కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 3/8 పేజీలు 3-4
  • మీ ఆహారం ఎంత పౌష్టికమైనది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ ఆహారం ఎంత పౌష్టికమైనది?
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • డబ్బు మాత్రమే చాలదు
  • ఆరోగ్యకరమైన ఆహారం మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచగలదు
    తేజరిల్లు!—1995
  • అందరికీ సరిపడేంత ఆహారం!
    తేజరిల్లు!—1995
  • పిల్లలెదుర్కొంటున్న సంక్షోభం
    తేజరిల్లు!—1993
  • మీరు తగినంత ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
తేజరిల్లు!—1995
g95 3/8 పేజీలు 3-4

మీ ఆహారం ఎంత పౌష్టికమైనది?

బ్రెజిల్‌లోని తేజరిల్లు! ప్రతినిధి

మీరు మీ ఆహార పదార్థాలను ఎలా ఎన్నుకుంటారు? మీరు ఆహార పదార్థాలను కొనేటప్పుడు, ఏ అంశాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి? ఆకర్షణీయమైన ప్యాకింగా? ధరా? వంట చేయడానికి సులభమైనదా? ప్రకటనల్లోని ప్రోద్బలం చేసే ప్రతిపాదనలా? లేకపోతే కేవలం ఆహారం ఎలా కనిపిస్తుంది మరియు ఎలాంటి రుచి అనేదా? సరైన ఎంపిక చేయడమనేది మీరు పోషకాహారాన్ని భుజిస్తున్నారా లేక పోషక విలువలు లేని ఆహారాన్ని భుజిస్తున్నారా, మీ ఆరోగ్యం బాగుపడుతుందా, లేక పాడవుతుందా అనేవాటిని నిర్ణయించగలదు.

దారిద్ర్యం కుపోషణకు ముఖ్య కారణం. అనేకులు ఆహారాన్ని మామూలు విషయమన్నట్లు భావిస్తున్నా, లక్షలాది మంది ఇతరులు పోషకాహారాన్ని అరుదుగా భుజిస్తుంటారు. “ఇంట్లో మేము ఏది దొరికితే అది తింటాం,” అని బ్రెజిల్‌ దేశస్థుడును, తాపీ పనివాడునైన ఆరుగురు పిల్లల తండ్రి అంటున్నాడు. అంటే సాధారణంగా చప్పని రొట్టె, పలచని కాఫీ లేదా అన్నమూ చిక్కుడు కాయలు ఉంటాయి. వాస్తవానికి, ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయసంస్థ ప్రకారం, ప్రపంచ జనాబాలోని 20 శాతం మంది ఆకలితో నకనకలాడుతున్నారు. కొన్ని ఆఫ్రికా దేశాల్లో అంతటా ఆహార కొరత రాజ్యమేలుతుండగా, ఆసియాలో అంతకన్నా ఎక్కువ మంది ప్రజలు ఆకలితో ఉంటున్నారు. నివేదిక ప్రకారం, అమెరికాలో కూడా జనాబాలోని 12 శాతం లేక మూడు కోట్ల మంది ప్రజలకు తినడానికి సరిపడేంత లేదు.

కుపోషణ అనేది హానికరమే కాకుండా, ప్రాణాంతకం కూడా. “నిజంగా ఆహార కొరతవలన చనిపోయిన వారికంటే 10 రెట్ల కన్నా ఎక్కువ మంది మరణించడానికి పిల్లలకు ఆహారమిచ్చే సరైన అలవాట్లు లేనందువల్ల కలిగే కుపోషణ కారణమయ్యిందని చెప్పబడుతుంది,” అని పరిశోధకుడైన విలియమ్‌ చాండ్లర్‌ వ్రాస్తున్నాడు. “విరోచనాల వల్ల కలిగే జలశూన్యతలతో పాటు కుపోషణ అనేది ప్రపంచంలో ముఖ్య హంతకిగా ఉంది.” యూనిసెఫ్‌ (ఐక్యరాజ్య సమితి బాలల నిధి) ఈ విధంగా నివేదిస్తుంది: “అంటువ్యాధులు గాని, వరదలు గాని, ఏ భూకంపంగాని లేదా యుద్ధం గాని ఒక్క వారంలోనే 2,50,000 మంది పిల్లల ప్రాణాలను బలిగొనలేదు.” యు.ఎన్‌. ఏజెన్సీ అభిప్రాయం ప్రకారం కుపోషణ వలన మరియు దాని ఫలితంగా రోగులవడం వలన ప్రపంచవ్యాప్తంగా అంత మంది పిల్లలు చనిపోతున్నారు. నిజానికి, కుపోషణ వలన కలిగిన హాని లెక్కించశక్యం కానిది: నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుంది, సామర్థ్యం గల పనివారి సంఖ్య తగ్గుతుంది, ఉత్పాదక శక్తి మరియు నాణ్యత క్షీణించిపోతుంది.

అయితే, సరైన ఆహారాన్ని కావలసినంత తీసుకోవడం పోషకాహార కొరతను మరియు పాండురోగం మరియు ఇతర వ్యాధులు సోకడం వంటి ప్రతికూల ఫలితాలను అధిగమించగలదు. పాఠశాల మధ్యాహ్న భోజనాలు మరియు సూపునందించే ధర్మ సంస్థలు వంటి ప్రభుత్వ సహాయం కొన్ని ప్రాంతాల్లో కుపోషణను కొంతవరకు లేకుండా చేస్తుంది. కాని యూనిసెఫ్‌ అధికారుల ప్రకారం విరేచనాల వల్ల, ఊపిరితిత్తుల వాపు వల్ల, మశూచి వల్ల సంభవించే పిల్లల మరణాలను తగ్గించడానికి ప్రతి సంవత్సరం 25 అరబ్‌ డాలర్లు అవసరమౌతాయి. ‘అది చాలా డబ్బే’ అని కొందరు అనవచ్చు. కాని ఒక నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం అమెరికా దేశస్థులు క్రీడల్లో వేసుకునే బూట్లకు మరియు ఐరోపా దేశస్థులు ద్రాక్షరసానికి అంత డబ్బును ఖర్చు చేస్తారు. మరొక సవాలు నిష్ఫల వ్యయాన్ని తగ్గించడం. అంచనా ప్రకారం 3.2 కోట్ల మంది బ్రెజిల్‌ దేశస్థులు ఆకలితో ఉంటున్నప్పటికీ, బ్రెజిల్‌ వ్యవసాయ మంత్రిత్వశాఖ నివేదించేదేమంటే, “కోతపని తరువాత రవాణాలోను లేదా భద్రపరచడంలోను అయ్యే వృథా వ్యయము [1.5 అరబ్‌ డాలర్ల విలువ] దేశ వ్యవసాయ ఉత్పత్తిలోని 18 నుండి 20 శాతానికి నష్టాన్ని కలిగిస్తుంది.” అనేక దేశాల్లో వ్యవసాయంలోను, సేద్యపర్చడంలోను, ఆహార పదార్థాలను నిల్వ చేయడంలోను, రవాణా చేయడంలోను పెద్ద సమస్యలున్నాయి; అయినా, భూమి ఇప్పటికీ అందరికీ విస్తారంగా ఇవ్వగలదు. కాబట్టి మీ కుటుంబాన్ని పోషించే సవాలును మీరెలా ఎదుర్కోగలరు?

డబ్బు మాత్రమే చాలదు

వర్ధమాన దేశాల్లో ప్రజలు తరచూ రెండు మూడు ఉద్యోగాలను చేస్తూ, తమ కుటుంబాన్ని పోషించుకోగల్గుతున్నారు. బ్రెజిల్‌లో ప్రతి సంవత్సరం 15 లక్షల మంది కుటుంబాన్ని లేదా మిత్రులను వదిలిపెట్టి పనిని మరియు ఆహారాన్ని అన్వేషిస్తూ పెద్ద పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఆరోగ్యమనేది కొంతవరకు ప్రజలు ఏమి తింటున్నారనే దానిపై ఆధారపడినప్పటికీ, వాళ్ళ బడ్జెట్‌లో ఎక్కువ భాగం బట్టలకు, అద్దెకు, రవాణా ఖర్చులకు వ్యయమైపోతుంది.

సంతోషకరమైనదేమంటే, బియ్యం, చిక్కుడుకాయలు, మొక్కజొన్నలు, బంగాళా దుంపలు, కర్రపెండలం మరియు అరటి పండ్లు వంటి సాధారణ ఆహార పదార్థాలతో పాటు మాంసము మరియు చేపలు ప్రపంచ వ్యాప్తంగా కుటుంబాల్లోని పోషకవనరుల్లో ముఖ్యమైనవిగా ఉంటున్నాయి. బ్రెజిల్‌ దేశస్థుడును పోషకాహార నిపుణుడునైన జోస్‌ ఎడ్వార్డో డి ఒలీవెరా దత్ర ఏమన్నాడంటే: “చిక్కుడు కాయలు మరియు బియ్యం కలిసిన ఆహారం శ్రేష్ఠమైన పోషక విలువ గలది. అలాంటి సరళమైన తక్కువ ఖరీదు గల ఆహారంతో [దేశంలోని] ఆహార కొరతను అంతం చేయడం సాధ్యమే.” అవును, తక్కువ ఖరీదైన మరియు పోషక విలువగల ఆహారం మీరు జీవిస్తున్న చోట లభ్యం కావచ్చు. లేదా మీరు మీ ఆహార పదార్థాల్లోని కొన్నింటి మొక్కలను మీరే పెంచుకోవచ్చు కూడా.

మీ దగ్గర కావలసినంత డబ్బు ఉన్నప్పటికీ, మీరు దాన్ని మీ కుటుంబం కొరకు పోషకాహారానికై ఖర్చు చేస్తారా? లేదా మీరు నేర్పుతో కూడిన మరియు ఎడతెగని ప్రకటనల వల్ల తీపి పదార్థాలను, పోషక విలువలు లేని ఆహార పదార్థాలను ఎంచుకునేలా ప్రభావితులౌతున్నారా, అలా మాంసకృత్తుల, ఖనిజాల, మరియు విటమిన్ల అవసరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఆరోగ్యాన్ని పెంపొందించే దానికన్నా రుచి ఎక్కువగా ఆకర్షిస్తుందా? ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా చెప్పినదేమంటే: “మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోడానికి, కాపాడుకోడానికి ప్రజలకు మానవ శరీరాన్ని, దాని ధర్మాలను గూర్చిన ప్రాథమిక జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే వారు తమ ఆరోగ్యానికి ఏది సహాయపడుతుందో, ఏది సహాయపడదో, ఏది హాని కలిగిస్తుందో, ఏది హాని కలిగించదో తీర్మానించుకోగలరు. ఆరోగ్యాన్ని గూర్చి నేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరి విద్యాభ్యాసంలో ఒక భాగంగా ఉండాలి.”

నిజమే, కేవలం తినడం కోసమే మనం జీవించడం లేదు, కాని ఆహారం మన జీవితాల్లో ప్రముఖ భాగమై ఉంది. కష్టించి పని చేయడానికి బాగా తినడం అనేది ఒక మంచి ప్రతిఫలమన్నట్లు బైబిలు మాట్లాడుతుంది: “ప్రతివాడు అన్న పానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే.” (ప్రసంగి 3:13) ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారం విలువైనది మరియు అవసరమైనదని మీరు దృష్టిస్తారా? అలాగైతే, సరైన పోషకాహారం మీకు మీ కుటుంబానికి ఎలా ప్రయోజనకరంగా ఉండగలదు అనే దాన్ని గూర్చిన తరువాతి శీర్షికను దయచేసి పరిశీలించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి