మోనార్క్ల సహజ పరిరక్షక కేంద్రాలు వాటిని చంపే స్థలాలుగా మారాయి
కెనడా మరియు అమెరికా ఉత్తర భాగంలో వేసవిని గడిపే మోనార్క్ సీతాకోక చిలుకలు ఒక మహత్తరమైన వలస ప్రయాణంలో, నారింజ మరియు నల్ల రంగుల్లోని వాటి రెక్కలను చాపి కెనడానుండి బయటికి అమెరికా మీదుగా దూసుకుపోయి మెక్సికో పట్టణానికి పశ్చిమాన ఉన్న ఒక ప్రాంతంలో గుమిగూడుతాయి. అక్కడ, 1986లో మెక్సికో ప్రభుత్వం 3,400 మీటర్ల ఎత్తున్న పర్వతాల్లో ఐదు ప్రాకృతిక పరిరక్షక స్థలాలను ఏర్పాటు చేసి, వాటిపై ఫర్ చెట్లను నాటింది. 1994లో వేసిన లెక్కల ప్రకారం, కనీసం ఆరు కోట్ల మోనార్క్లు ఆ పరిరక్షక కేంద్రాలలో తమ శీతాకాలాన్ని గడుపుతాయి.
మోనార్క్లు ప్రత్యేకంగా ఫర్ చెట్లనే ఇష్టపడతాయి, ఎందుకంటే చల్లని వర్షం మరియు మంచు నుండి సీతాకోక చిలుకలను కాపాడే దట్టమైన పొదలవంటి గుబురులా ఆ చెట్లు ఉంటాయి. ఈ ఐదు స్థలాల్లో చెట్లను నరకడం నిషేధించబడింది, అయితే చట్టవిరుద్ధంగా చెట్లను నరికేయడాన్ని అది ఆపదు. “మెక్సికో రిజర్వుల్లో చెట్లను నరకడాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ అది కొనసాగుతూనే ఉంది, అలా మోనార్క్లు తీవ్రమైన తుపానుకు చలికి మరింత గురయ్యే అవకాశం ఉంది. . . . చెట్లు మరియు వాటి గుబురు లేకుండాపోవడం ద్వారా సీతాకోక చిలుకలు వర్షం మరియు మంచు వలన బాధింపబడతాయని” సీతాకోక చిలుక వైజ్ఞానికులు చింతిస్తున్నారు. చెట్లను నరకడం రక్షణకరమైన గుబురును లేకుండా చేస్తుంది. గెన్జవిల్లేలోని ఫ్లారిడా విశ్వవిద్యాలయంలో జంతు శాస్త్రజ్ఞుడైన లింకన్ బ్రూవర్ మోనార్క్ల రక్షణకరమైన పైకప్పును గురించి చెప్పిన విధంగా: “ఈ అడవులు ఎంతగా పతనమౌతాయో, అంతగా వాటి దుప్పటికి రంథ్రాలు ఏర్పడతాయి.”
“వాతావరణం సరిగా లేకపోవడం మరియు చెట్లను నరకడం సీతాకోక చిలుకలకు ప్రాణాంతకమైనవి” అని ద న్యూయార్క్ టైమ్స్ చెప్పింది. 1995 డిశంబరు 30నాటి రాత్రి పరిరక్షక కేంద్రాలలో మంచుకురవడాన్ని గురించి అది ఇలా నివేదించింది: “వేలకొలది గడ్డకట్టుకు పోయిన మోనార్క్లతో నిండిన మంచు గుట్టలు ఉన్నాయని మరి అనేక సీతాకోక చిలుకలు మంచు క్రింద కూరుకుపోయి ఉన్నాయని ఆ పరిరక్షక కేంద్రాలలో కొన్నింటిని సందర్శించిన ప్రభుత్వ అటవీ రేంజర్లు మరియు భౌతిక శాస్త్రజ్ఞులు చెప్పారు.”
ఈ పేజీ పైభాగాన ఉన్న ఛాయాచిత్రం ఆ విషాదగాథను దృఢపరుస్తుంది.
[Picture Credit Line on page 26]
Jorge Nunez/Sipa Press