మా పాఠకుల నుండి
ఇంకా ఒంటరిగానే ఎందుకున్నాను? “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . అందరికీ వివాహమౌతుంది కాని నాకెందుకు కావడంలేదు? (నవంబరు 8, 1995) అనేకులు చాలా చిన్న వయస్సులోనే వివాహం చేసుకోవడంవల్ల ఈ ప్రాంతంలో వివాహాలు అకస్మాత్తుగా అధికమయ్యాయి. నాకు 18 సంవత్సరాలు వచ్చినా ఇంకా నాకు బాయ్ ఫ్రెండు లేడని కొందరు నన్ను గూర్చి బాధపడుతున్నారు. నేను సమతుల్యమైన దృక్పథాన్ని కల్గివుండేలా సహాయపడేందుకు ఈ శీర్షిక సరిగ్గా సమయానికి వచ్చింది.
ఎస్. జె., జర్మనీ
నాకు 19 ఏళ్లు, ఒంటరిగానే ఉంటున్నా అసలు ఎవరూ నాతో ఆసక్తి చూపకపోవడానికి నాలో ఏ లోపం ఉందా అని నేను తరచూ ఆలోచించేదాన్ని. కొందరు అవిశ్వాసులు ఆసక్తిని కనపర్చారు కానీ, నాకు కావల్సింది అలాంటి అవధానం కాదు. ఓర్పు అవసరమని మరియు నేను యెహోవాను ప్రీతిపర్చడమే నిజంగా ప్రాముఖ్యమని నేను గ్రహించేందుకు ఆ శీర్షిక నాకు సహాయపడింది.
జె. జి., అమెరికా
38 ఏళ్ల అవివాహితుడిగా, ఈ శీర్షికల్లో ఉన్న ప్రశ్నను నాకు నేను వేసుకున్నాను. అనేకమంది అవివాహితులైన క్రైస్తవ సహోదరీలు కాదనడాన్ని నేను భరించిన తర్వాత, “కోరిక సఫలము కాకుండుటచేత” వచ్చే వేదన ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. (సామెతలు 13:12) ఈ పరిస్థితిలోని అవివాహిత క్రైస్తవుల భావాలను యెహోవా న్యాయమైనవిగా దృష్టిస్తాడనీ మరియు మన విశ్వసనీయమైన సహనాన్ని ఆయన గుణగ్రహిస్తాడని తెలుసుకోవడం గట్టి అభయాన్నిస్తుంది.
డి. టి., అమెరికా
మహాగొప్ప చిత్రకారుడు “మహాగొప్ప చిత్రకారుని అన్వేషణ” అన్న క్రమమైన శీర్షికలను (డిశంబరు 8, 1995) చదివిన తర్వాత, నేను నా మెప్పుదలను వ్యక్తపర్చేందుకు కదిలించబడ్డాను. దూరదర్శినిలో మహాగొప్ప చిత్రకారునికి ఘనతనివ్వని ప్రకృతి గూర్చిన అనేక కార్యక్రమాలను నేను చూశాను. అయితే, తేజరిల్లు! పత్రిక మన దేవుడైన యెహోవాకు తరచూ ఘనతనిస్తుంది.
ఇ. జెడ్., అమెరికా
యెహోవాను దృష్టించడంలో ఇది ఎంత అద్భుతమైన నూతన విధమోకదా! ఆయన కళ నైపుణ్యత నిజంగా ప్రత్యేకమైనది, అలాగే ఆయన పనంతా అపూర్వమైనది. ప్రజలను యెహోవా దేవుని వద్దకు రాబట్టేందుకు తేజరిల్లు! పత్రికను ప్రీతికరంగా తయారుచేసే అనేకమంది నిపుణతగల కళాకారులకు కూడా నా అభివాదం తెల్పాలనుకుంటున్నాను.
ఎమ్. క్యు., అమెరికా
“మహాగొప్ప చిత్రకారుని అన్వేషణ” శీర్షికల పరంపరకు కృతజ్ఞతలు. (డిశంబరు 8, 1995) నేనూ ఓ చిత్రకారుణ్ణే కనుక నేను ఈ శీర్షికను ఎంతో మెచ్చుకున్నాను. దేవుని సృష్టిలోని విస్తారమైన రకాలు, కీర్తనల పద్యరూపక కళ మరియు అద్భుతంగా వ్రాయబడిన బైబిలు గద్యభాగాలన్నీ, యెహోవా కళను సృష్టించేవాడు మాత్రమేకాదు కానీ తానుకూడ దాన్ని ఆనందిస్తాడని చూపిస్తున్నాయి!
బి. ఆర్., అమెరికా
30 సంవత్సరాలకుపైగా కళతో సంబంధంగల నేను, ఇలాంటి అద్భుతమైన శీర్షికను తయారు చేయడంలో భాగంవహించినవారందరినీ నేను మెచ్చుకోవాలనుకుంటున్నాను! అది మన దేవుడైన యెహోవా మరియు ఆయన మహత్తరమైన సృష్టి సామర్థ్యాలను గూర్చిన తొమ్మిది పేజీల అద్భుతమైన సహేతుకమైన తర్కాన్ని అందించింది.
పి. ఎమ్., అమెరికా
ఆహారం వల్ల కలిగే అనారోగ్యం “ఆహారంవల్ల కలిగే అనారోగ్యం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి” అన్న మీ శీర్షికను చదవడంలో నేను ఆనందించాను. (నవంబరు 22, 1995, ఆంగ్లం) వృత్తిరీత్యా ఓ వంటవానిగా నేనూ ఓ విషయాన్ని చెబుదామనుకుంటున్నాను. ఒకరు ఉడికి ఉడకని మాంసాన్ని తినడం ఇష్టపడినట్లయితే, ఆహారంవల్ల కలిగే అనారోగ్యాన్ని నివారించడం సాధ్యం కాకపోవచ్చు. నిజమే, మాంసాన్ని ఎక్కువగా ఉడకబెట్టడంవల్ల, దానిలో తడి ఆరిపోయి జీర్ణంకాకపోవచ్చు. మాంసాన్ని చక్కగా వండేందుకు మరియు దానిలోని తడిని ఉంచేందుకుగల మంచి పద్ధతి, చిన్న మంటమీద కొద్దిగా తడి ఉంచి మూతవేసి వండడం.
జె. పి. కె., అమెరికా
ఈ వంట చిట్కా ఇచ్చినందుకు కృతజ్ఞతలు.—ఎడి.