“జ్ఞానపు భాండాగారం”
నైజీరియాలోని లాగోస్‌లో దన్యూస్ అనే పత్రికలో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆ దేశంలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి వ్రాస్తూ, తేజరిల్లు! పత్రిక గురించి పైవిధంగా వర్ణించాడు. ఆయనిలా వివరించాడు:
“నేను తేజరిల్లు! కాపీని చదివిన ప్రతిసారి మీకు వ్రాయాలన్న ప్రేరణ కలుగుతుంది. కానీ తరచూ ఏమౌతుందంటే, నేను ఉత్తరం వ్రాద్దామనుకునే సరికే మొదటిదానంత అందంగానూ నిజానికి అంతకన్నా శ్రేష్ఠంగా ఉన్న మరొక పత్రిక వచ్చి నన్ను పూర్తిగా సమ్మోహనపరుస్తుంది.
“మొత్తంమ్మీద నేను చెప్పదల్చుకున్నది? నా అభిప్రాయం ప్రకారం తేజరిల్లు! జ్ఞానపు భాండాగారం. అంత అమూల్యమైన, అందమైన, సమతుల్యతగల ప్రచురణను, అంత నైపుణ్యవంతంగా రూపొందించబడిన ప్రచురణను నేను చాలా అరుదుగా చూశాను. అది మానవజాతికి అమూల్యమైన బహుమతి.
“నా హృదయపు లోతుల్లోనుండి నేనిది చెప్పాలనుకుంటున్నాను: మీకు వేలాది కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన పనిని కొనసాగించండి.”
మీరు కూడా తేజరిల్లు! చదవడం నుండి ప్రయోజనం పొందుతారని మాకు నమ్మకం ఉంది. మీరు మరొక కాపీని పొందాలనుకుంటే లేక ఎవరైనా మీ ఇంటివద్ద మీతో బైబిలును గూర్చి చర్చించాలనుకుంటే దయచేసి WatchTower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India, అనే చిరునామాకు లేదా 5వ పేజీలో ఉన్న మరో సముచితమైన చిరునామాకు వ్రాయండి.