కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 10/8 పేజీ 31
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1994
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1997
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 10/8 పేజీ 31

మా పాఠకుల నుండి

నమ్మకం కొంతమంది స్నేహితులచేతను బంధువులచేతను మోసగించబడ్డాను కాబట్టి నేను క్రుంగిపోయినట్లుగా భావించాను. నా చుట్టూవున్న ప్రతి ఒక్కరు నమ్మదగినవారేనా అని సందేహించనారంభించాను. అయితే “మీరెవరిని నమ్మగలరు?” (మార్చి 8, 1996) అన్న శీర్షికల పరంపర నమ్మకం విషయంలో నాకు సమతుల్యానిచ్చింది. అలాంటి సమయానుకూల సమాచారాన్ని అందించినందుకు కృతజ్ఞతలు.

ఇ. ఐ., కొరియా

నన్ను దూషించే నా తండ్రి, ఇద్దరు భర్తలు మరియు ఒక క్రైస్తవ సహోదరుడు అనేక సంవత్సరాలుగా నన్ను వంచించారు. ఇక నేను ఎవరిని కూడా నమ్మకూడదనే నిర్ణయానికి వచ్చే స్థితికి చేరుకున్నాను. నాకు ప్రజల అవసరం లేదని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. కాని ఈ శీర్షిక ఎక్కువ సమతుల్యతను కలిగివుండేందుకు నాకు సహాయం చేసింది. నమ్మడమంటే నాకు కొంచెం కష్టమైనప్పటికి, నేను దానికొరకు ప్రయత్నిస్తూ ఉంటాను. ఈసారి ఎవరిని నమ్మాలనే విషయంలో నేను మరింత జాగ్రత్త వహిస్తాను.

కె. హెజ్‌., అమెరికా

మాటర్‌హార్న్‌ “విశిష్టమైన మాటర్‌హార్న్‌” (మార్చి 8, 1996) అనే శీర్షికను నేను చదివాను. అందమైన ఆ పర్వత చిత్రం నిజంగా నా దృష్టిని ఆకర్షించింది! ఈ శీర్షిక నేను దేవుని సృష్టిని మరింత ప్రశంసించేటట్లు చేసింది.

జె. డబ్ల్యు., అమెరికా

ఆపిల్స్‌ “రోజుకొక ఆపిల్‌ వైద్యున్ని దూరంగా ఉంచుతుంది” (మార్చి 8, 1996) అనే శీర్షికకు అనేకమైన ధన్యవాదాలు. మా చిన్న పొలంలో 100 ఆపిల్‌ చెట్లున్నాయి కాబట్టి, ఇది నా ఆసక్తిని వృద్ధి చేసింది. చెట్లు మంచి ఉత్పత్తినిచ్చేందుకు మేము వాటి కొమ్మలను కత్తిరిస్తూ, వాటిని శుభ్రపరుస్తూ ఉంటాం. మీ శీర్షికలలోని కచ్చితమైన సమాచారాన్ని మేము ప్రశంసిస్తున్నాము. అవి ఆహ్లాదాన్ని కలిగించి, నమ్మదగిన సమాచారాన్ని అందించినాయి.

పి. బి., అమెరికా

అనివార్య ప్రవర్తన “అనివార్య ప్రవర్తన—అది మీ జీవితాన్ని అదుపు చేస్తోందా?” (మార్చి 8, 1996) అనే శ్రేష్ఠమైన శీర్షికకొరకు ధన్యవాదాలు. నా వయస్సు 20 ఏండ్లే, నేను అనివార్య ప్రవర్తనవల్ల బాధపడుతున్నాను. నాలో జరుగుతున్నదాని గూర్చిన సమాచారాన్ని పంపమని యెహోవాను నేను ప్రార్థనలో తరచూ అడుగుతుండేదాన్ని.

ఎమ్‌. ఎ. సి., స్పెయిన్‌

నేను పయినీరింగ్‌ ఆరంభించి, అంటే పూర్తి-కాల సువార్తికురాలిగా సేవ చేస్తూ ఉన్నపుడు దేవుని గూర్చి అమర్యాదపూర్వకమైన, అనుద్దేశపూర్వకమైన ఆలోచనలతో బాధపడడం మొదలు పెట్టాను. నేను క్షమించరాని పాపం చేశానని అనుకుంటూ అనేకమార్లు ఏడ్చేదాన్ని. నా భావాలను తేటతెల్లంగా వివరించిన విధానాన్ని గూర్చి నేను ఇప్పుడు ఏలా భావిస్తున్నానో మీరూహించలేరు. మరొక వ్యక్తి కూడా ఇటువంటి బాధను అనుభవిస్తున్నారని నేనెప్పుడూ తలంచలేదు. సహోదరులా, మీరు ఎల్లవేళల మాకు సహాయంగా ఉంటున్నందుకు కృతజ్ఞతలు.

కె. బి., నైజీరియా

నేను ఆ శీర్షికను కన్నీటితో పదే పదే చదివాను. అది నా పరిస్థితిని అంతా వివరంగా చూపింది! నాకు పిచ్చి పట్టిందేమోనని లేదా దయ్యాలు నన్ను పట్టి పీడిస్తున్నాయేమోనని అనుకునేదాన్ని. సహోదరుల్లో ఇతరులు కూడా ఇటువంటి అస్వస్థత మూలంగా బాధపడుతున్నారని తెలుసుకోవడం నాకు ఉపశమనాన్నిచ్చింది.

కె. టి., జపాన్‌

ఈ సమస్యకు సహాయంకొరకు పలుమార్లు యెహోవా వైపునకు తిరిగాను. ఇక మానుకుందామనే నిర్ణయానికి వచ్చాను, ఎందుకంటే అది వ్యర్థమని, ఏదికూడా నాకు సహాయం చేయజాలదని నేను భావించాను. ఇప్పుడు నన్ను నేను అర్థం చేసుకున్నాను, నేను కుదుటపడినట్లుగా భావిస్తున్నాను. ఈ శీర్షిక ఎంతో ప్రేమపూర్వకంగా వ్రాయబడినట్లుగా నేను అనుకుంటున్నాను. మనలను గూర్చి యెహోవా తప్పక శ్రద్ధ తీసుకుంటాడనేది నిశ్చయం.

జె. ఎఫ్‌., జెక్‌ రిపబ్లిక్‌

ఇప్పటికి ఏడు సంవత్సరాలుగా నేను అనివార్య ఆలోచనల మూలంగా మానసిక వేదనను అనుభవిస్తున్నాను. అది నేను అలసిపోయినట్లుగా, కృంగిపోయినట్లుగా నన్ను భావింపజేసింది. దీన్ని గూర్చి ఇతరులతో చర్చించడానికి నాకు మరీ సిగ్గనిపించేది, అపరాధ భావంతోను ఉన్నట్లు భావించేదాన్ని. నిజంగా నాకు పిచ్చెక్కిందేమోనని అనుకున్నాను. ఈ శీర్షికను చదివినప్పుడు నేను నమ్మలేకపోయాను. నేను అనుభవిస్తున్నట్లుగానే, ఇతరులుకూడా అలా అనుభవిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది! నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇక నేను ఒంటరిదానను కాను. నేను క్షమించరాని పాపం ఏమి చేయలేదు గనుక, యెహోవా నాపై కోపగించుకోలేదు.

ఎస్‌. బి., దక్షిణ ఆఫ్రికా

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి