నములుతూ నములుతూ నాశనానికి పోవడం
ఇండియాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
రేడియోలో వచ్చే రసవత్తరమైన అనుప్రాసాదులు దాన్ని ఉపయోగించమని ప్రజలను ప్రోత్సహిస్తాయి. అది ఉత్సాహభరితమైన, ప్రతిష్ఠగల జీవన శైలికి దారితీసేదని సినిమా తారలు దాన్ని టి.వి.లో, పత్రికలందు, వార్తాపత్రికలందు ప్రోత్సహిస్తారు. అయితే ఆ ఉత్పాదనను ఉపయోగించడం మీ ఆరోగ్యానికి హాని కలిగించగలదని చిన్న అచ్చులో ఉన్న అక్షరాలు హెచ్చరిస్తాయి. ఇంతకూ అది ఏమిటి? అది కిళ్లీ అని పిలువబడే వ్యసనకరమైన మరియు హానికరమైన ఒక పదార్థం.
కిళ్లీ ఆసియాలో ఉపయోగింపబడుతుంది, మరి ఇండియాలో చాలా విరివిగా ఉపయోగింపబడుతుంది. దాని సాంప్రదాయిక రూపంలో, వక్కపొడి, పొగాకుల మిశ్రమం మరియు రుచిని పెంచే ఇతర పదార్థాలు ఉంటాయి. పొగాకు మరియు వక్కపొడి కిళ్లీని వ్యసనకరమైన దానిగా చేస్తాయి. వీటిని రాతి సున్నం, మొక్కల్లోనుండి తీయబడిన వగరు పదార్థమైన కాసు పూయబడిన తమలపాకులో పెడతారు. దానిలో పెట్టబడిన వాటిని మూసేందుకు ఆ ఆకును మడవటం జరుగుతుంది, తర్వాత ఆ మొత్తాన్ని నోట్లో పెట్టుకుంటారు. ఒక ప్రఖ్యాతి గాంచిన రూపం పాన్ మసాలా, అందులో అవే మిశ్రమ పదార్థాలను తడి లేకుండా, సులభంగా తీసుకెళ్లగలిగేలా, ఏ సమయంలోనైనా ఉపయోగించుకోగల విధంగా చిన్న షాసేలో ప్యాక్ చేయడం జరుగుతుంది.
దాన్ని నమిలేందుకు కాస్త ఎక్కువ సమయమే పడుతుంది, అది ఎక్కువ మోతాదులో లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తుంది, దాన్ని అప్పుడప్పుడూ ఉమ్మేస్తుండాలి. కిళ్లీని ఎక్కువగా తినే చాలా ఇళ్లల్లో ఉమ్మితొట్టి ఉంటుంది, అయితే ఇంటి వెలుపల కాలిబాటలో లేక ఒక గోడపై దాన్ని ఉమ్ముతుంటారు. ఇండియాలో ఉండే అనేక కట్టడాల్లోని మెట్లు మరియు వసారాల్లో కనిపించే ముదురు ఎరుపు రంగు మరకలకుగల కారణం ఇదే.
టాటా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసర్చ్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం, ఇండియాలో ప్రతి సంవత్సరం క్రొత్తగా వచ్చే క్యాన్సర్ కేసుల్లో 10 శాతం నోటి క్యాన్సరుకు సంబంధించినవే, అవి ప్రపంచ సగటులో దాదాపు రెండంతలు ఉన్నాయి. నోటి మరియు దౌడ, ముఖమునకు సంబంధించిన శస్త్ర చికిత్సకుడైన డా. ఆర్. గుణశీలన్, కిళ్లీ నమలడంపైనే నిందను చాలావరకు మోపడంలో ఇండియా అంతటానున్న ఇతర శస్త్రచికిత్సకులతో ఏకీభవిస్తున్నాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో అతనిలా అన్నాడు: “అన్ని రకాలైన కిళ్లీలూ నోటికి హానికరమైనవే.” కిళ్లీ “కచ్చితంగా నోటి క్యాన్సర్‌కు దారి తీయగలదు” మరియు “దాన్ని నమలడం ముఖ వికారాకృతిని ఆహ్వానించడమని” అతను పేర్కొన్నాడు. కాబట్టి, కిళ్లీ నమలడమంటే నములుతూ నములుతూ నాశనానికిపోవడమని అర్థం.
[31వ పేజీలోని చిత్రం]
ఇండియాలో క్రొత్తగా వచ్చే క్యాన్సర్ కేసుల్లో పది శాతం నోటి క్యాన్సర్‌వే
[క్రెడిట్ లైను]
WHO photo by Eric Schwab