“తేజరిల్లు!ను సంప్రదిస్తే నీకు శ్రేష్ఠమైన సమాచారం లభిస్తుంది”
ఇటలీలోని బరీలో కళాశాల విద్యనభ్యసిస్తున్న ఒక యౌవన యెహోవాసాక్షి అయిన పాస్క్వాలే, తన మనస్తత్త్వ శాస్త్ర ఉపాద్యాయిని వద్ద మాదక ద్రవ్యాల బానిసత్వాన్ని గురించి ఉన్న కొన్ని నోట్సులు తనకు కావాలని అడిగినప్పుడు అతనికి లభించిన జవాబు అది. అయితే, మునుపు ఈ ఉపాధ్యాయిని యెహోవాసాక్షుల ఎడల దురభిమానాన్ని కనపర్చింది. ఆమె దృక్పథం మారడానికిగల కారణం ఏమిటి?
పాస్క్వాలే ఇలా వివరించాడు: “ఒక పాఠం ముగిసిన తర్వాత, పిల్లలపై లైంగిక దురాచారం జరపడం అనే అంశంపై సమాచారాన్ని కనుగొనేందుకు సహాయం కొరకు ఉపాద్యాయిని విద్యార్థులను అడిగింది, తాను ఆ అంశంపైనే పోస్టు గ్రాడ్యుయేషన్ థెసిస్ సిద్ధం చేస్తుంది. ఆ అంశాన్ని గురించి మరియు ‘లైంగిక విద్య—దాన్ని ఎవరు ఇవ్వాలి?’ [ఫిబ్రవరి 22, 1992 (ఆంగ్లం)] వంటి, దానికి సంబంధించిన అంశాలను గురించి ఉన్న కొన్ని తేజరిల్లు! సంచికల విషయం నాకు జ్ఞాపకం వచ్చింది. అయితే, సాక్షుల ఎడల మా ఉపాద్యాయినికిగల దురభిమానాన్ని ఎరిగిన నేను, ఆమెకు ఆ పత్రికలను ఇవ్వమని నా తోటి విద్యార్థినిని అడిగాను.”
కొన్ని రోజుల తర్వాత, మాదక ద్రవ్యాల బానిసత్వాన్ని గురించి తను ఉపాద్యాయినిని నోట్సు అడిగినప్పుడు ఏమి జరిగిందో పాస్క్వాలే వివరిస్తున్నాడు: “ఆమె వెంటనే సమాధానమివ్వలేదు. బదులుగా, ఆమె లేచి నిలబడి నాతో కరచాలనం చేసేందుకు వచ్చింది. యెహోవాసాక్షుల పత్రికలను తాను మునుపు అంగీకరించేందుకు ఇష్టపడేది కాదని, ఎందుకంటే అవి మరీ సాధారణమైనవని, పిల్లకాయల కొరకైనవని తను వాటిని పరిగణించినట్లు ఆమె చెప్పింది. అయితే వాటిని చదివిన తర్వాత ఆమె మనస్సు మార్చుకుంది. ఈ పత్రికలు సాంఘికపరంగా చాలా ఉపయోగకరమైనవని తాను కనుగొన్నానని ఆమె చెప్పింది. తేజరిల్లు!లోని అంశాలను తన థెసిస్కి జత చేస్తానని ఆమె చెప్పింది.”
మాదక ద్రవ్యాల బానిసత్వం అనే అంశంపై నోట్సు కావాలని పాస్క్వాలే అడిగిన విషయం ఏమైంది? “నేను వాటిని నీకు తప్పకుండా ఇస్తాను, అయితే తేజరిల్లు!ను సంప్రదిస్తే నీకు శ్రేష్ఠమైన సమాచారం లభిస్తుంది. అది యోగ్యమైన అంశాలను గురించి చర్చించే పత్రిక, అది విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా చాలా ఉపయోగకరమైన పత్రిక” అని ఆమె చెప్పింది.
తేజరిల్లు! ప్రస్తుత సమస్యలను పరిశీలిస్తుంది, అనుదిన జీవితంలోని చిన్నా పెద్ద సవాళ్లను ఎదుర్కొనే వారికి ఆచరణాత్మక సహాయాన్నిస్తుంది. బైబిలు ఏ సహాయాన్ని అందించగలదో తెలుసుకోవాలని మీరు ఇష్టపడుతుంటే, తేజరిల్లు!ను పంచిపెట్టే యెహోవాసాక్షులను సంప్రదించండి లేక 5వ పేజీలోని తగిన చిరునామాకు వ్రాయండి.