కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 7/8 పేజీ 31
  • క్షయరోగం తిరిగి వ్యాపిస్తోంది!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్షయరోగం తిరిగి వ్యాపిస్తోంది!
  • తేజరిల్లు!—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • విజయం, విషాదం
    తేజరిల్లు!—1998
  • క్షయ—దానిపై సాగించే పోరాటంలో ఒక క్రొత్త ఆయుధం
    తేజరిల్లు!—1999
  • ప్రాణాంతక మైత్రి
    తేజరిల్లు!—1998
  • యుద్ధ హతుల సంఖ్యతో పోటీపడుతున్న మరణాల సంఖ్య
    తేజరిల్లు!—1998
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 7/8 పేజీ 31

క్షయరోగం తిరిగి వ్యాపిస్తోంది!

అమెరికా నందు 1950ల నుండి క్షయవ్యాధి (టిబి) కేసుల్లో ప్రతి సంవత్సరం 5 శాతం తగ్గింది. అయితే, 1985 నుండి టిబి కేసుల్లో 18 శాతం పెరుగుదల ఉంది. మందులు పని చేయని క్రొత్త రకపు రోగం ఉండడం మరింత కలతపరుస్తోంది. ఇప్పుడి టిబి సుమారు ప్రతి సంవత్సరం 30 లక్షలమందిని పొట్టనబెట్టుకుంటోందని అంచనా. టిబితో పోరాటం విఫల పోరాటంగా ఎందుకు ఉంది?

మామూలుగా ఆరు లేక తొమ్మిది నెలలపాటు తీసుకోవల్సిన మందులను అనేక మంది రోగులు క్రమంగా తీసుకోకపోవడం ఒక కారణం. ఉదాహరణకు న్యూయార్క్‌ నగరంలో, ముదురుతున్న టిబి సోకిన సుమారు 200 మంది రోగుల్లో 89 శాతం మంది తమ చికిత్సాకాలాన్ని పూర్తిచేయలేదని ఓ అధ్యయనం బయల్పర్చింది. అమెరికా లంగ్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడైన డా. లీ రీచ్‌మాన్‌ “ఆ ప్రజలు (ఎ) బాగుకారు, (బి) సాధారణంగానైతే మందులతో పోయే టిబి మందులకు లొంగని టిబిగా మారేందుకు కారణం కాగలరు కనుక అది చాలా భయంకరమైనది” అని అన్నాడు. అయితే ఈ రోగులు తమ స్వంత ఆరోగ్యంకంటే మరెక్కువ ప్రభావం చూపేవారుగా ఉన్నారు. “తమ మందులను తీసుకోకపోవడంవల్ల దాన్ని ఇతరులకు కూడా అంటించగలరు” అని డా. రీచ్‌మాన్‌ చెబుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎనభై లక్షలమంది ఉన్నారని అంచనావేయబడిన క్రొత్త కేసులకు ఇది కారణమనడంలో ఏ సందేహమూ లేదు.

మనం ఈ విధానంలోని “అంత్యదినములలో” జీవిస్తున్నామనేందుకు గల సూచనల్లో ‘ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతంలో తెగుళ్లు వ్యాపించడం’ కూడా ఉందని బైబిలు విద్యార్థులు గుర్తిస్తారు. (లూకా 21:11; 2 తిమోతి 3:1) దాని తర్వాత ఏమి వస్తుంది? “నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అన”ని ఓ క్రొత్త భూమి వస్తుంది. (యెషయా 33:24) అవును, యెహోవా తాత్కాలికమైన వాగ్దానాలను చేయడంలేదుకానీ, రోగం మరియు మరణాన్నుండి శాశ్వతంగా విమోచిస్తానని వాగ్దానం చేస్తున్నాడు.—ప్రకటన 21:1-4.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి