ఆయన సంశయవాదం అధిగమించబడింది
కరీబియన్ సముద్ర ద్వీపమైన జమైకాలోని ఒక యౌవనస్థుడిని యెహోవాసాక్షులు కలిశారు. ఆ యౌవనుడు దేవుని ఉనికి విషయమై చాలా సందేహాస్పదంగా ఉన్నాడు, అంతేకాదు బైబిలు దైవ ప్రేరేపితం అన్న విషయాన్ని కూడా తిరస్కరించాడు. అయితే, బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఆయన అయిష్టంగానే తీసుకున్నాడు. సాక్షులు ఆయన్ని పునర్దర్శించారు, కానీ చివరికి ఆయన మళ్లీ తాను ఆహ్వానించేంత వరకు తిరిగి రావద్దని వారికి చెప్పేశాడు.
“కొన్ని నెలల తర్వాత, ఆయన ఫోన్ చేసి చాలా ప్రశ్నలు అడిగాడు. అప్పటికి ఆయన బైబిలులోని జవాబులపట్ల ఇంకా విమర్శనాత్మకంగానే ఉన్నాడు” అని సాక్షులు చెప్పారు.
కొంతకాలానికి, ఈ యౌవనస్థునికి నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకాన్ని ఇచ్చి, ఆయనతో క్రమంగా బైబిలు పఠనం చేయడం ప్రారంభించారు. దాని తర్వాత కొద్ది రోజులకే, ఆయనిలా వ్యాఖ్యానించాడు: “ఇటువంటి పఠనం ఎందుకు అవసరమో నాకిప్పుడు అర్థమైంది.” తాను నేర్చుకుంటున్నదాన్ని బట్టి ఆయన ఎంత ఉత్తేజంతో నిండిపోయాడంటే వారానికి రెండుసార్లు పఠనం చేద్దామని అడిగాడు. త్వరలోనే ఆయన సంఘ కూటాలకు క్రమంగా హాజరుకావడం ప్రారంభించాడు.
బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? అనే పుస్తకం చదవడం ద్వారా, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం పఠించడం ద్వారా లక్షలాదిమంది విశ్వాసం దృఢపర్చబడింది. ఈ పుస్తకాల ప్రతులు మీకు కావాలనుకుంటే లేక ఎవరైనా మీతో గృహ బైబిలు పఠనం నిర్వహించాలనుకుంటే, దయచేసి Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India, అనే చిరునామాకు లేదా 5వ పేజీలో ఉన్న మరో సముచితమైన చిరునామాకు వ్రాయండి.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? పుస్తకం కవరు: మూడవ శతాబ్దపు పపైరస్, ఎస్తేరు పుస్తకం యొక్క హెబ్రీ గ్రంథపు చుట్ట: The Trustees of the Chester Beatty Library, Dublin; అలెగ్జాండర్ ది గ్రేట్ బస్ట్ సైజు ప్రతిమ: Musei Capitolini, Roma