కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 2/8 పేజీలు 3-4
  • సహనం ఒక కొననుండి మరొక కొనకు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సహనం ఒక కొననుండి మరొక కొనకు
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సహనం నుండి మూఢత్వం వైపుకు
  • సహనం నుండి అనైతికతవైపుకు
  • స్వాతంత్ర్యాలను సంరక్షించడం—ఎలా?
    తేజరిల్లు!—1999
  • సరైన సమతౌల్యం మీ జీవితాన్ని తీయగా చేయగలదు
    తేజరిల్లు!—1997
  • దైవిక ప్రమాణాలకు కట్టుబడివుంటూనే నమ్యతతో ఉండడం
    తేజరిల్లు!—1997
  • తేడాలు చూపించకుండా సహనం చూపించండి
    తేజరిల్లు!—2015
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 2/8 పేజీలు 3-4

సహనం ఒక కొననుండి మరొక కొనకు

కాశ్మీరు లోయ యొక్క ప్రకృతి సౌందర్యం 16వ శతాబ్దపు తత్వవేత్త ఇలా అచ్చెరువొందేలా కదిలించింది: “అసలు పరదైసు అంటూ ఎక్కడైనా ఉంటే, అది ఇక్కడే ఉంది!” స్పష్టంగా ప్రపంచంలోని ఆ భూభాగంలో తరువాత ఏమి జరుగనైయుందో ఆయనకు లేశమాత్రంగానైనా తెలియదు. గత ఐదు సంవత్సరాల కాలంలోనే వేర్పాటువాదులకు భారత సైన్యానికీ మధ్య జరిగిన పోరాటంలో అక్కడ కనీసం 20,000 మంది ప్రజలు చంపబడ్డారు. జర్మన్‌ వార్తా పత్రిక స్యూట్‌డోయిష్‌ సైటుంగ్‌ ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ఒక “కన్నీటి లోయ” అని వర్ణిస్తుంది. కాశ్మీరు లోయ ఒక సరళమైన కానీ విలువైన పాఠాన్ని అందిస్తుంది: అసహనం పరదైసు కాగల ప్రాంతాన్ని నాశనం చేయగలదు.

సహనం కల్గివుండడం అంటే అర్థమేమిటి? కాలిన్స్‌ కోబిల్డ్‌ ఆంగ్ల భాషా నిఘంటువు ప్రకారం, “మీరు సహనం కల్గివుంటే, మీరు అంగీకరించకపోయినా లేక ఆమోదించకపోయినా, ఇతర ప్రజలు తమ స్వంత దృక్పథాలను లేక నమ్మకాలను కల్గివుండేందుకు, లేక ప్రత్యేక తరహాలో ప్రవర్తించేందుకు మీరు అనుమతిస్తారు.” ప్రదర్శించగల్గితే ఇది ఎంత చక్కని లక్షణంగా ఉంటుంది! నిశ్చయంగా మన నమ్మకాలు, దృక్పథాలు తమ స్వంత వాటికి వేరుగా ఉన్నప్పటికీ వాటిని గౌరవించినప్పుడు వారి సమక్షంలో ఎంతో నెమ్మదిని అనుభవిస్తాము.

సహనం నుండి మూఢత్వం వైపుకు

సహనానికి వ్యతిరేకమైనది అసహనం, దీనిలో అనేక మోతాదులు ఉన్నాయి. అసహనం అనేది ఇంకొకరి ప్రవర్తన ఎడల లేక పనులుచేసే విధానం ఎడల సంకుచిత స్వభావంతో కూడిన తిరస్కారంతో మొదలవ్వవచ్చు. సంకుచిత స్వభావం జీవితంలోని ఆనందాన్ని పీల్చివేస్తుంది, నూతన ఆలోచనలను స్వీకరించకుండేలా ఒకరి మనస్సును మూసివేస్తుంది.

ఉదాహరణకు, కఠినహృదయుడైన ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లవాని ఉత్సాహంతో కూడిన చేష్టలను చూసి విముఖుడు కావచ్చు. వయస్సులో తనకంటే పెద్దవారి ధ్యానపూర్వక విధానాలు ఒక యౌవనునికి విసుగును కల్గించవచ్చు. జాగరూకుడైన ఒక వ్యక్తిని సాహసియైన ఇంకొకరితో కలిసి పని చేయమని చెప్పి చూడండి, ఇద్దరూ కూడా ఒకరిమీద మరొకరు చిఱ్ఱుబుఱ్ఱులాడవచ్చు. ఇలా విముఖులవ్వడం, విసుక్కోవడం, చిఱ్ఱుబుఱ్ఱులాడడం ఎందుకు? ఎందుకంటే, ప్రతి సందర్భంలోనూ ఒకరు మరొకరి దృక్పథాలను లేక ప్రవర్తనను సహించడం కష్టంగా ఉన్నట్లు భావించడమే.

అసహనం వృద్ధిచెందినచోట సంకుచిత స్వభావం దురభిమానంగా రూపొందవచ్చు, అంటే ఒక గుంపు, జాతి, లేక మతం ఎడల వ్యతిరేకత కలిగివుండడం. దురభిమానం కంటే తీవ్రమైనది మూఢత్వం, ఇది హింసాయుత ద్వేషంలో ప్రదర్శితమవ్వవచ్చు. దీని ఫలితమే దైన్య స్థితి, రక్తపాతమూ. క్రూసేడ్ల కాలంలో అసహనం దేనికి నడిపించిందో ఆలోచించండి! నేడు కూడా, బోస్నియా, రువాండ, మధ్యప్రాచ్యంలలోని పోరాటాలకు అసహనం ఒక ముఖ్య కారణం.

సహనానికి సమతౌల్యం అవసరం, మరి సరైన సమతౌల్యాన్ని కల్గివుండడం సులభం కాదు. మనమొక గడియారంలోని లోలకం వంటివారం, ఒక వైపునుండి మరొకవైపుకు ఊగుతూవుంటాము. కొన్నిసార్లు, మనం అతి తక్కువ సహనాన్ని చూపుతాము; కొన్నిసార్లు అతి ఎక్కువ చూపుతాము.

సహనం నుండి అనైతికతవైపుకు

అతిగా సహనం కలిగివుండడం సాధ్యమేనా? అమెరికా సెనెటర్‌ అయిన డాన్‌ కోట్స్‌ 1993లో మాట్లాడుతూ, “సహనం యొక్క అర్థానికీ, అభ్యాసానికి సంబంధించి జరుగుతున్న ఒక యుద్ధం” గురించి వర్ణించాడు. ఆయన చెప్పినదానికి అర్థం ఏమిటి? సహనం పేరుతో కొంతమంది “నైతిక సత్యంలో—మంచి చెడులలో, తప్పు ఒప్పులలో నమ్మకాన్ని విడనాడుతున్నారు” అని ఆ సెనెటర్‌ విలపించాడు. అటువంటివారు ఏది మంచి ప్రవర్తనో ఏది చెడు ప్రవర్తనో తీర్పు తీర్చి చెప్పడానికి సమాజానికి హక్కు లేదని భావిస్తారు.

1990లో, బ్రిటిష్‌ రాజకీయవాది లార్డ్‌ హేల్‌షమ్‌ “నైతికతకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు నిరీశ్వరవాదము గాని, అజ్ఞేయతావాదము గాని, భౌతికవాదము గాని, లోభత్వము లేక అంగీకృతమైన ఏ ఇతరములు గానీ కారణాలు కావు. నైతికతకు నిజమైన శత్రువు శూన్యవాదమే, అంటే అక్షరార్థంగా చెప్పాలంటే దేనిలోను నమ్మకం లేకపోవడం” అని వ్రాశాడు. స్పష్టంగా, మనకు దేనిలోనూ నమ్మకం లేకపోతే సరైన ప్రవర్తనకు ప్రమాణాలు ఉండవు అంతేగాక ప్రతీదీ సహిస్తాము. కానీ ప్రతివిధమైన ప్రవర్తనను సహించడం ఉచితమేనా?

డెన్మార్క్‌లోని ఒక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాత్రం అలా అనుకోలేదు. జంతువులు మానవుల మధ్య లైంగిక చర్యలను ప్రదర్శించే పోర్నోగ్రఫిక్‌ ప్రదర్శనలకు సంబంధించి వార్తా పత్రికల్లో వచ్చే వాణిజ్య ప్రకటనల గురించి ఫిర్యాదు చేస్తూ ఆయన 1970ల తొలిభాగంలో ఒక వార్తా పత్రికకు ఒక శీర్షిక వ్రాశాడు. డెన్మార్క్‌ యొక్క “సహనం” మూలాన ఈ వాణిజ్య ప్రకటనలు అనుమతించబడ్డాయి.

కచ్చితంగా, చాలా తక్కువ సహనాన్ని చూపించడం మూలంగానే గాక చాలా ఎక్కువ సహనాన్ని చూపించడం మూలంగా కూడా సమస్యలు వస్తాయి. అతిని విడిచిపెట్టి సరైన సమతౌల్యంతో ఉండడం ఎందుకు కష్టం? దయచేసి తర్వాతి శీర్షిక చదవండి.

[3వ పేజీలోని చిత్రం]

పిల్లల పొరబాట్లకు అతిగా ప్రతిస్పందించడం వారికి హానికరంగా ఉండవచ్చు

[4వ పేజీలోని చిత్రం]

పిల్లలు చేసేదానినంతటినీ సహించడం జీవితంలో బాధ్యతలను తీసుకోవడానికి వారిని సిద్ధం చేయదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి