దెబ్బలాడుకోకుండా ఉండేందుకు అది వారికి సహాయం చేసింది
అమెరికా, కాలిఫోర్నియా నుండి 11 ఏండ్ల ఒకబ్బాయి, యెహోవాసాక్షులకు ఇలా వ్రాశాడు:
“నేను మీ పుస్తకాలను ఇష్టపడతాను, ప్రత్యేకించి కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకాన్ని. ఆ పుస్తకాన్ని మేము పొందకముందు, నేను మా అక్క ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళం. ఒకరోజు, ఆ పుస్తకాన్ని చదవాలని మేము నిర్ణయించుకున్నాము, అప్పుడు దేవుడు మనం ఏం చేయాలని ఆశిస్తున్నాడో దాన్ని మేము చేయట్లేదని తెలుసుకున్నాము.
“ఈ పుస్తకం మాకు ఎంతో సహాయం చేసింది. దానికి నేనెంతో రుణపడి ఉన్నాను, అంతేకాదు ఇతర కుటుంబాలను కూడా ఈ పుస్తకాన్ని చదువమని ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే ఇది అంత చక్కగా ఉంది. ఇది మా ఇంట్లో శాంతి, సంతోషాలు కనుగొనడానికి కూడా సహాయపడుతుంది.”
కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే 192 పేజీల ఈ పుస్తకం “మీ కుటుంబాన్ని వినాశకర ప్రభావాలనుండి కాపాడండి,” “మీ గృహంలో శాంతిని కాపాడుకోండి,” “కుటుంబానికి హాని కలిగించే సమస్యలను మీరు అధిగమించగలరు” వంటి సహాయకరమైన విషయాలను చర్చిస్తుంది.
మీతో ఎవరన్నా ఉచిత బైబిలు పఠనం చేయాలని మీరు ఇష్టపడుతున్నట్లయితే, దయచేసి Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India, అనే చిరునామాకు లేదా 5వ పేజీలో ఉన్న సముచితమైన చిరునామాకు వ్రాయండి.