కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 10/8 పేజీలు 25-26
  • బహిష్కరించడం ఎందుకు ఒక ప్రేమపూర్వక ఏర్పాటు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బహిష్కరించడం ఎందుకు ఒక ప్రేమపూర్వక ఏర్పాటు
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అది దేవుని నామాన్ని ఉన్నతపర్చుతుంది
  • అది సంఘాన్ని సురక్షితంగా ఉంచుతుంది
  • వ్యక్తులకు పరిరక్షణ
  • దేవుని వద్దకు తిరిగి రండి
  • బహిష్కరించడం ఎందుకు ప్రేమతో చేసిన ఏర్పాటు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • యెహోవా ఇచ్చే క్రమశిక్షణను ఎల్లప్పుడూ అంగీకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • బహిష్కరణ—ప్రేమగల ఓ ఏర్పాటా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మనం ప్రేమించేవాళ్లు ఎవరైనా యెహోవాకు దూరమైతే . . .
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 10/8 పేజీలు 25-26

బైబిలు ఉద్దేశము

బహిష్కరించడం ఎందుకు ఒక ప్రేమపూర్వక ఏర్పాటు

వెలివేయడం—ఆ తలంపే అనేక మతాలకు చెందిన ప్రజలలో రకరకాల భావాలను కలిగిస్తుంది.a మతాలకు ఏదో విధమైన క్రమశిక్షణ అవసరమని చాలామంది ప్రజలు అంగీకరిస్తారు. వెలివేయడాన్ని అనేకులు పాత పద్ధతియని, గాలింపులను ఇంక్విజీషన్‌లను తమకు జ్ఞాపకం చేసే కఠిన విధానమైన క్రమశిక్షణ అని భావిస్తారు.

చొచ్చుకొనిపోతున్న లోక ప్రభావం ఈ సమస్యను అధికం చేసింది. అలా, క్రైస్తవమత సామ్రాజ్యములోని అనేక మతాలు పాపం ఎడల ఎక్కువ సహనశీల దృక్పథాన్ని అలవరచుకున్నాయి. ఒక ఎపిస్కోపాలియన్‌ పరిచారకుడు ఇలా అన్నాడంటే అందులో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు: “వెలివేయడమనేది మన పారంపర్యంలో ఒక భాగం, అయితే ఈ శతాబ్దంలో అది ఆహ్వానింపబడుతుందని నేను భావించను.”

అయితే, యెహోవాసాక్షులు బహిష్కరణను (వెలివేయడానికి సమానమైన దానిని) గంభీరమైన దానిగా పరిగణిస్తున్నారని తెలుసుకుని అనేకమంది ప్రజలు ఆశ్చర్యపోవచ్చు. ఆ చర్యను తీసుకోవడం అంత సులభం కాదనే విషయాన్ని ఒప్పుకోవలసిందే, అయితే అదొక ప్రేమపూర్వక ఏర్పాటు. అదెలా?

అది దేవుని నామాన్ని ఉన్నతపర్చుతుంది

యెహోవా పరిశుద్ధమైన దేవుడు. తనను ఆరాధిస్తున్నామని చెప్పుకునే వారు యధేచ్ఛగా పాపం చేస్తే ఆయన సహించడు. క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా . . . మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.” (1 పేతురు 1:14-16) కాబట్టి పశ్చాత్తాపం చెందని పాపులను బహిష్కరించడం దేవుని పరిశుద్ధ నామాన్ని ఉన్నతపర్చుతుంది; అది ఆ నామం ఎడల ప్రేమను చూపుతుంది.—హెబ్రీయులు 6:10 పోల్చండి.

ఒక క్రైస్తవుడు బలహీనతకు లోనైతే లేక తీవ్రమైన తప్పిదంలో పడిపోతే, అతడు వెంటనే సంఘంలోనుండి వెళ్లగొట్టబడతాడని దాని అర్థమా? ఎంతమాత్రం కాదు! యెహోవా కఠిన హృదయుడైన నియంత కాదు. ఆయన దయగలవాడు, అర్థం చేసుకుంటాడు. మనం అపరిపూర్ణులమని ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. (కీర్తన 103:14) “అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అని యెహోవా గుర్తిస్తాడు. (రోమీయులు 3:23) ఒకవేళ ఒక క్రైస్తవుడు “తప్పితములో” చిక్కుకున్నా లేక గంభీరమైన పాపం చేసినా, అతను సాత్వికమైన మనస్సుతో ‘మంచి దారికి’ వచ్చేలా చేసేందుకు దేవుడు సంఘంలో ఆత్మీయ సహాయం కొరకు ఏర్పాటు చేశాడు. (గలతీయులు 6:1) దేవుని వాక్యం నుండి సలహాలను అంగీకరించడం ద్వారా మరియు హృదయపూర్వక దుఃఖాన్ని మరియు యథార్థమైన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయడం ద్వారా, నీతిమార్గం నుండి వైదొలగినవాడు ఆత్మీయంగా “స్వస్థతపొంద”గలడు.—యాకోబు 5:13-16.

బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవుడు గంభీరంగా పాపం చేస్తే మరియు అతన్ని పునరుద్ధరించేందుకు చేయబడే ప్రయత్నాలన్నీ విఫలమౌతే అప్పుడేమిటి? వేరే మాటల్లో చెప్పాలంటే, తన పాపభరిత మార్గాన్ని మార్చుకునేందుకు అతను మొండిగా నిరాకరిస్తే అప్పుడు మాటేమిటి?

అది సంఘాన్ని సురక్షితంగా ఉంచుతుంది

బైబిలు క్రైస్తవులకు ఇలా ఆజ్ఞాపిస్తుంది: “సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపను” కూడదు.—1 కొరింథీయులు 5:11.

ఈ బైబిలు నియమం కఠినమైనది మరియు అప్రతిష్టపాలు చేసేదా? కేవలం ఈ విషయాన్ని పరిశీలించండి: ఒక దుష్టుడైన నేరస్థుడు చట్టాన్ని ఉల్లంఘించినందుకు వాన్ని జైలుకు పంపితే, అది కఠినమైన దానిగా లేక ఉదాసీనమైన దానిగా దృష్టించబడుతుందా? లేదు, ఎందుకంటే సమాజం యొక్క శాంతిభద్రతలను పరిరక్షించే హక్కు ప్రజలకు ఉంది. అందునుబట్టి, ఆ నేరస్థుడు తన జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు అతను చట్టానికి లోబడే సమాజం నుండి బహిష్కరింపబడి ఉన్నాడు.

అదే విధంగా, క్రైస్తవ సంఘం పశ్చాత్తాపం చెందని తప్పిదస్థులను తమ మధ్యనుండి వెలివేయడంలో న్యాయబద్ధంగానే ఉంది. ఎందుకు? ఎందుకంటే సంఘం అనైతిక వ్యక్తులనుండి మరియు బుద్ధిపూర్వకంగా పాపం చేసే ఇతరులనుండి దూరంగా ఓ ఆశ్రయంగా ఉండాలి.

“ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును” అనే విషయాన్ని గుర్తిస్తూ, అపొస్తలుడైన పౌలు తోటి విశ్వాసులకు ఇలా ఆజ్ఞాపించాడు: “ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి.” (ప్రసంగి 9:18; 1 కొరింథీయులు 5:13) పాపాత్ముడు సంఘంలో అవినీతిని వ్యాపింపజేయకుండా ఉండడాన్ని ఈ చర్య నివారిస్తుంది, అది సంఘానికున్న మంచి పేరును కాపాడుతుంది.—1 తిమోతి 3:15 పోల్చండి.

వ్యక్తులకు పరిరక్షణ

బహిష్కరించడం సంఘంలోని ఆ యా వ్యక్తులను కూడా పరిరక్షిస్తుంది. ఈ ఉదాహరణను పరిశీలించండి: చెవులకు చిల్లులు పడేంత పెద్దగా కార్‌ హారన్‌ లేక కార్‌ అలారమ్‌ మ్రోగినప్పుడు నిద్రనుండి లేవడాన్ని ఊహించుకోండి. అంత పెద్ద శబ్దాన్ని అలక్ష్యం చేయడం అసాధ్యం; వాస్తవానికి, అది మీరు ఉలిక్కిపడేలా చేస్తుంది! అదే విధంగా, సంఘంలోనుండి ఎవరైనా వెలివేయబడినప్పుడు, నిరీక్షించబడుతున్నట్లుగా ఆ చర్య మందలోని ప్రతి సభ్యుని అవధానాన్ని పొందుతుంది. అది వారి భావాలలో కలతను రేపుతుంది. దాన్ని అలక్ష్యం చేయలేము. ఇది ఒక పరిరక్షణ ఎలా కాగలదు?

“ఎవరో బహిష్కరింపబడ్డారని నేను రాజ్యమందిరంలో మొదట విన్నప్పుడు, నా మొదటి ప్రతిస్పందన వ్యాకులతే. తర్వాత అది నన్ను దీనురాలిని చేసింది. నేను కూడా పడిపోగలనని నేను గుర్తించేలా అది చేసింది” అని ఒక సాక్షి చెబుతుంది. ఆమె మాటలు సూచిస్తున్న విధంగా, బహిష్కరించడం ఇతరులు తమ ప్రవర్తనను సరిచూసుకునేందుకు వారిని పురికొల్పగలదు.—1 కొరింథీయులు 10:12.

‘నేను ఆత్మీయంగా బలహీనపడే పరిస్థితులు నా జీవితంలో ఏవైనా ఉన్నాయా?’ వంటి ప్రశ్నలను మనల్ని మనం ప్రశ్నించుకోవడం ద్వారా, దేవుని ఎదుట మన స్థానం ఏమిటని పరీక్షించుకునేందుకు మనకు సహాయం లభించగలదు. ఈ విధంగా మనం ‘భయముతోను వణకుతోను మన సొంతరక్షణను కొనసాగించుకొనడంలో’ కొనసాగగలము.—ఫిలిప్పీయులు 2:12.

దేవుని వద్దకు తిరిగి రండి

కొంతకాలం కొరకు వెలివేయబడిన ఒక క్రైస్తవురాలు ఇలా చెబుతుంది, “నాకు ఇవ్వబడిన క్రమశిక్షణను అంగీకరించడం ఎంతో కష్టమనిపించింది, కానీ అది నాకు ఆవశ్యకం, ఎంతో అవసరం కూడా, అది జీవాన్ని రక్షించేదిగా ఉందని రుజువైంది.” ఇది బహిష్కరించడం యొక్క మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని ఉన్నతపర్చుతుంది. మునుపు పశ్చాత్తాపం చూపని పాపులు దేవుని వైపు తిరిగేందుకు తమ మొదటి అడుగు వేయడానికి ఇది వారిని పురికొల్పగలదు.

అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: ‘ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించును.’ (హెబ్రీయులు 12:6) “ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు” అనే విషయం వాస్తవమైనప్పటికీ “దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.”—హెబ్రీయులు 12:11.

రిచ్చర్డ్‌కు అదే సంభవించింది. దాదాపు రెండు సంవత్సరాల వరకు బహిష్కరింపబడి ఉండిన తర్వాత, అతను పశ్చాత్తాపం చెందాడు, దేవునికి అప్రతిష్ఠ తెచ్చే తన ప్రవర్తనను సరి చేసుకున్నాడు మరియు క్రైస్తవ సంఘంలోకి మళ్లీ అంగీకరించబడ్డాడు. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ అనుభవాన్ని గురించి అతనిలా చెబుతున్నాడు: “నేను బహిష్కరింపబడ వలసి ఉండినదని, నాకు లభించింది పూర్తిగా నేను పొందవలసిందేనని నేను గుర్తించాను. అది వాస్తవంగా అవసరమే, నా ప్రవర్తన తీవ్రతను మరియు యెహోవా యొక్క క్షమాపణను వెదక వలసిన అవసరతను నేను తెలుసుకునేందుకు నాకు సహాయం చేసింది.”

క్రమశిక్షణను సహించడం అంత సులభంగా ఉండకపోవచ్చు. దాన్ని అంగీకరించేందుకు దీనత్వం అవసరమౌతుంది, అయితే దానినుండి నేర్చుకునేవారు పుష్కలమైన ఫలాలను కోస్తారు.

కాబట్టి, బహిష్కరణ దేవుని పరిశుద్ధ నామాన్ని ఉన్నతపర్చి పాపం యొక్క అనైతిక ప్రభావాలనుండి అది సంఘాన్ని కాపాడుతుంది గనుక అది ఒక ప్రేమపూర్వక ఏర్పాటే. అంతే కాదు, “ప్రభువు సముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును . . . [అతని] పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగు”నట్లు తప్పిదస్థున్ని ప్రోత్సహించడం ద్వారా అది అతని ఎడల ప్రేమను ప్రదర్శిస్తుంది.—అపొస్తలుల కార్యములు 3:19, 20.

[అధస్సూచి]

a వెలివేయడమనేది ఒక మతంలోని సభ్యత్వం నుండి తీసివేయబడేందుకు దారితీసే క్రమశిక్షణా చర్య.

[Picture Credit Line on page 25]

The New Testament: A Pictorial Archive from Nineteenth-Century Sources, by Don Rice/Dover Publications, Inc.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి