కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 12/8 పేజీ 27
  • రూపాన్ని చూసి మోసపోకండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రూపాన్ని చూసి మోసపోకండి
  • తేజరిల్లు!—1996
తేజరిల్లు!—1996
g96 12/8 పేజీ 27

రూపాన్ని చూసి మోసపోకండి

అడవిలో మా స్నేహితుల సౌకర్యవంతమైన ఇంట్లో మేము ఉంటున్నాము, మరి భూమిలో ఉన్న ఆమె అపార్ట్‌మెంట్‌ ఇంట్లోని క్రింది అంతస్తులో మేము పడుకున్నాము. అలా, కిటికీలు లోపలున్న మాకు కళ్ళకు సరిసమానమైన ఎత్తులోను బయటి వారికి నేలమట్టానికి ఉన్నాయి. మొదటిరోజు ఉదయం దాదాపు ఆరు గంటలకు, ఏదో విచిత్రమైన చప్పుడు విని నేను లేచాను, అది అపార్టుమెంటులోని వేర్వేరు భాగాల్లోనుండి వచ్చినట్లు అనిపించింది. ఫ్రిజ్‌ లేక హీటర్‌ నుండి ఆ చప్పుడు వస్తుందేమో చూద్దామని నేను లేచి వంటగదిలోకి వెళ్లాను. అదేదీ కాదు. నేను ఆశ్చర్యపోతుండగా, పామిలీ గదినుండి ఆ శబ్దం రావడాన్ని నేను విన్నాను. నేను మెల్లిగా నడిచి వెళ్లాను, నేను ఒక ఎర్రని పక్షిని బయట చూసి ఆశ్చర్యపోయాను, ఒక కార్డినల్‌ పిట్ట కిటికీ అద్దాలను కొడుతుంది! అది కిటికీలన్నిటి వద్దకు, పడక గది, స్నానాల గది, టివి గది వద్దకు, నేలమట్టానికి ఉన్న కిటికీ ఎక్కడ ఉందో అక్కడికంతా ఎగిరి వెళ్తుంది. నాకు ఆశ్చర్యమనిపించింది.

నేను నెమ్మదిగా కిటికీ దగ్గరకు వెళ్లేసరికి ఆ మర్మానికి కిటుకును కనుగొన్నాను, ఒక ఆడ కార్డినల్‌ సంతోషంగా విత్తనాలను తింటూ కొన్ని అంగుళాల అవతల ఉంది. అయితే మగ పిట్ట కిటికీని ఎందుకు పొడుస్తుంది? అది తన ప్రతిబింబంలో ఒక పోటిదారు కార్డినల్‌ను చూసి దాన్ని అవతలికి తరిమేయడానికి ప్రయత్నిస్తుందన్నది వాస్తవం! అది రూపాన్ని చూసి మోసపోయింది.

ఆ పిట్ట యొక్క విచిత్ర ప్రవర్తనకు అది కారణమని నేను తర్వాత నిశ్చయపర్చుకున్నాను. మగ కార్డినల్‌ “తన ప్రాంతంలో తన జాతికి చెందిన ఇతర మగ పిట్టలు లేకుండా చేసేందుకు చేయవలసినదంతా చేస్తుంది. . . . [అది] ఈ పోటీదారులను తరిమి వేయడమే కాకుండా, . . . హబ్‌క్యాప్‌లు, కారు అద్దాలు లేక పిక్చర్‌ కిటికీలు మరియు తిరిగే అద్దాల తలుపుల్లో తన స్వంత ప్రతిబింబంపై దాడి చేస్తూ కూడా ఉంటుందని వినవచ్చిందని” ద కార్డినల్‌ అనే తన పుస్తకంలో జూన్‌ ఓస్‌బార్న్‌ చెప్పింది. తర్వాత మనం అంగీకరించగల ఒక విషయాన్ని ఆమె చెబుతుంది: “ఒక ఇంటియజమాని యొక్క శాంతియుత జీవితానికి ఇది బాగా చికాకు కలిగించవచ్చు.” ప్రతిరోజు ఉదయాన మేము దీన్ని నిజమని తెలుసుకున్నాము.

ఈ విపరీత మగ ప్రవర్తనను ఆపేందుకు ఏమి చేయవచ్చు? రచయిత్రియైన ఓస్‌బార్న్‌ ఇలా సలహా ఇస్తుంది: “కొన్నిసార్లు శాంతిని నెమ్మదిని కాపాడేందుకు మెరిసే స్థలాలను మూయాల్సి ఉండవచ్చు, ఇలా దాదాపు ఆత్మహత్య చేసుకునేంత రీతిలో దాడి చేయకుండా ఆ పక్షిని కాపాడేందుకు ప్రయత్నించడాన్ని గురించి ఏమి చెప్పనవసరం లేదు.”—ఉచిత వ్యాసం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి