కుటుంబానికీ, స్నేహితులకూ ఓదార్పు
గత జూలై 17న టిడబ్లూఏ 800 విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయినప్పుడు దానిలోని 230 మందీ చనిపోయారు. దీనిలో సుమారు 5,000 మంది నివాసుల చిన్న పెన్సిల్వేనియా పట్టణమైన మాన్టుర్జ్విల్ నుండి వచ్చిన హైస్కూల్లో ఫ్రెంచి చదువుకునే 16 విద్యార్థులూ వారికి తోడుగా వెళ్లిన మరి అయిదుగురు పెద్దలు కూడా ఉన్నారు. ఆగస్టు 17న ఓ పట్టణంలో జరిగిన స్మారక సభలో ఒక ప్రసంగీకుడైన న్యూయార్క్ మేయరైన రడాల్ఫ్ జూలియని, న్యూయార్క్ పట్టణంలోని జనాభాలో అదే శాతం మంది మరణించి ఉంటే 35,000 మంది హతమయ్యేవారని చెప్పాడు!
ఆ హైస్కూలు ప్రిన్సిపాల్ అయిన డాన్ చాండ్లర్ను అనేకమంది విద్యార్థుల అంత్యక్రియల సమయంలో మాట్లాడమని కోరడం జరిగింది. దేవుని నూతనలోక విధానంలో “మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు” అని చెప్పే ప్రకటన 21:4 నందున్న బైబిలు వాగ్దానాన్ని ఆయన ఎత్తి చూపాడు. ఆనాడు జరిగినటువంటి దారుణాలు ఎందుకు సంభవిస్తాయో చెప్పేందుకు మనకు కలిగే ‘కాలవశము, అనూహ్యములను’ గూర్చి మాట్లాడే ప్రసంగి 9:11 వచనాన్ని ఆయన సూచించాడు. తమ హైస్కూలు ప్రిన్సిపాల్, అంతటి ఓదార్పుకరమైన మాటలు పలకడం విని అనేకులు ఆశ్చర్యపోయారు.
అదనపు సహాయాన్ని అందించేందుకు చాండ్లర్ ఆ హైస్కూల్లో మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే అనే 32 పేజీల బ్రోషూరూ, మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు? అనే కరపత్రమూ లభ్యమయ్యేలా చేసేందుకు ప్రత్యేకంగా ఓ బల్లను ఏర్పాటుచేశాడు. వందలకొలది బైబిలు ప్రచురణలను స్వీకరించడం జరిగింది, మరి ఇవి ఇచ్చిన ఓదార్పుకు అనేకులు తమ కృతజ్ఞతలను వ్యక్తపర్చారు.
పైన ప్రస్తావించిన బ్రోషూరు నుండీ కరపత్రాలనుండీ మీరు కూడా ప్రయోజనం పొందవచ్చు. వీటి ప్రతులు మీకు కావాలన్నా లేక ఉచిత గృహ బైబిలు పఠనం మీకు కావాలన్నా దయచేసి Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., Indiaకు లేక ఈ పత్రిక 5వ పేజీలో ఉన్న అతి దగ్గరి చిరునామాకు వ్రాయండి.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
Courtesy of Williamsport Sun-Gazette
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
Corey Sipkin/Sipa Press