రంథమైన ప్రకటన ఈ దుష్ట కుతంత్రగాడిని గురించి “సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన . . . మహాఘటసర్పము” అని తెలియజేస్తుంది. (ప్రకటన 12:9) మిగతా దూతలను వశీకరించడంలో సాతాను సఫలీకృతుడయ్యాడు. (యూదా 6) కుతంత్రంలో పడిపోయిన ఆ దూతలను దయ్యములు అని బైబిలు పిలుస్తుంది. వారు భూపరిధిలో ప్రవర్తిస్తారు, వాళ్ళు దేవుని మీదా, ఆయనకు సేవ చేసేవారి మీదా చాలా కోపంగా ఉన్నారు.—ప్రకటన 12:12.

సాతానుకూ, దయ్యాలకూ మనుష్యుల్ని ప్రభావితం చేసే, హాని కలిగించే, వాళ్ళతో సంభాషించే శక్తి ఉంది. (లూకా 8:27, 33) వాళ్ళు వేల సంవత్సరాలుగా మానవ స్వభావాన్ని అధ్యయనం చేశారు. మానవుల బలహీనతతో ఎలా ఆడుకోవాలో వాళ్ళకు తెలుసు. వాళ్ళు స్త్రీలను, పురుషులను, పిల్లలను పట్టిన, లేదా పూర్తిగా తమ అదుపులో ఉంచుకున్న సందర్భాలను గురించి బైబిలు నివేదిక చెబుతుంది. (మత్తయి 15:22; మార్కు 5:2) వాళ్ళు రుగ్మతను కలిగించగలరు లేదా అంధత్వం వంటి అంగవైకల్యం కలిగించగలరు. (యోబు 2:6, 7; మత్తయి 9:32, 33; 12:22; 17:14-18) వాళ్ళు మనుష్యుల మనస్సులకు కూడా అంధత్వం కలిగించగలరు. (2 కొరింథీయులు 4:4) “గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగు”తున్నటువంటి తమ నాయకుడైన సాతానులాగే, దయ్యాలు ఎడతెగక క్రియాశీలంగా ఉన్నాయి. (1 పేతురు 5:8) దయ్యాల ఉనికిని గూర్చిన అనేక వృత్తాంతాలు బైబిలులో ఉన్నాయి. మీరు బైబిలు మీద విశ్వాసముంచుతున్నట్లయితే, అదృశ్య దుష్ట జీవులు ఉన్నాయన్న వాస్తవాన్ని అంగీకరిస్తారు.

దుష్టులైన మోసగాళ్ళు

శక్తిమంతులైన దయ్యాలు లోకంలో ఎడతెగని భీతినిగొల్పే పరిస్థితికి కారణమవ్వకుండా నేడు ఎలా ఉండగలరు? వాళ్ళ సాన్నిధ్యమూ, వాళ్ళ చర్యలూ ఎందుకంత స్పష్టంగా లేవు? బైబిలిలా జవాబిస్తుంది: “సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు.” (2 కొరింథీయులు 11:14) అపవాది నయవంచకుడు. దయ్యాల క్రియాశీలత తరచూ హానిరహితమైనదిగా లేదా ప్రయోజనకరమైనదిగా కూడా కనిపిస్తుంది. కనుక దాన్ని గుర్తించడం కష్టం.

సాతానూ, అతని దయ్యాలూ బైబిలు కాలాల్లోలాగే ప్రజలను వివిధ మార్గాల్లో బాధించడంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు యథార్థ క్రైస్తవులైన కొందరు ఒకప్పుడు నిగూఢమైన కార్యకలాపాల్లో పాల్గొన్నవారే; దయ్యాల భయంకరమైన దాడికి వాళ్ళు సాక్ష్యం చెప్పగలరు. నేడు, దయ్యాలు పూర్తిగా నిగూఢమైన చర్యల్లోకి ప్రజలను వశీకరించేందుకు, తమ మానవాతీత శక్తులను బహుశ, మునుపెన్నటికన్నా ఎక్కువగానే ఉపయోగిస్తున్నారు. వాళ్ళ శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. అయినప్పటికీ, వాళ్ళు ప్రజలను భయపెట్టేదానికన్నా, వాళ్ళను దేవునికి దూరంగా మరులుగొల్పడంలోనే మరింత సఫలీకృతులు అవుతుండవచ్చు. సాతానూ, దయ్యాలూ “సర్వలోకమును మోస పుచ్చుచు”న్నారని బైబిలు చెబుతోంది. (ప్రకటన 12:9) వాళ్ళు అతి సూక్ష్మమైన విధంగా, నమ్మలేని విధంగా మన ఆధ్యాత్మికతను బలహీనపరచే ఉద్దేశంతో ఉన్నారు.

దయ్యాలు వాస్తవంగానే ఉన్నాయి. నేడు ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తున్న తీరని రక్తదాహాన్నీ, నాశనం చెయ్యాలన్న కోరికనూ మరెలా వివరించవచ్చు? సహజంగా మానవులు శాంతిసమాధానాలతో సంతోషంతో జీవించాలని కోరుకుంటారు. కాని దయ్యాలు చెడుతనాన్ని వృద్ధి చేస్తాయి. మానవుల మనస్సును అధీనపరచుకుని కల్మషపరచే శక్తి వాటికుంది.

అయితే, యెహోవా సర్వశక్తిమంతుడైన దేవుడు. దయ్యాలకన్నా ఎంతో శక్తిమంతుడు. ఆయన తన శక్తినీ, “అపవాది తంత్రముల” నుండి సంరక్షణనూ ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. (ఎఫెసీయులు 6:11-18) మనం దయ్యాల విషయమై భయకంపితులవ్వవలసిన అవసరం లేదు. దేవుడు ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.”—యాకోబు 4:7.

[18వ పేజీలోని చిత్రసౌజన్యం]

Sipa Icono

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి