ప్రపంచ పరిశీలన
స్త్రీలకు మరింత పని భారం
ఇంట్లో పనిని స్త్రీపురుషులు సమానంగా చేస్తారా? జర్మన్ ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వారు జరిపిన సర్వేక్షణ ప్రకారం అలా కాదు. ఇంటి పని చేయడంలో తాము వ్యయపర్చిన సమయమెంతో విశ్లేషించి నమోదు చేసుకోవడానికి ఆర్థిక శాస్త్రవేత్త నార్బర్ట్ స్కావర్ట్స్ మరియు డయిటర్ స్కాఫర్ 7,200 కుటుంబాలవారిని అడిగాడు. ఈ సర్వేక్షణలో గిన్నెలను కడగడం, షాపింగ్ చేయడం, అనారోగ్యులైన బంధువులను చూడడం మరియు కారు పైపై మరమ్మత్తులను చేయడం చేరి ఉన్నాయి. “వారికి ఉద్యోగమున్నా లేకపోయినా, పురుషులు చేసే పనికంటే స్త్రీలు వేతనంలేకుండా రెండింతలు పనిని చేస్తున్నారు” అని స్యుడ్యుట్స్‌కె జ్యూటంగ్ నివేదిస్తోంది.
“టీబి టైమ్ బాంబు”
ఇండియాలో ప్రతివారం, అనేకమైన మందులకు తగ్గని క్రొత్త క్షయరోగం (టిబి) 10,000 మందిని హతమారుస్తోందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రిక నివేదిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన క్రెయింగ్ క్లౌడట్ ప్రకారం ఇండియా “టిబి టైమ్ బాంబు మీద కూర్చునివుంది.” ప్రపంచవ్యాప్తంగా, ఈ క్షయరోగ క్రిమి 175 కోట్లమంది ప్రజలకు సోకింది. ఈ కేసులు అభివృద్ధి చెందుతున్న పేద దేశాల్లోనే సంభవిస్తున్నాయి కనుక, క్రొత్త మందులను తయారు చేసేందుకవసరమైన డబ్బును పెట్టడానికి ఇష్టపడడంలేదని ద లాన్‌సెట్ అనే బ్రిటిష్ వైద్య పత్రికవారు చేసిన ప్రాయోజిత మీటింగుకు 40 దేశాల నుండి నిపుణుల బృందం వచ్చింది.
నిజంగా కంపుకొట్టే దైత్యాకార పుష్పం
ప్రపంచంలోని అతి పెద్ద పువ్వు ఓ సృష్టి వింతే. దాని పేరు రాఫ్లేసియా, అది ఇంచుమించు బస్సు టైరంత పెద్దగా ఉంటుంది, మరి ఓ మానవ పిండం గర్భంలో పడిననప్పటినుండి జన్మించేంతవరకూ ఎంత కాలం పడుతుందో అది విచ్చుకునేందుకు అంత కాలం పడుతుంది. అంతేకాకుండా ఈ పుష్పం పూల గుచ్ఛమునకు తగదనేందుకు దాని పరిమాణం మాత్రమే కారణం కాదు. అది కంపుకొడుతుంది. పరాగ సంపర్కం కొరకు ఈగలను ఆకర్షించేందుకుగాను రాఫ్లేసియా కుళ్లిన మాంసం కంపుకొడుతుంది. గతంలో ఈ రాఫ్లేసియా పుష్పం పూసే వర్షాధార అడవుల్లో జీవించే మలేసియా గ్రామస్థులు, దానికి దయ్యం గిన్నె అని పేరుపెట్టి అది కనిపించిన వెంటనే దాన్ని నరికేసేవారు. అయితే, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారంగా, వైజ్ఞానికులు దీన్ని ఇంకా పరిశోధించేందుకు ఈ అరుదైన పుష్పాన్ని మలేషియన్ స్టేట్ పార్క్ ఆఫ్ కినబాలు తగిన చర్యనుగైకొంది. రాఫ్లేసియాలను ఫొటో తీసేందుకుగాను సందర్శకులను అడవిలోకి తీసుకువెళ్లడం ద్వారా స్థానిక గ్రామస్థులు అధిక డబ్బును సంపాదిస్తున్నారు. నిస్సందేహంగా, అనేకులు దానికి దూరంగానే ఉంటారు.
బాధలేకుండానిద్రపోవడం
కొన్ని సాధారణ నొప్పిని తగ్గించే మందులు ఇన్సోమియాకు దారితీయవచ్చని టఫ్ట్స్ యూనివర్శిటీ డైట్ అండ్ న్యూట్రీషన్ లెటర్ నివేదించింది. “ఎందుకంటే నొప్పిని నివారించే కొన్ని ప్రఖ్యాత మందుల్లో ఓ కప్పు కాఫీలోవుండేంత లేక అంతకంటే ఎక్కువే కఫీన్ ఉంటుంది.” తరచూ ఆస్ప్రిన్ మరియు ఇతర బాధనివారణి మందులు మరింత ప్రభావంతమయ్యేందుకుగాను తరచూ ఎక్కువ మత్తెక్కించని కఫీన్ చేర్చబడుతుంది. వాస్తవానికి, కొన్ని ప్రఖ్యాత మందుల్లో రెండు డోసుల టాబ్లెట్లకు 130 మిల్లీగ్రాముల కఫీన్ ఉంటుంది. అంటే “ఓ మామూలు” కాఫీ “కప్పులో ఉన్న 85 మిల్లీగ్రాములకంటే చాలా ఎక్కువన్నమాట.” అందువల్ల “పనిచేసే మందు పదార్థాలలో” కఫీన్ ఉందేమో చూసేందుకు ఆ బాధానివారణి లేబుల్ను చూడండి.
1995కి అదనంగా ఒక “లీప్ క్షణం” చేర్చడం జరిగింది
భూభ్రమణం కచ్చితమైన టైమ్‌కీపర్ అని నమ్మలేమట. ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారంగా, వైజ్ఞానికులవద్ద సరైన సమయాన్ని చూపించే మరో కచ్చితమైన పద్ధతి ఉంది—అదే సీజియమ్ పరమాణువు. పరమాణు గడియారంలో అతి ముఖ్యమైనదిగా ఉపయోగించబడే ఈ సీజియమ్ పరమాణువు, ఒక క్షణంలో సరిగ్గా 9,19,26,31,770 సార్లు కంపిస్తుంది. ఈ లెక్కన ఈ పరమాణు గడియారం, “3,70,000 సంవత్సరాల్లో ఒక క్షణం మాత్రమే పొరపాటుపడొచ్చు.” దానితో పోలిస్తే భూభ్రమణం సుమారు పదిలక్షల సార్లు తక్కువ ప్రమాణం గలది, అందుకనే “లీప్ క్షణాన్ని” క్రమంగా చేరుస్తుండాలి. 1995 చివరి భాగానికి ఒక “లీప్ క్షణాన్ని” చేర్చాలని టైమ్‌కీపర్ల అంతర్జాతీయ సభ నిర్ణయించింది. ఇది “మన గ్రహము మరియు కాలగమనం” సుసంఘటితమయ్యేందుకు అనుమతిస్తుంది. అయితే, ఈ ఆవిష్కరణకు వైజ్ఞానికులు ఘనతను తీసుకోలేరు. వాస్తవానికి, “చిన్నగా ఈ గడియారంలోని చిన్న అణుపదార్థాలు, గొప్ప గ్రహవ్యూహ క్రమాన్నే కదా అనుకరిస్తున్నాయి” అని టైమ్స్ పత్రిక చెబుతోంది.
సూర్యరశ్మి ఉత్సాహాన్ని వృద్ధిచేస్తుంది
భవనంలోనికి అధిక వెలుగును తీసుకురావడం వల్ల “ఉత్పత్తిని అధికంచేసి” “పని మానేసే రోజులను తగ్గింపును” తెస్తాయని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిస్తోంది. అసలు మొదట, ఇంధనాన్ని పొదుపు చేసే దృష్టితో చేపట్టిన భవన నిర్మాణ పద్ధతిని మార్చడం, పని చేసే స్థలంలోకి మంచి వెలుగును ప్రసరింపజేసి, ఉద్యోగస్థులు పనిలో ఉత్సాహాన్ని పెంచుకునేందుకు దోహదపడుతుంది. ఉదాహరణకు, లాక్‌హీడ్ కార్పొరేషన్ అనే ఓ పెద్ద కంపెనీ, “ఇంధన మొత్తంలో 50 శాతం తగ్గించే” మహా నైపుణ్యవంతమైన ఓ క్రొత్త కార్యాలయాన్ని కాలిఫోర్నియాలోని సన్నివెలెలో తెరిచారు. అయితే, ఉద్యోగులు తమ పరిసరాలను ఎంతగానో ఇష్టపడి, “గైరుహాజరు” 15 శాతం వరకు తగ్గిపోయిందని మాత్రం లాక్‌హీడ్ ఊహించలేదు. ఆ భవనంలోకి అధిక సూర్యరశ్మిని రానివ్వడంలో ఉన్న ప్రయోజనాలను చిల్లరవర్తకులు కూడా గమనించారు. కృత్రిమ వెలుగుకన్నా సహజమైన వెలుగు ఉన్న ప్రాంతాల్లో అమ్మకాలు “చాలా పెరిగాయని” ఓ వాణిజ్యవేత్త కనుగొన్నాడు.
నీటి పరిశీలనా ప్రపంచం
“వచ్చే శతాబ్దంలోని యుద్ధాలు నీటి విషయంలో జరుగుతాయి” అని ప్రపంచ బ్యాంకు పర్యావరణ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ హెచ్చరిస్తున్నాడు. సెరాగెల్డిన్ ప్రకారంగా, ఇప్పటికే 80 దేశాల్లో ఆరోగ్యానికీ మరియు ఆర్థిక విషయాలకు ప్రమాదం కల్గించే నీటి కొరత ఉంది. అయితే అసలు సమస్య భూమిమీద తగినన్ని నీళ్లులేకపోవడంవల్ల కాదు. “భూమిమీది మంచినీరు, ఒకరు ఊహించగల మానవ జనాభాకు అవసరమైన దానికంటే ఎక్కువేవుంది” అని జలశాస్త్ర నిపుణుడు రాబర్ట్ ఆంబ్రోగ్గీ చెబుతున్నాడు. నీటిని సరిగా ఉపయోగించక పోవడంవల్లనే ఎక్కువగా కొరత కలుగుతోంది. సాగుచేయడానికి ఉపయోగించే సగం నీరు భూమిలోకి పోతుంది లేక ఆవిరైపోతుంది. పట్టణ నీటి సరఫరాలో 30 నుండి 50 శాతం, కొన్నిసార్లైతే అంతకంటే ఎక్కువే వృథాగాపోతుంది. “గాలిలా ఉచితంగాకాక చమురు వంటి వనరులను ఎంత అమూల్యంగా చూస్తామో నీటినీ అలాగే చూసే కాలంవస్తోంది” అని ది ఎకానమిస్టు పత్రిక చెబుతోంది.