కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 8/8 పేజీలు 3-4
  • ఇంటర్‌నెట్‌ అంటే ఏమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇంటర్‌నెట్‌ అంటే ఏమిటి?
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అసలు అదేమిటి?
  • భూవ్యాప్తంగా అందుబాటులోవున్న ఇంటర్నెట్‌ను జ్ఞానయుక్తంగా ఎలా ఉపయోగించుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ఇంటర్‌నెట్‌ ఎందుకు అప్రమత్తంగా ఉండాలి?
    తేజరిల్లు!—1997
  • మీకు నిజంగా ఇంటర్‌నెట్‌ అవసరమా?
    తేజరిల్లు!—1997
  • ఇంటర్‌నెట్‌ సర్వీసులు, సమాచార వనరులు
    తేజరిల్లు!—1997
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 8/8 పేజీలు 3-4

ఇంటర్‌నెట్‌ అంటే ఏమిటి?

అమెరికాలో ఓ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న డేవిడ్‌ ఇంటర్‌నెట్‌ను ఉపయోగించి బోధనా అంశాలను సంపాదించాడు. కెనడా దేశస్థుడైన ఓ తండ్రి రష్యాలోవున్న తన కుమార్తెతో సదా సంబంధాన్ని కలిగివుండేలా దాన్ని ఉపయోగించుకున్నాడు. గృహిణియైన లోమా, విశ్వారంభాలపై విజ్ఞానశాస్త్ర పరిశోధనను పరిశీలించడానికి దాన్ని ఉపయోగించింది. ఉపగ్రహాల సాయంతో మొక్కల్ని నాటే నవీన పద్ధతుల్ని గూర్చిన సమాచారాన్ని తెల్సుకునేందుకు ఓ రైతు దాన్ని ఉపయోగించాడు. లక్షలాదిమంది భావి వినియోగదార్లకు తమ ఉత్పాదనల్ని గురించీ, సేవల్ని గురించీ ప్రకటించడంలో దానికున్న శక్తినిబట్టి, వ్యాపార కార్పొరేషన్‌లు దానివైపు మొగ్గు చూపించాయి. భూగోళ వ్యాప్తంగావున్న ప్రజలు, దానికున్న విస్తృతమైన నివేదిత, సమాచార సేవల మూలంగా జాతీయ అంతర్జాతీయ తాజా వార్తల్ని చదువుతున్నారు.

ఇంటర్‌నెట్‌ లేక నెట్‌ అని పిలువబడిన ఈ కంప్యూటర్‌ అద్భుతమేమైవుంది? వ్యక్తిగతంగా దీని అవసరం మీకుందా? ఇంటర్‌నెట్‌ ఉపయోగించాలని మీరు తీర్మానించుకోడానికి ముందు, దానిని గురించి మీరు కొంత తెల్సుకోవాలని ఇష్టపడవచ్చు. వ్యాపార ప్రకటనల దుమారం ఎంత విస్తృతంగా ఉన్నప్పటికీ, విశేషంగా ఇంట్లో పిల్లలు ఉంటే జాగ్రత్త వహించడానికి కారణాలు ఉన్నాయి.

అసలు అదేమిటి?

ప్రతీదీ దాని దాని గూడును అల్లుకుంటూవున్న అనేక సాలెపురుగులతో నిండిపోయిన ఓ గదిని ఊహించుకోండి. ఈ సాలెగూళ్లు పూర్తిగా అనుసంధానం చేయబడి ఉంటాయి. అనుసంధానం చేయబడిన ఈ చిక్కులో సాలెపురుగులు సులభంగా అటునిటు తిరుగగల్గుతాయి. ఒకదానితో మరొకటి అనుసంధానం చేయబడిన అనేకమైన విభిన్న రకాల కంప్యూటర్ల, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ల భౌగోళిక కూర్పు అయిన ఇంటర్‌నెట్‌ను గురించి మీకు ఇప్పుడు ఓ సరళమైన అవగాహన ఏర్పడింది. ఓ టెలిఫోన్‌ ఎలాగైతే మిమ్మల్ని భూమికి ఆవలివైపున ఉన్న ఫోన్‌గల మరో వ్యక్తితో మాట్లాడేలా చేస్తుందో, అలాగే ఇంటర్‌నెట్‌ కూడా ఒకడు తన కంప్యూటర్‌ ముందు కూర్చొని ప్రపంచంలో ఏ మూలనైనా సరే ఉన్న ఇతర కంప్యూటర్లతోనూ, కంప్యూటర్‌ని ఉపయోగించేవారితోనూ సమాచారాన్ని మార్పిడి చేసుకునేలా చేస్తుంది.

కొంతమంది ఇంటర్‌నెట్‌ను ఇన్‌ఫర్మేషన్‌ సూపర్‌హైవేగా (సమాచార మహా మార్గంగా) సూచించారు. ఒక రోడ్డు దేశంలోని వేర్వేరు ప్రాంతాలగుండా ప్రయాణించడానికి ఎలా వీలుకల్పిస్తుందో, అలాగే ఇంటర్‌నెట్‌ కూడా అనుసంధానపర్చబడిన అనేకమైన విభిన్న కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ల గుండా సమాచార ప్రవాహానికి వీలుకల్పిస్తుంది. మెస్సేజ్‌లు (సమాచారాలు) ప్రయాణం చేస్తుండగా, అవి చేరుకున్న ప్రతీ నెట్‌వర్కూ దానికి దరిదాపుల్లో ఉన్న నెట్‌వర్క్‌కు కలుపబడడంలో సహాయపడే సమాచారాన్ని కల్గివుంటుంది. మెస్సేజ్‌ల చివరి గమ్యం బహుశా వేరే నగరమో లేక వేరే దేశమో అయివుండొచ్చు.

ప్రతీ నెట్‌వర్కూ దాని పొరుగునున్న నెట్‌వర్క్‌తో, నెట్‌వర్క్‌ రూపకర్తలు సృష్టించిన సాధారణ సూత్రాల ద్వారా “మాట్లాడు”కోగలవు. ప్రపంచవ్యాప్తంగా, ఎన్ని నెట్‌వర్క్‌లు అనుసంధానం చేయబడ్డాయి? దాదాపు 30,000లకు పైగానేనని కొన్ని అంచనాలు తెలియజేస్తున్నాయి. ఇటీవలనే నిర్వహించిన సర్వేల ప్రకారంగా, ఈ నెట్‌వర్క్‌లు ప్రపంచవ్యాప్తంగా 1,00,00,000 కన్నా ఎక్కువ కంప్యూటర్లతోనూ, అలాగే కంప్యూటర్లను ఉపయోగించే దాదాపు 3,00,00,000 మందితోనూ కలుపబడ్డాయి. ఇంటర్‌నెట్‌కు కలుపబడిన కంప్యూటర్‌ల సంఖ్య ప్రతీ సంవత్సరమూ రెట్టింపు అవుతోందని అంచనావేయబడింది.

ఇంటర్‌నెట్‌పై ప్రజలు ఏ రకమైన సమచారాన్ని కనుగొనగలరు? వైద్యశాస్త్ర విషయాల నుండి విజ్ఞాన సాంకేతిక శాస్త్ర విషయాల వరకూ విభిన్న అంశాలతో, త్వరితంగా పురోగతిచెందుతున్న సమాచార సేకరణను అందిస్తుంది. ఇది కళలపై సమగ్రమైన సమాచారాన్నీ అలాగే విద్యార్థులకు పరిశోధక సమాచారాన్నీ అందిస్తోంది. అంతేగాక వినోద విలాసాల్నీ, క్రీడల్నీ, షాపింగ్‌నూ, ఉద్యోగావకాశాల్నీ కవర్‌చేస్తోంది. ఇంటర్‌నెట్‌ ఆల్మనాక్‌లనూ, నిఘంటువులనూ, సర్వసంగ్రహ నిఘంటువులనూ, మ్యాపులనూ అందజేస్తుంది.

అయితే, ఆలోచించదగినటువంటి కొన్ని కలతపర్చే విషయాలు ఉన్నాయి. ఇంటర్‌నెట్‌పై ఉన్న ప్రతీదాన్నీ ఆరోగ్యదాయకమైనదిగానే పరిగణించగలమా? ఏ సేవల్నీ, వనరుల్నీ ఇంటర్‌నెట్‌ అందిస్తుంది? ఏ ముందు జాగ్రత్తల్ని తీసుకోవడం మంచిది? ఈ ప్రశ్నల్ని గురించి దీని తర్వాతి శీర్షిక చర్చిస్తుంది.

[4వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఇంటర్‌నెట్‌ పుట్టుపూర్వోత్తరాలు, దాని రూపకల్పన

శాస్త్రవేత్తలూ, పరిశోధకులూ చెదురు మదురుగా ఉన్న ప్రదేశాల్లోనుండి—అరుదుగా లభిస్తున్న, ఖరీదైన కంప్యూటర్లనూ వాటి ఫైళ్లనూ పంచుకోవడం ద్వారా—కలిసి పనిచేయడానికి సహాయపడేందుకు 1960లలో అమెరికా రక్షణశాఖ చేసిన ఓ ప్రయోగంగా ఇంటర్‌నెట్‌ ఆరంభమైంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు, సమన్వయపర్చబడి సంకీర్ణ యూనిట్‌గా పనిచేయబోయే అనుసంధానపర్చబడిన నెట్‌వర్క్‌ల గ్రూపును సృష్టించాల్సి వచ్చింది.

ప్రచ్ఛన్న యుద్ధం, “బాంబులు చొరబడని” నెట్‌వర్క్‌లందు ఆసక్తిని ప్రేరేపించింది. నెట్‌వర్క్‌లోని ఓ భాగం గనుక నాశనంచేయబడితే, పాడుకాకుండా మిగిలివున్న భాగాల సహాయంతో డేటా (సమాచారం) దాని గమ్యం వైపు ప్రయాణిస్తుంది. ఆ విధంగా, ప్రయోగాల ఫలితంగా ఉద్భవించిన ఇంటర్‌నెట్‌లో మెస్సేజ్‌ రూట్‌ను నిర్ణయించే బాధ్యత ఏదో ఒక ప్రదేశానికే కేంద్రీకృతమవ్వడానికి బదులు నెట్‌వర్క్‌ అంతటికీ విస్తరిస్తుంది.

ఇప్పటికి దాదాపు రెండు దశాబ్దాలకన్నా ఎక్కువ కాలం క్రిందటిదైన ఇంటర్‌నెట్‌, జనాదరణ పొందే స్థాయికి ఎదగడానికిగల కారణం బ్రౌజర్‌లను ఉపయోగించడమే. కంప్యూటర్‌ను ఉపయోగించే వ్యక్తి ఇంటర్‌నెట్‌పై వేర్వేరు లొకేషన్లను (ప్రదేశాల్ని) ‘సందర్శించే’ విధానాన్ని మరీ సులభతరం చేసే సాఫ్ట్‌వేర్‌ పరికరమే బ్రౌజర్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి