కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 4/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనం ప్రేమించేవాళ్లు ఎవరైనా యెహోవాకు దూరమైతే . . .
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • పాఠకుల ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
  • బహిష్కరించబడిన వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి?
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 4/8 పేజీ 30

మా పాఠకుల నుండి

ఆరోగ్యకరమైన వినోదం నేను యెహోవాసాక్షుల్లో ఒకరినయ్యేందుకు పఠిస్తున్నాను. “ఆరోగ్యకరమైన వినోదం కొరకు అన్వేషణ” (జూన్‌ 8, 1997) అనే పరంపరను ప్రచురించినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. టీవీలో చూడతగ్గ కార్యక్రమాలు చాలా తక్కువగా ఉంటాయి. మాకందరికీ—చిన్నలకూ, పెద్దలకూ—మీరు చాలా మంచి సలహా ఇచ్చారు. ఇలాంటి అంశాలపై సమాచారాన్ని తెలియజేయడంలో మీరు కొనసాగుతారని ఆశిస్తున్నాను.

డి. డబ్ల్యు., అమెరికా

దేవుడు నా స్నేహితుడుగా ఉంటాడా “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . దేవుడు నా స్నేహితుడుగా ఉంటాడా?” (జూన్‌ 8, 1997) అనే చక్కని శీర్షికను బట్టి మన దయామయుడైన సృష్టికర్తకు నేను చాలా కృతజ్ఞురాలిని. కొద్ది కాలం క్రితం, నాకు ఎంత మంది స్నేహితులుండగలరనే విషయమై నేను ఒక ప్రశ్నావళిని నింపాను. చివరికి వచ్చిన ఫలితం నా చుట్టూ ఎల్లప్పుడూ స్నేహితులుంటారన్న భరోసానిచ్చింది. విచారకరంగా, అది పూర్తి అబద్ధమని తర్వాత తేలింది. అయినప్పటికీ, యెహోవా దేవుడు మాత్రమే మన ఉత్తమ స్నేహితుడన్న విషయాన్ని నేను గ్రహించాను. మనం యెహోవా దేవునికి స్నేహితులం కాకపోతే, మరి మిగిలినదంతా అర్థరహితమేనన్నది నిజం.

ఏ. టీ. ఎమ్‌., మెక్సికో

మీరు యౌవనస్థుల మీద చూపిస్తున్న ఆసక్తికి కృతజ్ఞతలు. “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . దేవుడు నా స్నేహితుడుగా ఉంటాడా?” అనే శీర్షిక నాకు సరిగ్గా అత్యవసరంగా ఉన్నప్పుడే అందింది. నేను బహిష్కరించబడి, ఇటీవలే తిరిగి చేర్చుకోబడ్డాను. కొన్నిసార్లు ఒంటరితనాన్ని అనుభవించేవాడ్ని, అనేక సందేహాలతో బాధపడేవాడ్ని—అందులో ఒక సందేహం దేవుడు నా మొర ఆలకిస్తాడా అన్నదే. “శరీరములో ఒక ముల్లు” అనే ఉపశీర్షిక క్రింద పౌలు ఉదాహరణను విశ్లేషించిన తర్వాత, క్రమంగా బైబిలును పఠించడం ద్వారా, నిష్కపటమైన ప్రార్థన ద్వారా యెహోవా నుండి ఆశీర్వాదం పొందేందుకు ఎదురు చూడాలని నిర్ణయించుకున్నాను. యెహోవా నా స్నేహితునిగా ఉండడంలో కొనసాగుతాడా అన్న ఒక ప్రశ్నకు స్పష్టమైన జవాబు లభించింది.

జె. సి. ఎ., అర్జెన్టీనా

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నాకు 12 ఏండ్లు. నేను స్కూలుకు వెళ్తాను. నేను మీ పత్రికలను చదివి చాలా ఆనందిస్తాను. నేను వాటిని చదవనారంభించక ముందు, నా కన్నా పెద్దవారితో సహవసించడం నాకు కష్టంగా ఉండేది. కానీ, “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .” అనే భాగంలోని తేజరిల్లు! శీర్షికలను చదివిన తర్వాత నాకు ఇప్పుడు అది సునాయాసంగా అనిపిస్తుంది. మీకు కృతజ్ఞతలు!

ఎన్‌. టి., రష్యా

మా పాఠకుల నుండి నేను 26 సంవత్సరాలుగా తేజరిల్లు! క్రమ పాఠకురాలిని. మునుపటిలాగే ఇప్పటికీ నేనీ పత్రికను మెచ్చుకుంటున్నాను. “మా పాఠకుల నుండి” అనే భాగాన్ని ఎన్నడూ చదవకుండా ఉండలేదు. ఎందుకంటే అందులోని వ్యాఖ్యానాలు నేను శీర్షికలను మళ్ళీ చదివేలా చేస్తాయి. ఈ చక్కని పత్రికలకు మీకు కృతజ్ఞతలు.

ఎమ్‌. బి., ఫ్రాన్స్‌

నేను అందుకున్న అన్ని పత్రికలూ నాకు నచ్చాయి. నేను ముఖ్యంగా జూన్‌ 8, 1997 తేజరిల్లు! (ఆంగ్లం) లో బహిష్కరించబడడాన్ని గూర్చిన పాఠకుల వ్యాఖ్యానాన్ని చాలా ఆస్వాదించాను. నేను బహిష్కరించబడి, తర్వాతి సంవత్సరం తిరిగి చేర్చుకోబడ్డాను. ఈ చర్య కఠినమైనదని చాలా మంది ప్రజలు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నాకు లభించిన క్రమశిక్షణను అంగీకరించడం కష్టమే కానీ, కఠినమైనది కాదు. పెద్దలు నాకు సహాయం చేసేందుకే ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు. వాళ్ళ సహాయాన్ని నేను నిరాకరించడమే నన్ను బహిష్కరించడానికి కారణమైంది. యెహోవా తోడు లేకపోతే జీవితం ఎంత ఒంటరితనంగా ఉంటుందో ఒకసారి బహిష్కరించబడిన తర్వాత గ్రహించాను. నా జీవితంలో చాలా పెద్ద శూన్యతే ఉండేది. నేను నా జీవిత విధానాన్ని మార్చుకుని, యెహోవా వైపుకు మళ్ళే వరకు ఆ శూన్యతను భర్తీ చేసుకోలేకపోయాను. బహిష్కరణ నన్ను తగ్గించి, నాకు యెహోవా, ఆయన సంస్థా అవసరమని చూపించింది.

ఏ. సీ., కెనడా

తేజరిల్లు! ఇంత చక్కని పత్రికయైన తేజరిల్లు! చందాను నవీకరించడం మరిచిపోయినందుకు మీరు నన్ను మన్నించాలి. ఇది చాలా విజ్ఞానదాయకమైన, విద్య నేర్పించేదైన, ప్రేరేపించేటువంటి జాగరూకతను కలిగించేటువంటి అంశాలుగల వాస్తవాలపై ఆధారపడిన పత్రిక. నేను అందుకోని ముందటి సంచికలన్నీ నాకు కావాలి. ఒక్కటి కూడా వదులుకోలేను. అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మీరు ఓపికతో సహాయం చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు.

ఎన్‌. ఎస్‌., శ్రీలంక

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి