మా పాఠకుల నుండి
లైంగిక వేధింపు “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . లైంగిక వేధింపు నన్ను నేనెలా రక్షించుకోగలను?” (సెప్టెంబరు 8, 1995) అనే మీ శీర్షిక కొరకు కృతజ్ఞతలు. నా వయస్సు 17 సంవత్సరాలు, నేను పాఠశాలవద్ద క్రైస్తవేతర అబ్బాయిని కలిశాను. నేనతన్ని నమ్మాను, కానీ అటుతరువాత అతడు, అతని స్నేహితులు అశ్లీల సూచనలు, బెదిరింపులతో నన్ను వేధించారు. నేనా పరిస్థితినుండి విముక్తి పొందడానికి ఆ పాఠశాలను విడిచిపెట్టవలసివచ్చింది. ఈ శీర్షిక నుండి నేనెంతో నేర్చుకున్నాను. మగవారితో వ్యవహరించే విషయానికొస్తే ఏమి చేయాలో నాకిప్పుడు తెలిసింది.
టి. జి., పోర్చుగల్
ఒక సహోద్యోగి నన్ను లైంగికంగా వేధించి, బెదిరించాడు. చిన్నప్పుడు అత్యాచారానికి గురైన నేను, నాకై నేనుగా నిలబడడం కష్టంగా ఉన్నట్లు కనుగొన్నాను. అయినా, నన్ను ఒంటరిగా విడిచిపెట్టమని నేనతనిని పదేపదే అడిగాను. చివరికి అతన్ని గురించి నేను మా యజమానులకు ఫిర్యాదు చేశాను, అప్పుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. నేనీ శీర్షికను నిజంగా మెచ్చుకుంటున్నాను. ఈ సమస్యతో ఎలా వ్యవహరించాలో స్త్రీలు తెలుసుకోవాలి.
వి. ఎ., అమెరికా
జారత్వం “బైబిలు ఉద్దేశము: జారత్వాన్ని క్షమించాలా వద్దా?” (సెప్టెంబరు 8, 1995) శీర్షిక కొరకు మీకు చాలా కృతజ్ఞతలు. సంవత్సరాలు బాధింపబడిన తరువాత, నేను నా మాజీ భర్త నుండి లేఖనాధారమైన విడాకులను పొందాను. అయినా, కొంతమంది అలా చేసినందుకు నేను అపరాధిలా భావించేలా చేశారు, నేను ఈ భావంతో చాలా సంవత్సరాలు పోరాడవలసి వచ్చింది. చివరికి యెహోవా నన్ను తృణీకరించాడని కూడా నేను తలంచాను. అయినా, ఈ శీర్షిక నా భావాలలో చాలా వాటిని వ్యక్తం చేశాయి, మరి అది నన్ను ఎంతో ప్రోత్సహించింది.
ఎ. కె., చెక్ రిపబ్లిక్
జపాన్‌లోని భూకంపం “జపాన్‌లో అకస్మాత్తుగా సంభవించిన విపత్తును ప్రజలెలా ఎదుర్కున్నారు” (సెప్టెంబరు 8, 1995) శీర్షికను చదివి నేను ఏడ్చాను. ఆ భూకంపంలో నేను నా అభిమాన క్రైస్తవ సహోదరిని కోల్పోయాను. ఆమె చాలా ఉత్సాహంగలది. ఆమె పునరుత్థానమౌతుందని, నేను మరలా ఆమెను చూడగలనని నాకు తెలుసు. సంఘంనుండి, సంస్థనుండి మేము పొందిన ఆత్మీయ, భౌతిక సహాయం అంతటికీ నేను చాలా కృతజ్ఞుడను. అయినా, ఆ రోజు జరిగినదాని గురించి తలంచినప్పుడు నేనిప్పటికీ ఏడుస్తాను.
టి. ఎమ్., జపాన్
సాక్షులు ఎంతో వేగంగా, కట్టుదిట్టంగా చేసిన పని నిజంగా నేను అచ్చెరువొందేలా చేసింది. కొరియాలోని ఒక సంఘంలోని సహోదరులనుండి శ్రద్ధాపూర్వక సందేశాన్ని చదివినప్పుడు నేను ఎంతో ఏడ్చాను. నేను ఇంత శ్రద్ధాపూర్వక సంస్థకు చెందినవాడనని తలంచడానికి నేనెంతో సంతోషిస్తున్నాను.
ఎమ్. కె., జపాన్
ఖడ్గమృగం అంత అవసరం కాని సమాచార అంశాన్ని—ఆనందం కొరకు చదివే అలవాటు అసలే లేని నాలాంటి వారికి కూడా, ఆహ్లాదకరంగా ఉండేట్లు చేసే మీ సామర్థ్యానికి నేను నా మెప్పుకోలును, ప్రశంసను వ్యక్తం చేయాలని అనుకున్నాను. నేనిప్పుడే “ఆ ఖరీదైన కొమ్ములు గల జంతువు” (సెప్టెంబరు 8, 1995) శీర్షికను చదవడం ముగించాను. విధిగా చదవాల్సిన అవసరం ఉంటేనే నేను సాధారణంగా ఇటువంటి శీర్షికలు చదవడం మొదలు పెడతాను. అయినా, చివరికి, అవి చదవడానికి ఎంత ఆనందదాయకంగా ఉన్నాయనే విషయాన్ని గురించి నేనెప్పుడూ అచ్చెరువొందుతుంటాను!
జె. ఎమ్., అమెరికా
సెలెస్టే జానెస్ కథ నేను మీ పత్రికలను 17 సంవత్సరాలుగా చదువుతున్నాను. “దేవుని కాపుదల నుండి నేనెలా ప్రయోజనం పొందాను” (జూలై 8, 1995) శీర్షికలో సెలెస్టే జానెస్ అనుభవం విన్న తరువాత, నేను నా మెప్పుదలను వ్రాసి వ్యక్తం చేయాల్సి వచ్చింది.
ఎమ్. ఎమ్., కొలంబియా
సెలెస్టే జానెస్ 1995 అక్టోబరు 27న చనిపోయింది. తన మరణానికి ముందు, తన అనుభవాన్ని పంచుకున్నందుకు ప్రపంచమంతటా ఉన్న పాఠకులనుండి, కృతజ్ఞతలు చెబుతున్న ఎన్నో ఉత్తరాలను ఆమె అందుకుంది.—ఎడిటర్.