కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 3/8 పేజీ 31
  • మీ వినికిడిని కాపాడుకోండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ వినికిడిని కాపాడుకోండి!
  • తేజరిల్లు!—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • శబ్దం—దాని గురించి మీరు చేయగలిగినది
    తేజరిల్లు!—1997
  • మీ వినికిడి శక్తి కాపాడుకోవాల్సిన ఓ బహుమానం
    తేజరిల్లు!—1997
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1999
తేజరిల్లు!—1997
g97 3/8 పేజీ 31

మీ వినికిడిని కాపాడుకోండి!

ప్రతి ఐదుగురిలో ఒకరు వినికిడిని కోల్పోతున్నారని ఫ్రాన్సులో 400 మంది యౌవనులపై ఇటీవల జరిపిన సర్వే బయల్పర్చింది. ఒక దశాబ్దం క్రితం నిర్వహించిన ఇలాంటి సర్వే ప్రతి 10 మంది యౌవనులలో ఒకరు మాత్రమే వినికిడిని కోల్పోతున్నారని చూపింది. వినికిడిని కోల్పోతున్న యౌవనుల సంఖ్యలో అత్యధిక పెరుగుదలపై చర్యలు తీసుకుంటూ, గత సంవత్సరంలో ఫ్రెంచి నేషనల్‌ అసెంబ్లీ స్వంత స్టీరియోల శబ్దస్థాయిని 100 డెసీబెల్‌లకు పరిమితం చేయాలని తీర్మానించింది.

స్వంత స్టీరియోలనుండీ హెడ్‌ఫోన్‌ల నుండీ వెలువడే అత్యధిక శబ్దస్థాయే వినికిడిని కోల్పోవడానికి కారణమని నిందించడం జరిగింది. 100 డెసీబెల్‌ల కంటే ఎక్కువైన శబ్దం కొన్ని గంటల తర్వాత శాశ్వత నష్టానికి కలిగించగలదని చెవికి సంబంధించిన సర్జన్‌, జాన్‌ప్యర్‌ కేవ్‌ చెబుతున్నాడు. శబ్దస్థాయి 115 డెసీబెల్‌లను మించిపోతే, వినికిడి కోల్పోయేందుకు కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే చాలు. తాము విక్రయించే అలాంటి స్వంత స్టీరియోలలోని ఎక్కువ భాగం 100 కంటే ఎక్కువ డెసీబెల్‌లను ఉత్పత్తి చేస్తాయని ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ఒక ప్రముఖ ఫ్రెంచి వ్యాపార సంస్థ ఎఫ్‌.ఎన్‌.ఏ.సి. చెప్పింది. ఈ స్టీరియోల్లో కొన్ని 126 డెసీబెల్‌లను ఉత్పత్తి చేయగలవు, అది 100 డెసీబెల్‌ల శక్తికంటే 400 రెట్లు ఎక్కువగా ఉంటుంది!

వ్యక్తిగత స్టీరియోల కంటే కూడా రాక్‌ కాన్సర్టులు మరింత ఎక్కువగా హాని కలిగించవచ్చునని వినికిడికి సంబంధించిన నిపుణుడైన, ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టియన్‌ మేయర్‌ బీస్‌ అభిప్రాయపడుతున్నాడు. వాస్తవానికి, 18 సంవత్సరాల ఆరోగ్యవంతులతో పోల్చినప్పుడు, రాక్‌ కాన్సర్టులకు క్రమంగా హజరయ్యేవారు వినికిడిని అధికంగా కోల్పోతున్నారు. “మనం చెవిటి ప్రజల తరాన్ని ఉత్పత్తి చేస్తున్నాము” అని ఫ్రెంచి నేషనల్‌ అసెంబ్లీకి చెందిన అధికారియైన జాన్‌ ఫ్రాన్స్‌వాయి మాటే ఇలా హెచ్చరించడంలో ఆశ్చర్యంలేదు.

కాబట్టి మీ వినికిడిని కాపాడుకోవడానికి, శబ్దం ఎంతగా ఉందో చూసుకోండి!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి