కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 2/8 పేజీలు 18-19
  • భూమి అగ్నిలో అంతమౌతుందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భూమి అగ్నిలో అంతమౌతుందా?
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు శ్రద్ధవహిస్తున్నాడా?
  • “మొదటి భూమి”
  • “క్రొత్త భూమి”
  • భూమి నాశనమౌతుందా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • భూమి
    తేజరిల్లు!—2015
  • భూమిపట్ల దేవుని సంకల్పం త్వరలో నెరవేరనుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • “పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
తేజరిల్లు!—1997
g97 2/8 పేజీలు 18-19

బైబిలు ఉద్దేశము

భూమి అగ్నిలో అంతమౌతుందా?

అణు విధ్వంసంలో దగ్ధమవ్వడం, సూర్యుని పరిమాణం పెరిగి అందులో బుగ్గి అవ్వడం, ఒక ఉగ్రుడైన దేవునిచే కాల్చివేయబడడం—పద్ధతులు భిన్నంగా ఉండవచ్చు, కానీ అంతటినీ దహించివేసే అగ్నితోను, పెద్ద మొత్తంలో సర్వనాశనం జరగడంతోను మానవజాతికి గృహమైన ఈ భూగ్రహం అంతమౌతుందని అనేకమంది ప్రజలు ఒప్పించబడ్డారు.

కొంతమంది భూమికి వ్యతిరేకంగా మానవుడు చేసిన అతిక్రమాల ఫలితంగా దైవికంగా నిర్దేశించబడిన మహా అగ్నిని సూచించే బైబిలు లేఖనాలను ఉల్లేఖిస్తారు. ఇతరులు ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడైన పాల్‌ డేవిస్‌ అభిప్రాయాన్ని పునరుద్ఘాటిస్తారు. భూమి అగ్నితోకూడిన నాశనంలోనికి నివారించలేని విధంగా కూరుకుపోతుందని తాను పరిగణించేదానిని గురించి ఆయన వ్రాశాడు. చివరి మూడు నిమిషాలు (ఆంగ్లం) అనే తన పుస్తకంలో ఆయన ఇలా సిద్ధాంతీకరిస్తున్నాడు: “సూర్యుడు పరిమాణంలో మరింత పెరుగుతుండగా, అది . . . భూమిని అగ్నితో ఆవరించి మ్రింగివేస్తుంది. మన గ్రహం బూడిదగా మార్చబడుతుంది.” భూమి భవిష్యత్తును గూర్చిన వాస్తవం ఏమిటి? అగ్నితో కూడిన నాశనాన్ని గురించి ముందుగానే చెబుతున్నాయని అనిపించే బైబిలు లేఖనాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి?

దేవుడు శ్రద్ధవహిస్తున్నాడా?

యిర్మీయా 10:10-12 నందు మనకు ఇలా చెప్పబడుతుంది: “యెహోవాయే నిజమైన దేవుడు . . . ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.” దేవుడు భూమిని చేసి దానిని స్థిరంగా స్థాపించాడు. కాబట్టి బుద్ధి, ప్రేమ, వివేచనలతో ఆయన మానవజాతికి సుందరమైన గృహంగా నిరంతరం నిలిచేలా భూమిని జాగ్రత్తగా తయారుచేశాడు.

మానవజాతిని దేవుడు సృష్టించడాన్ని గురించి బైబిలు ఇలా నివేదిస్తుంది: “స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా—మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి.” (ఆదికాండము 1:27, 28) ఆయన తన సృష్టి కార్యాన్ని ముగించినప్పుడు, ఆయన నిర్వివాదంగా, “అది చాలమంచిదిగ నుండెను” అని ప్రకటించగల్గాడు. (ఆదికాండము 1:31) అది అలాగే ఉండాలని ఆయన కోరుకున్నాడు. తలిదండ్రులు కాబోతున్న కొందరు పుట్టబోయే తమ బిడ్డ కొరకు ఒక గదిని ప్రత్యేకంగా రూపొందించి సిద్ధపర్చినట్లే, దేవుడు ఒక అందమైన తోటను వేసి దానిని అభివృద్ధిచేయడానికి, దాన్ని సంరక్షించడానికి మానవుడైన ఆదామును అందులో పెట్టాడు.—ఆదికాండము 2:15.

ఆదాము పరిపూర్ణతను, భూమిని సంరక్షించడమనే తన బాధ్యతను పరిత్యజించాడు. కానీ సృష్టికర్త తన సంకల్పాన్ని పరిత్యజించాడా? లేదని యెషయా 45:18 చెబుతుంది: “ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని . . . స్థిరపరచెను. నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింపలేదు. నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను.” (యెషయా 55:10, 11 కూడా చూడండి.) మానవుడు తనకివ్వబడిన సంరక్షణా విధిని అలక్ష్యం చేసినప్పటికీ, దేవుడు భూమి ఎడల, దాన్లో నివసించే జీవుల ఎడల తన సంకల్పాన్ని నెరవేర్చడం కొనసాగించాడు. ప్రాచీన ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వబడిన ధర్మశాస్త్రం ప్రతి ఏడవ సంవత్సరం “భూమికి మహా విశ్రాంతి కాలము”నివ్వాలన్న ఏర్పాటును చేసింది. దానిలో జంతువులకు తగినంత సంరక్షణను ఇచ్చే దయాపూర్వకమైన చట్టాలు ఇమిడివున్నాయి. (లేవీయకాండము 25:4; నిర్గమకాండము 23:4, 5; ద్వితీయోపదేశకాండము 22:1, 2, 6, 7, 10; 25:4; లూకా 14:5) మానవజాతి ఎడల, మానవుని సంరక్షణ క్రింద ఉంచినదానియంతటి ఎడల దేవుడు ఎంతో శ్రద్ధకల్గివున్నాడని స్పష్టంగా సూచించే బైబిలు ఉదాహరణల్లో ఇవి కొన్ని మాత్రమే.

“మొదటి భూమి”

కాబట్టి పరస్పర విరుద్ధంగా కన్పించే బైబిలు వచనాలను మనం ఎలా సమన్వయపరుస్తాము? అటువంటివాటిలో 2 పేతురు 3:7 ఒకటి. అక్కడ పరిశుద్ధ గ్రంథములో ఇలా ఉంది: “అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్ని కొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రముచేయబడియున్నవి.” మరొకటి ప్రకటన 21:1, అదిలా చెబుతుంది: “అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను.”

పేతురు మాటలను అక్షరార్థంగా తీసుకోవాలనుకుంటే, భూగ్రహం నిజమైన అగ్నిలో కాలిపోవాలంటే, అప్పుడు అక్షరార్థమైన ఆకాశములు—నక్షత్రాలు అంతరిక్షంలోని మరితర గోళాలు—కూడా అగ్నితో నాశనం చేయబడాలి. అయితే ఈ దృక్కోణం “నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని చెబుతున్న మత్తయి 6:10లోను మరియు “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు” అని చెబుతున్న కీర్తన 37:29 వంటి లేఖనాల్లో కనుగొనబడే అభయానికి విరుద్ధంగా ఉంది. అంతేగాక, ఇప్పటికే ఎంతో వేడిగా ఉన్న, నిరంతరమూ అణు విస్ఫోటనాలను ఉత్పత్తిచేస్తూ ఉన్న సూర్యునిపైన మరియు నక్షత్రాలపైన అగ్ని ఎటువంటి ప్రభావం కలిగివుండగలదు?

మరోవైపు, బైబిలు తరచూ “భూమి” అనే పదాన్ని అలంకారిక భావంలో ఉపయోగిస్తుంది. ఉదాహరణకు ఆదికాండము 11:1 ఇలా అంటుంది: “భూమియందంతట ఒక్క భాష . . . ఉండెను.” ఇక్కడ “భూమి” అనే పదం సామాన్యంగా మానవజాతిని, లేక మానవ సమాజాన్ని సూచిస్తుంది. (1 రాజులు 2:1, 2; 1 దినవృత్తాంతములు 16:31 కూడా చూడండి.) “భూమి” అనే పదానికి అదే అలంకారిక అర్థం ఉందని 2 పేతురు 3:5, 6యొక్క సందర్భం సూచిస్తుంది. జలప్రళయంలో ఒక దుష్ట మానవ సమాజం నాశనమై, నోవహు ఆతని కుటుంబము, వీరితోపాటు గ్రహం కూడా సంరక్షించబడిన నోవహు దినాన్ని ఆ సందర్భం సూచిస్తుంది. (ఆదికాండము 9:11) అదేవిధంగా, 2 పేతురు 3:7నందు నాశనం చేయబడేది ‘భక్తిహీనులు’ అని చెప్పబడుతుంది. ఈ దృక్కోణం మిగతా బైబిలుతో ఏకీభవిస్తుంది. నాశనానికి కేటాయింపబడిన దుష్ట సమాజం అనేది ఇంతకుముందు ఎత్తివ్రాయబడిన ప్రకటన 21:1 వద్ద సూచించబడిన “మొదటి భూమి” కూడాను.

నిజానికి, భూమ్మీదవుండే శ్రద్ధగల ఒక తండ్రి తన ఇంటికి హాని కలుగకుండ ఉండేలా నిశ్చయపర్చుకున్నట్లే, యెహోవా దేవుడు తన సృష్టి ఎడల ఎంతో శ్రద్ధకల్గివున్నాడు. ఆయన ఒకసారి అనైతిక, దుష్ట ప్రజలను సారవంతమైన యొర్దాను లోయనుండి వెళ్లగొట్టి, ఆ దేశానికి క్రొత్తగా సంరక్షణ బాధ్యతవహిస్తూ తనతో నిబంధనలో ఉన్న వారు తన విధులను అనుసరించినట్లైతే, ‘ఆ దేశము వారికంటే ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము వారి అపవిత్రతనుబట్టి వారిని కూడా వెళ్లగ్రక్కివేయదు’ అని అభయమిచ్చాడు.—లేవీయకాండము 18:24-28.

“క్రొత్త భూమి”

నేడు, లైంగికంగా నీతిబాహ్యమైన, హింసాత్మకంగా క్రూరమైన, రాజకీయంగా భ్రష్టమైన ఒక సమాజం భూమిని కలుషితం చేసింది. కేవలం దేవుడు మాత్రమే దానిని కాపాడగలడు. ఆయన సరిగ్గా అదే చేస్తాడు. ప్రకటన 11:18వద్ద ఆయన ‘భూమిని నశింపజేయువారిని నశింపజేస్తానని’ వాగ్దానం చేస్తున్నాడు. పునఃస్థాపించబడిన, పునర్నూతనం చేయబడిన భూమి దేవునికి భయపడి, తమ తోటివారిని నిష్కపటంగా ప్రేమించే ప్రజలచే నింపబడుతుంది. (హెబ్రీయులు 2:5; లూకా 10:25-28 పోల్చండి.) దేవుని పరలోక రాజ్యం క్రింద సంభవించే మార్పులు ఎంత గొప్పగా ఉంటాయంటే బైబిలు ఒక “క్రొత్త భూమి” గురించి అంటే ఒక క్రొత్త మానవ సమాజం గురించి మాట్లాడుతుంది.

మనం కీర్తన 37:29 వంటి లేఖనాలను చదివినప్పుడు మరియు మత్తయి 6:10నందు క్రీస్తు చేసిన వ్యాఖ్యానాన్ని అవలోకనం చేసుకున్నప్పుడు, గ్రుడ్డి ప్రకృతి శక్తులుగానీ, వినాశకరమైన తన శక్తియంతటి చేత మానవుడుగానీ మన గ్రహానికి అంతాన్ని తీసుకురావడం జరగదని మనకు నమ్మకం కుదురుతుంది. ప్రకృతి శక్తులుగాని, మానవుడుగాని దేవుని సంకల్పానికి విఘాతం కల్గించడం జరగదు. (కీర్తన 119:90; యెషయా 40:15, 26) విశ్వసనీయంగా ఉండే మానవజాతి హద్దుల్లేని అందంతోను, అవధుల్లేని ఆనందంతోను ఉన్న పరిస్థితులమధ్య భూమిపై జీవిస్తుంది. భూమి యొక్క భవిష్యత్తును గూర్చిన సత్యం ఇదే, ఎందుకంటే మానవజాతి యొక్క ప్రేమగల సృష్టికర్త సంకల్పం ఇదే, ఎల్లప్పుడూ ఇదే అయివుంటుంది.—ఆదికాండము 2:7-9, 15; ప్రకటన 21:1-5.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి