కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 5/8 పేజీలు 12-14
  • స్త్రీలకు ఎలాంటి భవిష్యత్తు ఉంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్త్రీలకు ఎలాంటి భవిష్యత్తు ఉంది?
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • భర్తలకూ, తండ్రులకూ బోధించడం
  • స్త్రీల విషయమై దేవునికున్న చింత
  • గౌరవాన్ని కనుగొనిన స్త్రీలు
  • ఒక శాశ్వత పరిష్కారం
  • మనం స్త్రీలను గౌరవించాలని దేవుడు కోరుతున్నాడు
    కావలికోట: దేవుడు స్త్రీలను పట్టించుకుంటాడా?
  • క్రైస్తవ స్త్రీలు సన్మానం, గౌరవం పొందనర్హులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • దేవుని తొలిసేవకుల్లో స్త్రీల గౌరవప్రదమైన పాత్ర
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • యెహోవా సంకల్పంలో స్త్రీల పాత్ర
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 5/8 పేజీలు 12-14

స్త్రీలకు ఎలాంటి భవిష్యత్తు ఉంది?

“పురుషుడు స్త్రీని గాయపరచడం, అణచివేయడం పునరావృతమౌతున్న చరిత్రే మానవ చరిత్ర.” 150 సంవత్సరాల క్రితం అమెరికాలోని, న్యూయార్క్‌లో సెనకా ఫాల్స్‌ అనే గ్రామంలో, స్త్రీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా వ్రాయబడిన ఒక అభిప్రాయ ప్రకటన అలా ఉంది.

నిస్సందేహంగా, అప్పటి నుండి పురోభివృద్ధి అనేది జరుగుతుంది. అయితే, ఐక్యరాజ్య సమితి ప్రచురణయైన ద వరల్డ్స్‌ విమెన్‌ 1995 చెబుతున్నట్లు, ఇంకా ఎంతో అభివృద్ధి సాధించవలసి ఉంది. “ఎంతో తరచుగా, స్త్రీ పురుషులు రెండు విభిన్న పరిస్థితుల్లో జీవిస్తున్నారు, విద్యనభ్యసించే విషయమైనా, ఉద్యోగ అవకాశాలైనా, ఆరోగ్యం విషయంలోనైనా, వ్యక్తిగత భద్రత విషయంలోనైనా, విశ్రాంతి సమయం విషయంలోనైనా సరే వాళ్ళ పరిస్థితులు వ్యత్యస్తంగా ఉన్నాయి” అని అది నివేదిస్తుంది.

దీన్ని గూర్చి పెరిగిన స్పృహ, దేశాలు స్త్రీల హక్కులను సంరక్షించే చట్టాలను తయారు చేసేందుకు కారణమైంది. కాని అవినీతీ, పూర్వనిర్థారణలూ వేరుపారివున్న మనస్సులను చట్టాలు మార్చలేవు. ఉదాహరణకు, బాల వేశ్యలను పరిస్థితినే తీసుకోండి. “లైంగిక కోరికల కోసం పిల్లలపై అత్యాచారం చేయడాన్ని ఆపేందుకైన శాసన నిర్మాణాలు సదుద్దేశంతో కూడినవే, కానీ తరచూ అవి అమలులోకి రావడంలేదు” అని అంతర్జాతీయంగా కనిపించే ఈ అవమానకరమైన విషయాన్ని గురించి న్యూస్‌వీక్‌ చెబుతుంది. అలాగే, చట్టాలు ఉన్నంతమాత్రాన హింస అనేది నిర్మూలం చేయబడదు. “స్త్రీలు హింసించబడడమన్నది భూగోళవ్యాప్తంగా, సర్వవ్యాప్తంగా ఉన్న సమస్య అని రుజువులు తెలియజేస్తున్నాయి. ప్రస్తుత సాంస్కృతిక, సాంఘిక విలువలు మారకపోతే ఇలాంటి హింసను ఆపేందుకై నిర్మించబడిన దాదాపు చట్టాలన్నీ కూడా అపర్యాప్తమైనవే” అని హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ రిపోర్ట్‌ 1995 చెబుతుంది.—ఇటాలిక్కులు మావి.

కొరకరాని కొయ్యలాంటి బాగా లోతుగా పాతుకుపోయిన పారంపర్యాలపైనే “సాంస్కృతిక, సాంఘిక విలువలు” సాధారణంగా ఆధారపడి ఉంటాయి. “స్త్రీలను ప్రేమించడం కాదు కానీ, వారిని ఉపయోగించుకోవాలనీ, వారిని సంరక్షించడం కాదుగానీ, వాళ్ళతో పని చేయించుకోవాలనీ పారంపర్యం పురుషులను నమ్మిస్తుంది. దాని ఫలితంగా, స్త్రీకి అభిప్రాయం వ్యక్తం చేసుకునే స్వాతంత్ర్యం లేదు, హక్కులు లేవు, తన పరిస్థితిని మెరుగుపరచుకునే అవకాశమూ లేదు” అని మధ్యప్రాచ్యంలోని ఒక స్త్రీ చెబుతుంది.

భర్తలకూ, తండ్రులకూ బోధించడం

“అందరూ సత్వరంగా, ఐకమత్యంగా చర్యలు తీసుకుంటే” మాత్రమే, స్త్రీలు గౌరవించబడే, “శాంతియుతమైన, న్యాయసమ్మతమైన, మానవత్వంగల లోకం” సాధ్యమౌతుందని చైనాలోని బీజింగ్‌లో, స్త్రీల విషయమై సమావేశమైన 1995 లోక మహాసభ ప్రతిపాదించిన కార్యాచరణ ప్రకటన పత్రిక ప్రకటించింది.

స్త్రీల జీవితాలను మరింత ‘శాంతియుతమైనవిగా, న్యాయసమ్మతమైనవిగా, మానవత్వం చూపించబడుతున్నవిగా’ చేసేందుకు అవసరమైన చర్యలు ఇంట్లోనే భర్తలతో, తండ్రులతో మొదలవ్వడం తప్పనిసరి. ఈ విషయంలో, సాఫల్యానికి కీలకం బైబిలు విద్యాభ్యాసమేనన్న నమ్మకంతో యెహోవాసాక్షులు ఉన్నారు. పురుషులు తమ భార్యలతోను, కుమార్తెలతోను గౌరవంగానూ, పరిగణనతోనూ వ్యవహరించాలని దేవుడు నిరీక్షిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు, ఆ విషయాన్ని హృదయంలోనికి తీసుకుని అలా చేయడాన్ని వాళ్ళు చూశారు.

మధ్య ఆఫ్రికాలోని, వివాహితుడైన, నలుగురు పిల్లలున్న పేడ్రో ఇప్పుడు తన భార్య అవసరాల్లో మంచి శ్రద్ధ చూపిస్తున్నాడు. పిల్లలను చూసుకునే విషయంలోను ఆయన ఆమెకు సహాయం చేస్తాడు. అతిథులు కుటుంబంతోపాటు భోజనం చేసేటప్పుడు ఆయన వడ్డిస్తాడు కూడా. అలాంటి పరిగణనగల దృక్పథం అతని దేశంలో చాలా అరుదైన విషయం. ఆయన తన భార్య ఎడల మెప్పుదల కలిగివుండి, ఆమెతో సహకరించేలా చేస్తున్నదేమిటి?

“నేను బైబిలు చదవనారంభించినప్పుడు, భర్త పాత్రను గురించిన రెండు ప్రాముఖ్యమైన సూత్రాలను తెలుసుకున్నాను. నేను నా భార్యను దృష్టించే విషయంలో అవి చాలా ప్రభావం చూపాయి. మొదటిగా, భర్త తన భార్యను “బలహీనమైన ఘటమని” సన్మానించాలని 1 పేతురు 3:7 వివరిస్తుంది. రెండవది, భర్త తన భార్యను ‘సొంత శరీరమువలె’ ఎంచాలి అని ఎఫెసీయులు 5:28, 29 చెబుతుంది. నేను ఆ సలహాను అనుసరించినది మొదలుకొని, మేమిరువురమూ మరింత సన్నిహితులమయ్యాము. కనుక మనం పురుషులం స్థానిక ఆచారాల కన్నా దేవుని ఉపదేశానికే ఎక్కువ విలువనివ్వడం తప్పనిసరి” అని పెడ్రో వివరిస్తున్నాడు.

పశ్చిమ ఆఫ్రికాలోని మైకిల్‌ తాను యెహోవాసాక్షులతో బైబిలు పఠించడానికి ముందు తన భార్యతో సముచితమైన విధంగా వ్యవహరించలేదని ఒప్పుకుంటున్నాడు. “నాకు కోపమొచ్చినప్పుడు ఆమెను కొట్టేవాడ్ని కూడా” అని ఒప్పుకుంటూ, “అయితే నేను నా పద్ధతులను మార్చుకోవాలని బైబిలు నాకు బోధించింది. నేను ఇప్పుడు నా కోపాన్ని అదుపు చేసుకునేందుకూ, నా భార్యను నా సొంత శరీరమువలె ప్రేమించేందుకు కఠిన యత్నం చేస్తున్నాను. మేమిరువురము ఇప్పుడు మునుపటికన్నా చాలా సంతోషంగా ఉన్నాం” అని ఆయన అంటున్నాడు. (కొలొస్సయులు 3:9, 10, 19) “మా సమాజంలోని అనేక మంది భర్తలు చూపించేదానికన్నా ఎక్కువ గౌరవంతో, అనురాగంతో మైకిల్‌ ఇప్పుడు నన్ను చూసుకుంటున్నారు. మేము సమస్యల గురించి మాట్లాడుకోగలుగుతాం, ఒక జట్టుగా కలిసి పని చేస్తాం” అని ఆయన భార్య కమ్‌ఫర్ట్‌ అంగీకరిస్తుంది.

స్త్రీలకు అన్యాయం చేయడం మన సృష్టికర్తను చాలా అప్రీతిపరుస్తుందని స్పష్టం చేసే దేవుని వాక్యంలోని నిర్దేశాలను హృదయానికి తీసుకున్నందువల్ల పేడ్రో మరియు మైకిల్‌లు తమ భార్యలను గౌరవించడాన్నీ, వారి మీద ప్రేమ చూపించడాన్నీ నేర్చుకున్నారు.

స్త్రీల విషయమై దేవునికున్న చింత

దేవుడు స్త్రీల గురించీ, వారి సంక్షేమం గురించీ ఎల్లప్పుడూ చింత కల్గివున్నాడు. మొదటి తల్లిదండ్రుల తిరుగుబాటు మూలంగా, స్త్రీలు ‘ఏలబడడానికి’ అపరిపూర్ణత కారణమౌతుందని దేవుడు వారితో చెప్పినప్పటికీ, అది ఆయన సంకల్పం కానే కాదు. (ఆదికాండము 3:16) ఆయన హవ్వను ఆదాముకు “పూరకము”గాను ఆయనకు ఒక సహచరిగాను సృష్టించాడు. (ఆదికాండము 2:18, NW) ప్రాచీన ఇశ్రాయేలీయులకివ్వబడిన మోషే ధర్మశాస్త్రంలో విధవరాండ్రతో నీచంగా వ్యవహరించడాన్ని యెహోవా స్పష్టంగా ఖండించాడు. వారితో దయాపూర్వకంగా వ్యవహరించాలనీ, వారికి సహాయం చేయాలనీ ఆయన ఇశ్రాయేలీయులకు నిర్దేశించాడు.—నిర్గమకాండము 22:22; ద్వితీయోపదేశకాండము 14:28, 29; 24:17-22.

యేసు తన పరలోక తండ్రిని అనుకరించడంలో, ఆయన కాలంలో సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి, స్త్రీలను అప్రతిష్ఠపాలుచేసిన పారంపర్యాన్ని అనుసరించలేదు. ఆయన స్త్రీలతో—చెడ్డ పేరు సంపాదించిన వాళ్ళతో కూడా—దయాపూర్వకంగా మాట్లాడాడు. (లూకా 7:44-50) అంతేకాక, ఆరోగ్య సమస్యలున్న స్త్రీలకు సహాయం చేయడంలో ఆయన సంతోషించాడు. (లూకా 8:43-48) ఒక సందర్భంలో, ఆ సమయంలో చనిపోయిన తన ఏకైక కుమారుని విషయమై దుఃఖిస్తున్న విధవరాలిని చూసినప్పుడు, ఆయన వెంటనే అంత్యక్రియలకోసం తీసుకువెళ్తున్న పాడె దగ్గరకు వెళ్లి, ఆ యౌవనస్థుడిని పునరుత్థానం చేశాడు.—లూకా 7:11-15.

యేసు తొలి శిష్యుల్లో స్త్రీలున్నారు. ఆయన పునరుత్థానానికి మొదటి సాక్షులు స్త్రీలే. ఆతిథ్యానికీ, సానుభూతికీ, ధైర్యానికీ మాదిరులుగా లూదియ, దొర్కా, ప్రిస్కిల్ల అనే స్త్రీలను గురించి బైబిలు చాలా ఉన్నతంగా చెబుతోంది. (అపొస్తలుల కార్యములు 9:36-41; 16:14, 15; రోమీయులు 16:3, 4) స్త్రీలకు గౌరవం చూపాలని తొలి క్రైస్తవులకు నేర్పబడింది. అపొస్తలుడైన పౌలు తన తోటి మిషనరీయైన తిమోతికి “వయస్సు మళ్ళిన స్త్రీని నీ తల్లిగా, పిన్న వయస్సుగల స్త్రీని పవిత్ర హృదయంతో నీ సోదరిగా భావించు” అని చెప్పాడు.—1 తిమోతి 5:2, పరిశుద్ధ బైబల్‌.

గౌరవాన్ని కనుగొనిన స్త్రీలు

మీరు ఒక క్రైస్తవ పురుషుడైతే, మీరు కూడా స్త్రీలకు అదే గౌరవాన్నిస్తారు. మీరు వారితో నీచంగా వ్యవహరించేందుకు సాంప్రదాయాన్ని సాకుగా తీసుకోరు. అంతేకాక, స్త్రీలను గౌరవంగా చూడడం మీ విశ్వాసానికి ధారాళమైన రుజువునిస్తుంది. (మత్తయి 5:16) ఆఫ్రికాలోని సలీమా అనే ఒక యువతి క్రైస్తవ సూత్రాలను ఆచరణలో చూడడం వల్ల ఎలా ప్రయోజనం పొందిందో చెబుతుంది.

“స్త్రీలను, బాలికలను నీచంగా చూసే వాతావరణంలో పెరిగాను. మా అమ్మ రోజుకు 16 గంటలు పనిచేసేది. ఆమె ఏదైనా పనిని ముగించకపోతే, ఫిర్యాదులు మాత్రం వినవలసి వచ్చేది. అంత కంటే ఘోరంగా, మా నాన్న అమితంగా త్రాగి వచ్చినప్పుడు ఆమెను కొట్టేవాడు. మా ప్రాంతంలోని మిగతా స్త్రీలు కూడా ఇలాగే పీడించబడ్డారు. కానీ అలా వ్యవహరించడం తప్పని, అది మా జీవితాల్లో నిరాశను అసంతోషాన్ని నింపుతుందని నాకు తెలుసు. అయినప్పటికీ, ఈ పరిస్థితులు మార్చే దారేదీ ఉన్నట్లు కనిపించలేదు.

“అయితే, నేను కౌమార ప్రాయంలో ఉన్నప్పుడు, యెహోవాసాక్షులతో బైబిలు పఠించడం మొదలుపెట్టాను. స్త్రీలను ఘనపర్చాలి అని అపొస్తలుడైన పేతురు వ్రాసిన మాటలను చదివినప్పుడు నేను చాలా ముగ్ధురాలనయ్యాను. కానీ, ‘ముఖ్యంగా మా స్థానిక సంప్రదాయం దృష్ట్యా ప్రజలు ఈ ఉపదేశాన్ని అన్వయించడమన్నది జరగని పని’ అని అనుకున్నాను.

“అయినప్పటికీ, సాక్షులు కూటాలను జరుపుకునే రాజ్య మందిరానికి వెళ్ళినప్పుడు, పురుషులూ, స్త్రీలూ నాతో ఒకేలా దయాపూర్వకంగా వ్యవహరించారు. ఇంకా ఆశ్చర్యపరచినదేమంటే, వాళ్ళలో, భర్తలు తమ భార్యల విషయంలో నిజంగా శ్రద్ధ తీసుకున్నారు. నేను తర్వాత అక్కడ ఉన్న వ్యక్తులను ఇంకా బాగా తెలుసుకున్నప్పుడు, సాక్షులందరూ అలా చేయాలని ఎదురుచూడబడుతుందని గ్రహించాను. కొంతమంది పురుషులు మాకులాంటి నేపథ్యం నుండి వచ్చినవారే ఐనప్పటికీ, వాళ్ళు ఇప్పుడు స్త్రీలను గౌరవంగా చూస్తున్నారు. ఈ పెద్ద కుటుంబంలో నేనూ ఒకదానిని కావాలనుకున్నాను.”

ఒక శాశ్వత పరిష్కారం

సలీమా గమనించిన గౌరవం ఏదో కాకతాళీయమైనది కాదు. అది దేవుని వాక్యంపై ఆధారపడిన బోధనా కార్యక్రమ ఫలితమే. అది దేవుడు చేస్తున్నట్లే ఒకరికొకరు విలువనిచ్చుకోవడానికి సహాయపడుతుంది. ఇప్పుడు కూడా ఏమి చేయవచ్చు, భూమ్యంతటా కూడా దేవుని రాజ్యం ఏలుతున్నప్పడు ప్రతిచోటా ఏమి జరుగుతుంది అనేవాటిని అది సూచిస్తుంది. (దానియేలు 2:44; మత్తయి 6:10) ఈ పరలోక ప్రభుత్వం సకల విధములైన అవినీతినీ నిర్మూలిస్తుంది. బైబిలిలా హామీ ఇస్తుంది: “నీ [యెహోవా] తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.”—యెషయా 26:9.

ఇప్పుడు కూడా, నీతియందలి విద్యాభ్యాసం లక్షలాది మంది ప్రజల ఆలోచనా సరళిని మార్చివేస్తుంది. జీవిస్తున్న సకల మానవులు దేవుని రాజ్యానికి లోబడుతున్నప్పుడు, ఈ విద్యాభ్యాసం భూదిగంతముల వరకూ కొనసాగి, ఆదాము పాపం ఫలితంగా పురుషులు స్త్రీలను అణచివేస్తున్న పద్ధతిని అంతం చేస్తుంది. స్త్రీల ఎడల అన్యాయంగా వ్యవహరించే ప్రవృత్తి తన పరిపాలనకు భంగం కలిగించేందుకు దైవ నియుక్త రాజైన యేసుక్రీస్తు అనుమతించడు. క్రీస్తు యొక్క ఆ పరిపాలనను గురించి వర్ణిస్తూ బైబిలు ఇలా చెబుతుంది: “దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును.”—కీర్తన 72:12-14.

ఈ శీర్షికల పరంపర స్త్రీల సమస్యల మీద కేంద్రీకరించింది. అయితే, అనేక మంది పురుషులతో కూడా నీచంగా వ్యవహరించడం జరుగుతోందన్నది కూడా గుర్తించబడింది. చరిత్ర అంతటా కూడా శక్తిమంతులైన దుష్టులైన పురుషులు మగవాళ్ళనూ అలాగే ఆడవాళ్ళనూ చెప్పలేనంత భయంకరంగా హింసించారు. కొంత మంది స్త్రీలు కూడా అలాగే చేశారు. ఉదాహరణకు, నిరపరాధుల రక్తాన్ని చిందించిన యెజెబెలు, అతల్యా, హేరోదియ అనే దుష్ట స్త్రీలను గురించి బైబిలు ప్రస్తావిస్తోంది.—1 రాజులు 18:4, 13; 2 దినవృత్తాంతములు 22:10-12; మత్తయి 14:1-11.

అలా, సకల మానవజాతికి దేవుని రాజ్యపాలన క్రింద ఉండే ఆయన క్రొత్త లోకం అవసరం. త్వరలోనే, ఆ రోజు ఉదయించినప్పుడు, స్త్రీల ఎడల గానీ, పురుషుల ఎడల గానీ వివక్ష చూపబడదు లేదా నీచంగా వ్యవహరించడం జరుగదు. బదులుగా, ప్రతిరోజు ప్రతి ఒక్కరూ “ఆనంద భరితులౌతారు.”—కీర్తన 37:11, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.

[13వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ భర్తలు బైబిలు మార్గదర్శకాలను అనుసరిస్తారు, తమ భార్యలను గౌరవిస్తారు, ఘనపరుస్తారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి