కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 6/8 పేజీలు 27-28
  • నాట్యం క్రైస్తవుల కొరకా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నాట్యం క్రైస్తవుల కొరకా?
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నాట్యం చేయడమంటే సంభాషించడమే
  • నాట్యం—సరైనది మరియు తప్పైనది
  • సరైనదో లేక తప్పైనదో నిర్ధారించేదెలా
  • స్థానిక సంస్కృతి, క్రైస్తవ సూత్రాలు ఈ రెండూ పొసుగుతాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
తేజరిల్లు!—1996
g96 6/8 పేజీలు 27-28

బైబిలు ఉద్దేశము

నాట్యం క్రైస్తవుల కొరకా?

కుర్చీలోనుండి లేస్తూ, ఒక యౌవన పురుషుడు “నేనిది చూడలేను. నేను బయటికి వెళ్లిపోవాలి” అని తన భార్యతో గుసగుసలాడాడు. చల్లటి రాత్రి గాలిలో నడవడానికని ఆయన ఆ గదిలోనుండి బయటకు వెళ్లిపోయాడు. ఆయనకు చాలా ఇబ్బందిగా ఉంది.

స్నేహితులు ఆయనను, ఆయన భార్యను ఒక సాంఘిక సమావేశానికి ఆహ్వానించారు. ఆతిథేయి నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాడు. అందులో ముగ్గురు స్త్రీల నాట్యం కూడా ఉంది. మిగతా ప్రేక్షకులు విచలితులైనట్లేమీ కనబడలేదు. ఆయన అతి సున్నితంగా ఉన్నాడా? నాట్యగత్తెలు కేవలం తమ అంతర్గత భావోద్రేకాలను వ్యక్తం చేస్తూ, నాట్యమాడగల తమ స్వేచ్ఛను ఆనందించడం లేదా? మనం నాట్యాన్ని క్రైస్తవ దృక్కోణం నుండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.

నాట్యం చేయడమంటే సంభాషించడమే

మానవులు సంభాషించే మార్గాల్లో అభినయాలు లేక కదలికలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, విదేశంలో ఉన్నప్పుడు అనేకమంది సందర్శకులు, తమ ప్రాంతంలో హానికరం కానిదిగా పరిగణింపబడే ఒక కదలిక అక్కడ విభిన్నమైన అర్థాన్ని—బహుశ అవాంఛనీయమైన అర్థాన్ని కలిగివుందని కనుగొని ఆశ్చర్యపోయారు. సాలమన్‌ దీవులు, మలేసియా, పాపువా న్యూగినియాల్లో సేవ చేసిన మాజీ మిషనరీ ఇలా వ్యాఖ్యానించాడు: “కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్రత్యేక శరీర కదలికలు లైంగిక అర్థాన్నిస్తాయి. ఉదాహరణకు, ఒక స్త్రీ నేలపై కాళ్లుచాచి కూర్చుని ఉన్నప్పుడు ఒక పురుషుడు ఆమె కాళ్లను దాటడం తప్పుగా భావించబడుతుంది. అదే విధంగా, నేలపై కూర్చున్న పురుషుని ఎదుట ఒక స్త్రీ నడిచి వెళ్లడం ఆమె అవివేక క్రియ చేసినట్లు అవుతుంది. ఈ రెండు సందర్భాల్లో కూడా లైంగిక ప్రతిపాదనలను వెంటనే పసిగడతారు.” మన శరీర కదలికలు మాట్లాడతాయన్న విషయం మనకు తెలిసినా తెలియకపోయినా ఆ విషయం మాత్రం కచ్చితం. చరిత్రంతటిలోనూ, నాట్యం చేయడం ఓ సంభాషణా విధానంగా ఉపయోగింపబడిందన్న విషయం మనకు ఆశ్చర్యాన్ని కలిగించకూడదు.

నాట్యంలో, ఒక వేడుకలో ఉండే ఆనందం, ఉల్లాసం నుండి మొదలుకొని మతపరమైన ఆచారం మరియు సాంప్రదాయంలోని గంభీరతను అంటే భావోద్రేకాల పూర్తి పరంపరను వ్యక్తీకరించవచ్చు. (2 సమూయేలు 6:14-17; కీర్తన 149:1, 3) ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా చెబుతుంది: “నాట్యకత్తె ప్రేక్షకులతో రెండు విశిష్ఠ మార్గాల్లో సంభాషిస్తుంది, అది శరీరం అలాగే ముఖం ద్వారా భావోద్రేకాలను వెలువరచడం ద్వారానైనా లేక మూఖాభినయం మరియు కదలికల ద్వారానైనా అయ్యుండవచ్చు.” కొన్ని నాట్యాల్లో సంభాషణ బిగ్గరగా, స్పష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇతర నాట్య పద్ధతుల్లో, నాట్యాన్ని గురించి తెలిసిన కొద్దిమంది మాత్రమే ఆ భాషను అర్థం చేసుకోగలరు. ఉదాహరణకు, క్లాసికల్‌ బ్యాలెట్‌లో గుండెపై చేతిని పెట్టుకోవడం ప్రేమను సూచిస్తుంది, అయితే ఎడమ చేతి నాల్గవ వ్రేలును చూపడం వివాహాన్ని సూచిస్తుంది. చైనీయుల ఒపేరాలో, వలయంగా తిరగడం ప్రయాణాన్ని సూచిస్తుంది, అయితే కొరడాను అడ్డంగా పట్టుకుని రంగస్థలంపై వలయంలా తిరగడం గుర్రంపై స్వారీ చేయడాన్ని సూచిస్తుంది; ఒక నల్లని పతాకాన్ని స్టేజీపై ఈడ్చుకుంటూ పోతే తుపానునూ, లేత నీలిరంగు పతాకమైతే గాలి తెమ్మెరను సూచిస్తుంది. అలా, నాట్యంలోని కదలికలు మరియు అభినయాల ద్వారా శరీరం సంభాషిస్తుంది. అయితే ఆ వర్తమానం ఎల్లవేళలా సరైనదేనా?

నాట్యం—సరైనది మరియు తప్పైనది

నాట్యం వినోదానికి మరియు వ్యాయామానికి ఒక ఆనందకరమైన మార్గం కావచ్చు. అది జీవితంలోని చక్కని ఉల్లాసానికి లేక యెహోవా యొక్క మంచితనం ఎడల మెప్పుకోలుకు ఆనందమయ భౌతిక ప్రతిస్పందనను చూపుతున్న శుభ్రమైన మరియు సరళమైన వ్యక్తీకరణ అయ్యుండవచ్చు. (నిర్గమకాండము 15:20; న్యాయాధిపతులు 11:34) కొన్ని సమూహ నాట్యాలు మరియు జానపద నాట్యాలను తిలకించి ఆనందించవచ్చు. యేసు, తప్పిపోయిన కుమారుని గూర్చిన తన ఉపమానంలో, వేడుకల్లో భాగంగా నాట్యమాడే వారి బృందాన్ని కూడా సూచించాడు, అంటే వారు అద్దెకు పిలుచుకున్న నాట్యమాడే వారి గుంపు అన్న విషయం స్పష్టమౌతుంది. (లూకా 15:25) కావున, బైబిలు నాట్యం మొత్తాన్ని ఖండించడం లేదన్నది స్పష్టం. అయితే, చెడు ఆలోచనలు, కోరికలు పురికొల్పబడటాన్ని గురించి మాత్రం అది హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ విషయంలోనే, కొన్ని నాట్య భంగిమలు అసభ్యంగా, చివరకు ఒకరి ఆత్మీయతకు ప్రమాదకరమైనవిగా కూడా ఉండవచ్చు. (కొలొస్సయులు 3:5) ప్రాచీన కాలాల నుండి కూడా కొన్ని సందర్భాల్లో నాట్యం కామప్రేరితంగా ఉండేది మరియు హానికరమైన సంకల్పాలకు ఉపయోగపడింది.—మత్తయి 14:3-11 పోల్చండి.

నాట్య కదలికలు మరియు తప్పుడు ఆలోచనల కలయిక తన చేతుల్లోని శక్తివంతమైన ఆయుధమని మన శత్రువైన అపవాదియగు సాతానుకు తెలుసు. (యాకోబు 1:14, 15 పోల్చండి.) కదులుతున్న శరీరం యొక్క లైంగిక ప్రేరణ గురించి మరియు కామపూరిత కోరికలను అదెలా రేకెత్తించగలదు అనే విషయాన్ని గురించి అతనికి బాగా తెలుసు. మన ‘మనస్సులు చెరుపబడి; క్రీస్తు ఎడలనున్న సరళతనుండి పవిత్రతనుండి ఎట్లయినా తొలగిపోయేలా’ సాతాను మనల్ని శోధించాలని నిశ్చయించుకుని ఉన్నాడని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. (2 కొరింథీయులు 11:3) మనం తప్పుడు నాట్యాన్ని చూడటం లేక అందులో భాగంవహించడం ద్వారా మన మనస్సులు అనైతిక ఆలోచనల్లో చిక్కుకుపోయేందుకు అనుమతిస్తే సాతాను ఎంత సంతోషిస్తాడో ఊహించండి. అదుపులేని మన కోరికలు హద్దులు మీరి మనం తప్పుడు ప్రవర్తనవలన వచ్చే కష్టాలపాలైతే అతను ఇంకా ఎక్కువ ఆనందిస్తాడు. ఆ ధ్యేయం కొరకే అతను కదలికను మరియు నాట్యాన్ని గతంలో ఉపయోగించాడు.—నిర్గమకాండము 32:6, 17-19 పోల్చండి.

సరైనదో లేక తప్పైనదో నిర్ధారించేదెలా

తుదకు, ఒక నాట్యాన్ని గుంపుగా చేసినా, ఒక జంటే చేసినా లేక ఒక వ్యక్తి మాత్రమే చేసినా, ఆ కదలికలు గనుక మీలో అశుద్ధ ఆలోచనలను రేపితే, ఆ నాట్యం ఇతరులకు హానికరం కాకపోయినా మీకు మాత్రం కచ్చితంగా హానికరమైనదే.

అనేక ఆధునిక నాట్యాల్లో భాగస్వాములు ఒకరిని ఒకరు తగలను కూడా తగలరని కొందరు పేర్కొన్నారు. అయితే, తగలడం ఇక్కడ వాస్తవంగా వివాదాంశమా? “దాని ముగింపు ఫలితం మాత్రం ఒకటే—అంటే ఒకవేళ భాగస్వామిని కౌగిలించుకున్నా లేక మగతలో ఉండి గమనించినా లభించేది మాత్రం ఒకటే, అదేమంటే నాట్యం చేస్తున్నప్పుడు వచ్చే భౌతిక ఆనందం మరియు భాగస్వామి ఎడల లైంగిక భావాలను కలిగివుండటం” అని చెప్పడం ద్వారా బ్రిటానికా ఆ విషయాన్ని తేల్చి చెప్పింది. వివాహ బంధం వెలుపల “భాగస్వామి ఎడల లైంగిక భావాలను కలిగివుండటం” యుక్తమైన విషయమేనా? “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును” అన్న యేసు వ్యాఖ్యానం ప్రకారం మాత్రం కాదు.—మత్తయి 5:28.

మీరు నాట్యం చేస్తారా లేదా అన్నది మీ వ్యక్తిగత ఎంపికే. ఈ క్రింది ప్రశ్నలను పరిశీలించడం మీరు జ్ఞానయుక్తమైన ఎంపిక చేసేందుకు మీకు సహాయం చేయగలదు. ఈ నాట్యం యొక్క సంకల్పం ఏమిటి? దానికున్న ప్రతిష్ఠ ఏమిటి? ఆ నాట్య కదలికలు ఏమి చెబుతున్నాయి? అవి నాలో ఎలాంటి ఆలోచనలను మరియు భావోద్రేకాలను రేపుతున్నాయి? అవి నా భాగస్వామిలో లేక దీన్ని చూస్తున్న వారిలో ఎలాంటి కోరికలను ప్రేరేపిస్తున్నాయి? ఇతరులు ఏమి చేస్తున్నప్పటికీ, మన ఉపోద్ఘాతంలోని యౌవన భర్త వలె, ఒకరు తమ మనస్సాక్షికి అనుగుణంగా కచ్చితంగా ప్రతిస్పందించాలి.

అందం, లయ మరియు సొగసు యొక్క బహుమతులను మనం ఆనందించాలని సృష్టికర్త ఇష్టపడుతున్నాడని బైబిలు సూచిస్తుంది. అవును, వాటిని ఆనందించండి—అయితే మీరు నాట్యం చేసినప్పుడు మీ శరీరం మాట్లాడుతుందని మనస్సులో ఉంచుకోండి. ఫిలిప్పీయులు 4:8 నందలి పౌలు నడిపింపు మాటలను జ్ఞాపకం ఉంచుకోండి: “యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి.”

[Picture Credit Line on page 27]

Picture Fund/Courtesy, Museum of Fine Arts, Boston

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి