క్షీణించిపోతున్న వివాహబంధానికి సహాయం
న్యూజీలాండ్లోని నార్త్ ఐలండ్లోని ఒక స్త్రీ కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకాన్ని గురించి ఇలా వ్రాసింది: “నేను ఈ ప్రచురణను పఠించడానికి మొదటిసారి కూర్చున్నప్పుడు, మా దాంపత్య జీవితాన్ని ‘సార్థకం చేసుకునేందుకు నేను ప్రయత్నించడమో లేక విడిపోవడమో’ చేయవలసిన ఘట్టంలో ఉందన్నట్లు భావించాను.”
ఆమె తన నేపథ్యాన్ని వివరించింది. “మా అమ్మ చేసుకున్న రెండు పెళ్ళిళ్ళలోనూ క్రూరత్వాన్నే అనుభవించింది. దాని కారణంగా, మగవాళ్ళ ఉద్దేశం ఆడవాళ్ళను అణచివేయడమే తప్ప మరేమీ కాదని మాకెల్లప్పుడూ బోధించింది. కనుక నేను చాలా మొండిదానిగా, వాదనను ఆపని తలబిరుసు స్త్రీగా పెరిగాను.”
ఆ స్త్రీ మార్పులు చేసుకోవలసిన అవసరతను గ్రహించింది. “నేను నా భర్తకు లోబడనిదాననూ, మహాచెడ్డ అహంభావినీ గనుకనే నేను కుటుంబ సంతోషానికి తావివ్వడం లేదని గ్రహించాను.” కనుక ఆమె వివరిస్తున్నట్లు చాలా ప్రాముఖ్యమైన సవరింపులు చేసుకుంది: “నేనూ నా భర్తా ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఒక కుటుంబంగా పఠిస్తున్నాం. ఒక క్రైస్తవ భార్యగా ఉండేందుకు నేను ఇప్పటికీ నేర్చుకుంటున్నాను. మామధ్య ఇప్పుడు నెలకొనివున్న సంబంధాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. అయితే, ఇంకా ఎంతో అభివృద్ధి సాధించవలసి ఉంది.
“మా ఇల్లు మునుపెన్నడూ ఇంత ప్రేమపూర్వకంగా శాంతియుతంగా ఉండేది కాదు.”
ఆరు రూపాయల ధరగల దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే 32 పేజీల బ్రోషూర్లో, 8వ పాఠం “దేవుడ్ని ప్రీతిపర్చే కుటుంబ జీవితం” గురించి చర్చిస్తుంది. మీరు ఆ బ్రోషూర్ను పొందగోరుతున్నట్లయితే Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India, అనే చిరునామాకు లేదా 5వ పేజీలో ఇవ్వబడిన సముచితమైన చిరునామాకు వ్రాయండి. ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఉచిత బైబిలు పఠనాన్ని నిర్వహించాలని కూడా మీరు ఇష్టపడుతున్నట్లయితే, దయచేసి ఆ విషయాన్ని కూడా పేర్కొనండి.