కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 4/8 పేజీ 14
  • మీరు మీ పళ్ళు పటపటలాడిస్తారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు మీ పళ్ళు పటపటలాడిస్తారా?
  • తేజరిల్లు!—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీకు కట్టుడుపండ్లు అవసరమా?
    తేజరిల్లు!—1993
  • ఆర్తోడాన్టిక్స్‌—ఏమి ఇమిడి ఉంది?
    తేజరిల్లు!—1998
  • సుకుమారమైన పళ్లను కాపాడడం
    తేజరిల్లు!—2001
  • దంతవైద్యుని దగ్గరికి ఎందుకు వెళ్లాలి?
    తేజరిల్లు!—2007
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 4/8 పేజీ 14

మీరు మీ పళ్ళు పటపటలాడిస్తారా?

ప్రాచీన సమయాలనుండీ కూడా ప్రజలు ఒత్తిడిని అనుభవిస్తున్నప్పుడు తమ పళ్లు పటపటలాడించారు. క్రోధాన్నీ లేక బాధనూ సూచించేందుకు బైబిలు పండ్లు కొరకడాన్నీ లేక నూరడాన్నీ ఉపయోగిస్తుంది. (యోబు 16:9; మత్తయి 13:42, 50) కోపంతోనూ ఒత్తిడితోను నిండిన నేటి లోకంలో, లక్షలాదిమంది ప్రజలు అక్షరార్థంగా తమ పళ్లు పటపటలాడిస్తారు, మరి అనేకులకు తామలా చేస్తున్నామనే విషయం అసలు తెలియదు. వారు తమ పళ్లను అరగదీసుకుంటూ ఉండవచ్చు.

అసలు కొందరు ప్రజలు తమ పళ్లనెందుకు పటపటలాడిస్తారు? దానికున్న కారణాలు కాస్త సంక్లిష్టంగానూ పూర్తిగా అర్థంకాని విధంగానూ ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో భావోద్రేక ఒత్తిడి అసలైన కారణమని స్పష్టంగా కనిపిస్తుంది. యూసీ బర్కలే వెల్‌నెస్‌ లెటర్‌ ఇలా పేర్కొంటుంది: “తమ పళ్లు పటపటలాడించే వారు తాము వైవాహిక లేక ఆర్థిక సమస్యలను అనుభవిస్తున్నామనీ, తాము ఆఖరి పరీక్షలు వ్రాయబోతున్నామనీ, తమ ఉద్యోగాన్ని కోల్పోతామనే భయాన్ని కలిగి ఉన్నామనీ లేక వత్తిడిని ఎదుర్కుంటున్నామనీ తరచూ నివేదిస్తారు.” ఇతర సాధ్య కారకాలూ, కారణాంకాల్లో పై పళ్లకూ క్రింది పళ్లకు మధ్య సరైన అనుసంధానం లేకపోవడం, కలత నిద్ర లేక మత్తుపానీయాల సేవనం కూడా ఇమిడివుండవచ్చు. కాబట్టి, బాధితులు మత్తుపానీయాల మోతాదును తగ్గించేందుకు ప్రయత్నించాలనీ; నిద్రకు ఉపక్రమించే ముందు, వెచ్చని నీళ్లతో స్నానం చేయడం వంటి స్వల్ప చర్యలు తీసుకోవాలనీ; లేక కలత కలిగిస్తున్న సమస్యలను గురించి ఒక స్నేహితునితోనో లేక నమ్మకస్థుడైన సలహాదారుతోనో మాట్లాడాలనీ వెల్‌నెస్‌ లెటర్‌ సలహా ఇస్తోంది.

పగటి వేళ మీరు పళ్ళు పటపటలాడిస్తున్నారని లేక నూరుతున్నారనీ మీరు గమనించవచ్చు. అయితే మీరు నిద్రలో అలా చేస్తుంటే మీకా విషయం ఎలా తెలుస్తుంది? బ్రూక్సిజమ్‌ అని పిలువబడే దీర్ఘకాలికంగా పళ్లు పటపటలాడించడం అనేది కొన్నిసార్లు, అదే గదిలో నిద్రపోతున్న ఇతరులకు మెలకువ కలిగించేంత పెద్ద శబ్దాన్ని కలిగిస్తుంది. మీరు నిద్ర లేచినప్పుడు మీకు కణతల్లో బాగా నొప్పిగా ఉండవచ్చు, లేక మీ దవడలు కటుక్కుమనే శబ్దాలు చేయవచ్చు.a మీ పళ్ళు బాగా అరిగిపోయి ఉన్నాయని మీ దంత వైద్యుడు గమనించవచ్చు. రాత్రుల్లో మీ పళ్లపై రక్షక ఉపకరణాన్ని పెట్టుకోవడం వంటి, ఉపశమనాన్ని కలిగించే చర్యలు తీసుకోవడాన్ని గురించి ఆయన సిఫారసు చేయవచ్చు. ఇటువంటి నోటి రక్షణ ఉపకరణం మీరు పళ్లు నూరకుండా ఉండేలా చేయలేకపోయినప్పటికీ, మీ పళ్లకు ఇంకా అధికంగా నష్టం కలుగకుండా ఉండేందుకు అది వీలు కలిగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, రిలాక్స్‌ అవ్వండి! మీరు ఎంత తక్కువ చింత కలిగి ఉంటే, మీరు మీ పళ్లను అంత తక్కువగా పటపటలాడిస్తారు.

[అధస్సూచి]

a అదనపు సమాచారం కొరకు, జూన్‌ 22, 1991 తేజరిల్లు! 20-2 పేజీలను (ఆంగ్లం) దయచేసి చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి