కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 10/8 పేజీ 28
  • ఒక అసాధారణ కలయిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒక అసాధారణ కలయిక
  • తేజరిల్లు!—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన ఇళ్ళ ముందు డాల్ఫిన్‌
    తేజరిల్లు!—1998
  • డాల్ఫిన్‌లో ఉన్న సోనార్‌
    సృష్టిలో అద్భుతాలు
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1997
  • ప్రార్థన—దాన్ని మీరు ఇంకా బాగా చేయవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
తేజరిల్లు!—1996
g96 10/8 పేజీ 28

ఒక అసాధారణ కలయిక

“ఇది నా జీవితంలో నేను చేసిన ఏ పని కన్నా అత్యంత ఉత్తేజకరమైన పని!” క్రిస్టీ తన అసాధారణ కలయికను గురించి అలా వర్ణించింది. మీరు మెక్సికో సింధుశాఖలోని డాల్ఫిన్‌లతో పాటు ఈదగలిగినట్లైతే మీరు కూడా ఇలాగే భావించి ఉండేవారా?

డాల్ఫిన్‌లు ఈదడం, లేదా తోకతో వెనక్కి నడవడం, ఆశ్చర్యం కలిగించేంత ఎత్తుకు ఎగరడం, లేదా మనుష్యులు తనపై కూర్చుని సవారీ చేయడానికి అనుమతించడం వంటి పనులు నీటిలో ఉండి చేయడం చూసే ప్రతి ఒక్కరు పులకించిపోతారు. ఈ ప్రదర్శనలను కేవలం చూడడం వల్లే నీటిలోనికి మునిగి ఆ డాల్ఫిన్‌లతో ఆడుకోవాలని ఒక మనిషికి అనిపిస్తుంది.

క్రిస్టీ ఎల్లప్పుడు ఇలాగే భావించేది. అయితే ఒకరోజు, ఆమె మెక్సికో సింధుశాఖలో పడవలో వెళ్ళి, అక్కడ ఈదుతుండగా ఒక తల అకస్మాత్తుగా ఆమె ముందు ప్రత్యక్షమైంది. ఇంతలోనే జిజ్ఞాసగల మూడు డాల్ఫిన్‌లు తమకు ఆడుకునేందుకు ఒకరు దొరికారని తలంచినట్లు కనిపించింది. క్రిస్టీ మొదట కొంచెం భయపడింది, కాని ఆమె ఆ డాల్ఫిన్‌లతో వ్యవహరించినప్పుడు ఆ భయం ఉత్తేజంగా మారింది. ఆమె పరిస్థితిని వాటికే వదిలి పెట్టి అవి ఏం చేస్తాయా అని చూద్దామని ఆగింది.

“ఒక డాల్ఫిన్‌ నీటిపై నా ఎదుటకు వచ్చేది—నేను అది పరస్పరం చూసుకునే వాళ్ళం. నేను దానిని లాలిస్తూ మాట్లాడుతున్నానని నేను గ్రహించాను—నేను నా కుక్కతో ఎలా ప్రవర్తిస్తానో అలాగే ప్రవర్తించాను” అని క్రిస్టీ చెప్పింది.

డాల్ఫిన్‌లకున్న తెలివి కారణంగా అవి ప్రసిద్ధమైన వినోదకారులయ్యాయి, ప్రజల ఎడల వాటి స్నేహపూర్వకమైన ప్రవర్తన వల్ల డాల్ఫిన్‌లు తమ కౌశల్యాన్ని ప్రదర్శించేలా చేసేందుకు వాటిని ఎవరు తిండితో ఎల్లప్పుడూ మచ్చిక చేసుకోనవసరం లేదని వాటికి తర్ఫీదునిచ్చేవారు చాలా మంది చెబుతున్నారు.

డాల్ఫిన్‌లతో పనిచేసేటప్పుడు అత్యంత ఆస్వాద్యమైన పనేదని అడిగినప్పుడు, “వాటి నైజమే అదనుకుంటా. ఎందుకంటే అవి సహజంగానే సరదాగా ఉంటాయి, మరియు జిజ్ఞాసగలిగి ఉంటాయి, మీరు నిజంగా వాటితో మంచి స్నేహబంధాన్ని పెంచుకోవచ్చు . . . స్పర్శకు ఆప్యాయతకు అవి చాలా బాగా ప్రతిస్పందిస్తాయి” అని అమెరికాయందలి ఫ్లోరిడాలోని సీ వర్ల్‌డ్‌లోని జంతు ప్రవర్తన శాస్త్రజ్ఞురాలైన లిజ్‌ మోరిస్‌ చెప్పింది. క్రిస్టీకి కనిపించినట్లే దేవుడు వాగ్దానం చేసిన నూతన విధానంలో మనమందరమూ ఎన్నెన్నో అద్భుతమైనవాటిని కలుసుకోగలుగుతాము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి