భూ గ్రహానికి ఓ అద్భుతమైన భవిష్యత్తు
“భూమి గత 600 సంవత్సరాలుగా ఉన్నదాని కన్నా ఇప్పుడు మరింత వేడిగా ఉందని పరిశోధన చూపిస్తుంది” అని టొరొన్టో గ్లోబ్ అన్డ్ మెయిల్ నివేదిస్తుంది. 1995లో మధ్య అమెరికాలోని వడగాలి చికాగోలోని 500 కన్నా ఎక్కువ మంది ప్రజల ప్రాణాలను బలిగొంది. గత “200 సంవత్సరాల్లో అతి పొడిగా ఉన్న మూడవ వేసవి”ని ఇంగ్లండ్ అనుభవించగా, అలాంటి తీవ్రమైన పరిస్థితులే ఇండియాలోను ఆస్ట్రేలియాలోను ఏర్పడ్డాయి.
దీనంతటికీ కారణమేమిటి? “భూగోళ వాతావరణంపై మానవ ప్రభావం గుర్తించగలిగినంతగా ఉందని మరిన్ని రుజువులు సూచిస్తున్నాయి” అని కెనడాలోని పర్యావరణశాఖ సమాఖ్యలో పని చేస్తున్న వాతావరణ నిపుణుడైన హెన్రీ హెన్జ్వెల్డ్ చెబుతున్నాడు. గ్లోబ్ అన్డ్ మెయిల్ నివేదిక ప్రకారం, “శిలాజ ఇంధనాలను కాల్చడం వలన కలిగిన ఫలితమని తలంచబడిన అసాధారణమైన వాతావరణం భూగోళం వేడెక్కడం వలన కలిగే ఫలితాలను ప్రదర్శించే కంప్యూటర్ మోడళ్ళకు అనుగుణ్యంగా ఉంది.”
భూగోళం వేడెక్కడం అనేది విజ్ఞానశాస్త్ర రంగాల్లో ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అయినప్పటికీ, “వాతావరణ పర్యావరణం గ్రహించగలదాని కన్నా అతి వేగంగా మానవజాతి దానిని దుర్వినియోగం చేస్తుంది” అని ది న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అభిప్రాయపడుతుంది.
సంతోషకరంగా, భూమి “యొకటే యెల్లప్పుడును నిలుచునది” అని బైబిలు చెబుతుంది. (ప్రసంగి 1:4) ఎందుకంటే సృష్టికర్తయైన యెహోవా దేవుడు దానిని నాశనం చేసేందుకు మానవున్ని గానీ లేదా ఏ ప్రకృతి శక్తులను కూడా అనుమతించడు. దానికి భిన్నంగా, ఆయన “భూమిని నశింపజేయువారిని నశింప”జేస్తాడు.—ప్రకటన 11:17, 18.
అంతేకాక, యెహోవా దేవుడు మన భూగ్రహం కొరకు, విధేయులైన మానవ జాతియంతటి కొరకు అద్భుతమైన భవిష్యత్తును దాచి ఉంచాడని బైబిలు మనకు హామీ ఇస్తుంది. “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. బహు క్షేమము కలిగి సుఖించెదరు.” భూమి భవిష్యత్తు మానవుని చేతిలో కాక, దేవుని చేతిలో ఉన్నందుకు మనమెంత సంతోషించగలం!—కీర్తన 37:11; 72:16; యెషయా 65:17-25; 2 పేతురు 3:13.
తేజరిల్లు! భవిష్యత్తు సంచికలను మీరు పొందాలనుకుంటున్నట్లైతే, దయచేసి మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులను సంప్రదించండి లేదా 5వ పేజీలో ఇవ్వబడిన చిరునామాల నుండి అతి సమీపంగా ఉన్నదానికి వ్రాయండి.Y
[Picture Credit Line on page 32]
NASA photo