కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 12/8 పేజీలు 8-9
  • ఒక మతం మిగిలి ఉంటుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒక మతం మిగిలి ఉంటుంది
  • తేజరిల్లు!—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • విఫలంకాని ధైర్యానికి మూలము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • మతం పేరిట జరుగుతున్న దుష్క్రియలు అంతమౌతాయా?
    మతం పేరిట జరుగుతున్న దుష్క్రియలు అంతమౌతాయా?
  • త్వరలో మతాలకు ఏం జరుగుతుంది?—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
  • అబద్ధ మతం దాని నాశనానికి చేరుకుంటోంది!
    తేజరిల్లు!—1996
తేజరిల్లు!—1996
g96 12/8 పేజీలు 8-9

ఒక మతం మిగిలి ఉంటుంది

భూమిపైనున్న ప్రజలందరూ ఒకే మతంలో, ఒకే ఒక సత్య దేవుని పవిత్ర ఆరాధనలో ఐక్యమై ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది ఐక్యతకు ఎంత గొప్ప మూలమై ఉంటుందో కదా! మతపరమైన వివాదం, కలహం లేక యుద్ధం ఇక ఎన్నటికీ ఉండవు. అది కేవలం ఒక కల మాత్రమేనా? లేదు. ప్రపంచ అబద్ధ మత సామ్రాజ్యమైన వేశ్య నాశనాన్ని గురించి అపొస్తలుడైన యోహానుకు కల్గిన దర్శనం దాని నాశనం తర్వాత ఒక ఆరాధనా విధానం మిగిలి ఉంటుందని సూచిస్తుంది. అది ఏది?

పరలోకం నుండి ఒక స్వరాన్ని యోహాను విన్నాడు, అది మనకు ఒక సూచనను ఇస్తుంది: “నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింప కుండునట్లును దానిని విడిచి రండి.” (ప్రకటన 18:4) ఇక్కడ దేవుడు తానే తన ప్రజలతో మాట్లాడుతున్నాడు అనే విషయం స్పష్టమౌతుంది. అది చక్కని జీవిత విధానానికి అలవాటు పడేందుకు దానికి సహాయం చేయడం ద్వారా దాన్ని కాపాడాలనే మతపరమైన ప్రయత్నంలో ఆ వేశ్యతో కలిసిపోవాలని ఆయన తన ప్రజలకు ఆజ్ఞాపించలేదనే విషయాన్ని గమనించండి. లేదు, ఆమె బాగుపడే మార్గమే లేదు. కాబట్టి, దాని విపరీతమైన పాప జీవితాన్నిబట్టి కలుషితం కాకుండా తప్పించుకొనేందుకు మరియు ఆమెతోపాటు తుదకు తీర్పును పొంది, నాశనం కాకుండా తప్పించుకొనేందుకు దానిలోనుండి బయటకు రమ్మని మరియు దానికి దూరంగా ఉండమని ఆయన వారికి ఆజ్ఞాపించాడు.

“దానిని విడిచి” రావాలన్న పరలోక ఆజ్ఞ, సత్యాన్ని యథార్థంగా వెదికే వారు దేవుని ప్రజలను గుర్తించేందుకు కూడా సహాయం చేస్తుంది. వారు తమ్మును తాము ఇలా ప్రశ్నించుకోవచ్చు, ‘“మహాబబులోను”తో సంబంధం కలిగి ఉండే ఏ విధమైన మతం, సంస్థ, లేక ఆరాధికుల గుంపునుండి వేరైపోవడం ద్వారా ఈ ఆజ్ఞను నేడు భూమిపైనున్న ఏ ప్రజలు శిరసావహించారు? (ప్రకటన 18:2) బబులోను సంబంధమైన సిద్ధాంతాలు, మతాలు, అలవాట్లు మరియు ఆచారాలనుండి నేడు భూమిపైనున్న ప్రజల్లో ఎవరు అలా తమ్మును తాము స్వతంత్రులను చేసుకున్నారు?’ వారు యెహోవాసాక్షులు కాక మరెవరై ఉండగలరు? 230 కంటే ఎక్కువ దేశాల్లో దాదాపు 52 లక్షలకంటే ఎక్కువమంది ఉన్న సాక్షులలో, తమ పుట్టుక ద్వారా లేక మత మార్పిడి ద్వారా బబులోను సంబంధ మతంలోని ఏదో ఒక భాగంతో సంబంధాన్ని కలిగివున్న వారందరూ దానినుండి స్పష్టంగా రాజీనామా చేశారు—వారు అలా చేసేందుకు కొన్నిసార్లు తమ బంధువులు, స్నేహితులు మరియు మత నాయకుల ద్వారా వచ్చిన ప్రతిఘటనను వ్యతిరేకతను కూడా అధిగమించారు.

దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రీ ఒక ఉదాహరణ, అతను తన చర్చికి కోశాధ్యక్షుడుగా ఉండేవాడు మరియు అతనికి చర్చితో ఎంతో సంబంధం ఉండేది. అయితే అతడు సత్యం కొరకు వెదుకుతూ ఉన్నాడు, ఒకరోజు అతను యెహోవాసాక్షులతో ఉచిత బైబిలు పఠనాన్ని అంగీకరించాడు. కొద్ది కాలానికి, తానొక సాక్షినవ్వాలని అతను నిర్ణయించుకున్నాడు, తాను చర్చినుండి రాజీనామా చేయాలని ఇష్టపడుతున్నానని తన సన్నిహిత సహచరుడైన తన పాస్టరుకు చెప్పాడు.

ఆ పాస్టరు నమ్మలేకపోయాడు, తర్వాత హెన్రీని దర్శించేందుకు అతను చర్చి పర్యవేక్షకున్ని మరియు ఇతర సభ్యులను కూడా తీసుకెళ్లాడు. దేవుని పరిశుద్ధాత్మ లేని మతం అని వారు పిలిచే మతంలో సభ్యుడవ్వాలని ఎందుకు తీర్మానించుకున్నావని వారు అతన్ని అడిగారు. హెన్రీ ఇలా చెబుతున్నాడు “వారికి ఎల్లప్పుడూ నాపై ఎంతో అధికారం ఉండేది గనుక మొదట నేను జవాబిచ్చేందుకు భయపడ్డాను. అయితే నేను సహాయం కొరకు యెహోవాకు ప్రార్థించాను, మరి నేను ఇలా మాట్లాడగలిగేందుకు ఆయన నాకు తోడ్పడ్డాడు: ‘అంతర్జాతీయ మతాలన్నింటిలోనూ దేవుని నామమైన యెహోవాను క్రమంగా ఉపయోగించే ఏకైక మతం ఏది? అది యెహోవాసాక్షుల మతం కాదా? వారు తన నామాన్ని ధరించేందుకు అనుమతించి వారికి తన పరిశుద్ధాత్మను ఇవ్వకుండా ఉంటాడని మీరు భావిస్తున్నారా?’” చర్చి అధికారులు ఈ వాదాన్ని ఖండించలేకపోయారు, మరి హెన్రీ నేడు ఒక యెహోవాసాక్షి అయ్యాడు.

“దానిని విడిచి రండి” అని పరలోకం నుండి వచ్చే స్వరం ఆజ్ఞాపించినప్పుడు, వెళ్లే స్థలం ఒకటి ఉంటుంది. (ప్రకటన 18:4) మీరు పారిపోయి కలుసుకోగల ప్రజలు అంటే సత్యదేవుడైన యెహోవా ఆరాధికులు ఉన్నారు. లక్షలాదిమంది పారిపోయారు. యెహోవాసాక్షులుగా అందరికీ తెలిసిన వీరు, ఒక అంతర్జాతీయ క్రైస్తవ సహోదర బృందమై, 78,600 సంఘాలుగా సంస్థీకరింపబడి, తమ చరిత్రలోకెల్లా అత్యంత విస్తృతమైన పెరుగుదలను ఇప్పుడు అనుభవిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల్లో వారు 12,00,000 మంది వ్యక్తులకు బాప్తిస్మం ఇచ్చారు! బాప్తిస్మానికి ముందు వీరందరూ ఆత్మీయంగా ప్రేరేపించే బైబిలు పఠన కోర్సును ముగించారు, ఏ ఇతర మతంతోనైనా వారు మునుపు కలిగివున్న ఎలాంటి సంబంధాన్నుండైనా రాజీనామా చేసేందుకు సరిగ్గా తీర్మానించుకోడానికి వారికి అది వీలు కలిగించింది.—జెఫన్యా 2:2, 3.

మీరు యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో ఇంతవరకూ కూటాలకు హాజరు కాకపోతే, ఈ వారం ఎందుకు హాజరు కాకూడదు? మీరు చూసే మరియు వినే విషయాలనుబట్టి మీరు చాలా ప్రభావితం చెందవచ్చు. మరి మీరు బైబిలును అర్థం చేసుకొనగోరితే, లక్షలాది మంది ఇతరులు చేసిన విధంగా యెహోవాసాక్షులలో ఒకరు మీతో బైబిలు పఠించాలని ఎందుకు కోరకూడదు? మీరు దేవుని వాక్యం యొక్క నిజమైన అవగాహన కొరకు మరియు ఆ వాక్యానికి అనుగుణంగా ఉండే జీవిత విధానం కొరకు ప్రార్థిస్తుంటే గనుక మీరు మీ ప్రార్థనకు జవాబు కనుగొంటారు.

[9వ పేజీలోని చిత్రాలు]

యెహోవా దేవుని ఆరాధన వైపుకు లక్షలాదిమంది మరలుతున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి