కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 4/8 పేజీ 31
  • నీళ్ళూ, మీ ఆరోగ్యమూ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నీళ్ళూ, మీ ఆరోగ్యమూ
  • తేజరిల్లు!—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • మంచినీరు
    తేజరిల్లు!—2023
తేజరిల్లు!—1998
g98 4/8 పేజీ 31

నీళ్ళూ, మీ ఆరోగ్యమూ

“మీ శరీరానికి ఎన్ని నీళ్ళు అవసరమో మీ దప్పికను బట్టి తెలుసుకోలేరు” అని హెల్త్‌ అనే పత్రిక చెబుతోంది. అయినప్పటికీ, మన శారీరక, భావోద్వేగ క్షేమానికీ, మన రూపం చక్కగా ఉండేందుకు కూడా బోలెడన్ని నీళ్ళు త్రాగడం అత్యవసరం. మన శరీరం చెమటా, కన్నీరూ, మూత్రవిసర్జనా, అలాగే మన ఉచ్ఛ్వాస ద్వారా నీటిని కోల్పోతూనే ఉంటుంది. కోల్పోయిన ఈ ద్రవం స్థానంలో వేరే భర్తీ కావాలి. ఎన్ని నీళ్ళు కావాలి? ప్రతిరోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్ళు—రెండు లీటర్ల నీళ్ళు—త్రాగాలని చాలా మంది అధికారులు సిఫారసు చేస్తున్నారు.

ఎందుకని? పోషకాలను మన శరీర అంతరాల్లోకి మోసుకువెళ్లేందుకూ, వ్యర్థపదార్థాలను తీసివేసేందుకూ నీళ్ళు అత్యవసరం. మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకూ, కీళ్ళను నున్నగా ఉంచేందుకూ నీళ్ళు అవసరం. “నీళ్ళు ఏ మాత్రం తక్కువపడినా మీరు అలిసిపోయినట్లు . . . లేదా అస్వస్థగా ఉన్నట్లు మీకు అనిపిస్తుంది” అనీ “నిర్జలీకరణం అలసటకు కారణమన్నది సాధారణంగా నిర్లక్ష్యం చేయబడుతుంది” అనీ హెల్త్‌ పేర్కొంటోంది. ఆ పత్రిక ఇలా సిఫారసు చేస్తోంది: “కాఫీ, టీ వంటి ద్రవపదార్థాల వల్ల, కాఫీపదార్థం కలిపిన పానీయాల వల్ల, మద్యంవల్ల మోసపోవద్దు; నిజానికి అవి నిర్జలీకరణానికే దోహదపడతాయి.” కఫీన్‌ మరియు మద్యమూ మరింత మూత్ర విసర్జనకూ కారణమౌతూ, శరీరం నిర్జలీకరణానికి గురయ్యేందుకు కారణమౌతాయి.

అంతే కాక, “మీ చర్మం మెత్తగా మృదువుగా ఉండేందుకు నీళ్ళు అవసరం.” దీనికి సహాయపడేందుకు మాయిశ్చరైజర్లను చర్మానికి రాసుకోవచ్చు కూడా. కాని అవి తేమని అధికం చేయవు. అయితే చర్మంలో అప్పటికే ఉన్న తేమను నిలబెట్టేటువంటి సంరక్షక కవచాన్ని అవి ఏర్పరుస్తాయి. మనం వార్ధక్యానికి ఎదుగుతున్న కొలది, నీళ్ళను నిలుపుకునే శక్తిని మన చర్మం కోల్పోతుంది గనుక, ఈ తేమని నిలుపు కోవడం వయస్సు పెరుగుతున్న కొలది మరింత ప్రాముఖ్యమౌతుంది.

విచారకరంగా, ప్రపంచంలోని అనేక చోట్లా, అవసరమైన, స్వచ్ఛమైన, శుభ్రమైన నీళ్ళను పొందేందుకు గణనీయమైన ప్రయత్నం అవసరమౌతుంది. అయితే అది ప్రయత్నించదగినదే. నిస్సందేహంగా, బోలెడన్ని నీళ్ళను త్రాగండి. మీరు చక్కగా కనిపించేందుకూ, మీరు సురక్షితంగా భావించేందుకూ సులభమైన ఈ పద్ధతి వల్ల ప్రయోజనాన్ని పొందండి!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి