బైబిలు జ్ఞానం కొరకు మీరు దప్పిగొనివున్నారా?
దశాబ్దాలుగా కమ్యూనిస్ట్ దేశాల్లో, బైబిలు చర్చలను స్వేచ్ఛగా జరపడం నిషేధించబడింది. కానీ ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోవడంతో అక్కడున్న లక్షలాది మంది ప్రజలు బైబిలు జ్ఞానం కొరకు వెదకడం ప్రారంభించారు. ప్రత్యేకంగా మునుపటి సోవియట్ గణతంత్ర రాజ్యాల్లో ఇది జరుగుతుండగా, తూర్పు యూరప్ దేశాల్లోని పరిస్థితి కూడా అలాగే ఉంది.
ఉదాహరణకు, హంగరీ నందలి పెక్స్కు చెందిన, 45 ఏళ్ల జీవశాస్త్ర, రసాయనశాస్త్రాల టీచరుకు బైబిలు చర్చ గొప్ప ఆనందాన్ని తెచ్చింది. “నేను బుడాపెస్ట్‌కు వెళ్లినప్పుడు ఓ యెహోవాసాక్షితో మాట్లాడడం ఉత్కంఠభరితమైన మరియు ఆనందదాయకమైన అనుభవాన్ని కలిగించింది. లేఖనాలను చదవడం నాకు ఇష్టం అంతేకాదు బైబిలు పఠనంలో భాగం వహించడాన్ని నేను విలువైందిగా ఎంచుతాను. మీరు చేసే సహాయాన్ని నేను కృతజ్ఞతాపూర్వకంగా అంగీకరిస్తాను” అని ఆ టీచరు వ్రాసింది.
యెహోవాసాక్షులు అలాంటి సహాయాన్ని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకూ అందించడంలో ఆనందిస్తారు. ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీతో బైబిలును చర్చించాలని మీరు ఇష్టపడినట్లయితే, Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India,కు లేక 5వ పేజీలో ఇవ్వబడిన సరైన చిరునామాకు వ్రాయండి.