కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 10/8 పేజీలు 6-8
  • బానిసలైన జూదగాళ్లు—తుదకు నష్టపోయేవారే

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బానిసలైన జూదగాళ్లు—తుదకు నష్టపోయేవారే
  • తేజరిల్లు!—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • జూదానికి క్రొత్తగా అలవాటుపడినవారు—యౌవనులు!
    తేజరిల్లు!—1995
  • జూదం క్రైస్తవులకు తగునా?
    తేజరిల్లు!—1994
  • నేను బానిసనైపోయాను! నేనెలా జూదం మానగలను?
    తేజరిల్లు!—1993
  • జూదం నిజంగా అంత చెడ్డదా?
    తేజరిల్లు!—1992
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 10/8 పేజీలు 6-8

బానిసలైన జూదగాళ్లు—తుదకు నష్టపోయేవారే

“త్రాగుబోతుతనం, మాదక ద్రవ్యాల అలవాట్లలా తప్పనిసరి జూదం కూడా జబ్బే” అని ఫ్రాన్స్‌కు చెందిన పండితుడైన జాన్‌ ఆడ్‌ తీర్మానించి చెప్పాడు. “అది మాదక ద్రవ్యాలు లేని వ్యసనం, ఎక్కువమంది ప్రజలు తాము వ్యసనపరులమని కనుగొంటున్నారు” అని అతడు చెప్పాడు. బానిసలైన జూదగాళ్లు తరచూ చాలా ఎక్కువ డబ్బు పోగొట్టుకున్న తర్వాత కూడా, ఇంకా ఎక్కువ జూదమాడి తమ నష్టాలను పూరించుకోవాల్సిన అవసరతచేత పీడింపబడుతుంటారు. “ఓడిపోయిన అనేకమంది తమ నిరాశనుండి త్వరగా కోలుకుంటారు. అయితే కొందరికి, జూదమాడాలన్న వాంఛ ఎంత ఎక్కువగా ఉంటుందంటే అది వారి జీవితాలను నాశనం చేయగలదు. తాము ఆ అలవాటును మానుకుంటామని తమకు తామే వాగ్దానం చేసుకుంటూ ఉంటారు, అయితే వారు దానికే లొంగిపోతారు. వారు జూదానికి బానిసలని” ఫ్రాన్స్‌నందలి ఒక విలేఖరి వ్రాశాడు.

ఒక దక్షిణాఫ్రికా జూదగాడు ఇలా ఒప్పుకున్నాడు: “మీరు జూదానికి బానిసైతే, రోలెట్‌ చక్రం లేక బ్లాక్‌జాక్‌ బల్ల వద్ద కూర్చుంటే, మీకు ఇంకేమి పట్టదు. అడ్రినలిన్‌ మీ నరాల్లో రయ్యిన పాకుతుంటుంది, చక్రం యొక్క మరో రౌండు కొరకు లేక మరో పేకముక్క పడడం కొరకు తమ దగ్గరున్న చివరి పైసా వరకూ పందెం కాస్తారు. . . . నాకున్న అడ్రినలిన్‌ శాతాన్నిబట్టి, పేకలను, సంఖ్యలను చూస్తు, ఎప్పుడూ చేజిక్కని ఆ మహత్తర చెల్లింపు కొరకు ఎదురుచూస్తూ నేను అనేక రాత్రింబవళ్లు ఏకంగా మేలుకొనే ఉండేవాన్ని.” తర్వాత ఆయనిలా ముగించాడు: “కొన్ని వందల లేక చివరకు కొన్ని వేల రాండ్లతోనే ఆపలేని నావంటి వాళ్లు అనేకమంది ఉన్నారు. మాకున్నవన్నీ పోయేంత వరకూ మేము జూదమాడుతాము, మరి మా కుటుంబ సంబంధాలు బాగుచేయలేనంత విపరీతంగా పాడయిపోతాయి.”

ఓడిపోయినా లేక గెలిచినా జూదమాడాలన్న కోరిక ఎంత బలీయంగా ఉంటుందంటే “అనేకమంది జూదగాళ్లు నిద్రపోకుండా, తిండి తినకుండా, చివరికి కాలకృత్యాలు కూడా తీర్చుకోకుండా దినాల తరబడి ఆడతారు. ఆటలో మునిగిపోయి ఉండటం మిగతా విషయాలన్నిటినీ పక్కన బెట్టేలా చేస్తుంది. ఆ ఎదురుచూపుల సమయంలో ఒకలాంటి ‘సరదా’ కూడా ఉంటుంది, అది సాధారణంగా అరచేతుల్లో చెమటలు, గుండె త్వరగా కొట్టుకోవడం మరి వికారం కలగడం వంటి వాటి ద్వారా సూచింపబడుతుందని” న్యూయార్క్‌ నందలి సెయింట్‌ జాన్‌ విశ్వవిద్యాలయంలో సమాజశాస్త్ర పండితుడైన హెన్రీ ఆర్‌. లషియర్‌ వ్రాశాడు.

గతంలో జూదం వ్యసనమున్న ఒక వ్యక్తి, తనకు గెలుపు కాదుగానీ దానిలోని “సరదా,” ఆడటంలోని ఆ కైపు తన సుదీర్ఘ అలవాటును పురికొల్పేదని ఒప్పుకుంటున్నాడు. “జూదమాడటం అత్యంత తీవ్రమైన భావోద్రేకాలను ఉత్పన్నం చేస్తుంది. రోలెట్‌ చక్రం తిరుగుతున్నప్పుడు, దానికి జవాబు ఇవ్వడానికి మీరు అవకాశం కొరకు వేచి ఉన్నప్పుడు, మీ తల తిరుగుతుంది మీకు మూర్ఛ వచ్చినట్లు ఉంటుంది.” ఫ్రెంచి జూదగాడు ఆండ్రా ఇలా ఒప్పుకుంటున్నాడు: “మీరు గుర్రంపై 10,000 ఫ్రెంచి ఫ్రాంక్‌లు పందెం కడితే ఆ గుర్రం ఇంకా 100 మీటర్లు పరుగెత్త వలసి ఉన్నప్పుడు, మీ భార్య లేక మీ తల్లి చనిపోయారని ఎవరైనా మీకు చెప్పినా కూడా మీరు దాన్ని వినిపించుకోరు.”

తాను ఎక్కువ డబ్బును కోల్పోయినప్పటికీ తానెలా జూదమాడటంలో కొనసాగాడో ఆండ్రా వివరిస్తున్నాడు. అతడు బ్యాంకులనుండి, స్నేహితుల దగ్గరి నుండి, అలాగే అన్యాయపు వడ్డీలతో వడ్డీ వాళ్ల దగ్గిర నుండి కూడా అప్పు తీసుకున్నాడు. అతడు చెక్కులు దొంగిలించాడు, పోస్టాఫీసు ఖాతాలను మోసంగా తీసుకున్నాడు. అతడు జూదశాలలకు వెళ్లినప్పుడు ఒంటరి స్త్రీలను మోసగించి వారి క్రెడిట్‌ కార్డులతో మాయమయ్యేవాడు. ఆండ్రా “నేను ఎప్పటికైనా ఈ వినాశకరమైన ఆర్థిక స్థితిని మెరుగు చేసుకుంటానా లేదా అని కూడా పట్టించుకోలేదు. అతని తిరుగుడు అతని వ్యసనం వల్లనే” అని ఒక ఫ్రెంచి విలేఖరి వ్రాశాడు. అతడు నేరం చేయడం కూడా ప్రారంభించి జైలుకు పంపబడ్డాడు. అతని వివాహం విచ్ఛిన్నమయ్యింది.

అనేక సందర్భాలలో బానిసలైన జూదగాళ్లు, మాదక ద్రవ్యాల వ్యసనపరులలా, త్రాగుబోతుల్లా అది వారి ఉద్యోగాన్ని, వారి వ్యాపారాన్ని, వారి ఆరోగ్యాన్ని తుదకు వారి కుటుంబాన్ని బలి గొన్నప్పటికీ ఎడతెగక జూదమాడతారు.

ఫ్రాన్స్‌లోని అనేక పట్టణాలు ఇటీవల జూదానికి తమ ద్వారాలు తెరిచాయి. ఇతర వ్యాపారాలు విఫలమౌతున్న చోట, వడ్డీ వ్యాపారుల దుకాణాలు పుష్కలమైన వ్యాపారం చేస్తున్నాయి. జూదగాళ్లు తాము కలిగున్నవన్నీ పోగొట్టుకొని ఇంటికి వెళ్లడానికి పెట్రోల్‌ కొరకు తమ ఉంగరాలు, చేతి గడియారాలు, బట్టలు ఇతర విలువైన వస్తువులు అమ్మేస్తారని దుకాణం యజమానులు చెబుతున్నారు. అమెరికాలోని కొన్ని కోస్తా పట్టణాల్లో, కొత్త వడ్డీ వ్యాపారుల దుకాణాలు తెరువబడ్డాయి; కొన్ని స్థలాల్లో మూడు లేక నాలుగు లేక ఎక్కువ దుకాణాలు ఒకే వరుసలో కనిపిస్తాయి.

కొందరు జూదమాడే తమ అలవాటును కొనసాగించడానికి నేర జీవితానికి అలవాటుపడ్డారు. పండితుడైన లషియర్‌ చెప్పేదాని ప్రకారం, ఇంత వరకూ చేసిన అధ్యయనాలు “బానిసలైన జూదగాళ్లలో అనేక రకాలైన అనైతిక ప్రవర్తనలను తెలియజేస్తున్నాయి. దొంగ సంతకాలు చేయడం, అపహరించడం, దొంగతనం, దోపిడీ, పందాలు కట్టడం, రకరకాల మోసాలు చేయడం, దొంగిలించిన వస్తువులను అమ్మడం వంటివి వాటిలో చేరివున్నాయి.” దీనికి తోడు జూదగాళ్లు తమ యజమానుల వద్దనుండి దొంగిలించే వైట్‌-సాలర్‌ నేరాలు కూడా ఉన్నాయి. బానిసలైన జూదగాళ్లకు విద్యను మరియు చికిత్సను అందించే సంస్థ నిర్దేశకుడైన గెరీ టి. ఫుల్‌కర్‌ ప్రకారం, బానిసలైన జూదగాళ్లని గుర్తింపబడిన వేలమందిలో 85 శాతంమంది తమ యజమానుల వద్దనుండి దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. “వాస్తవానికి, సంపూర్ణ ఆర్థిక దృక్కోణం నుండి చూస్తే, బానిసలై ఆడే జూదం, త్రాగుబోతుతనం మరియు మాదక ద్రవ్యాల వ్యసనం రెండు కలిసిన దానికంటే కూడా చెడ్డదని” అతడు చెప్పాడు.

జైలు పాలైన బానిసలైన జూదగాళ్లలో దాదాపు మూడింట రెండొంతులు, జైలుకు పోనివారిలో 97 శాతంమంది, అలాగే జూదం కొరకు డబ్బు సంపాదించడానికి లేక జూదానికి సంబంధించిన అప్పులను తీర్చడానికి అనైతిక ప్రవర్తనలో పాల్పంచుకున్నట్లు ఒప్పుకున్నారని అదనపు అధ్యయనాలు తెలియజేశాయి. చట్టబద్ధం చేయబడిన జూదం పెచ్చుపెరిగి పోతున్న అమెరికాలోని కోస్తా పట్టణాల్లో, 1993లో 16 బ్యాంకు దోపిడీలు జరిగాయి, అది మునుపటి సంవత్సరానికి నాలుగింతలు ఎక్కువ. ఒక వ్యక్తి తన జూదమాడే అలవాటును కొనసాగించడానికి ఎనిమిది బ్యాంకులనుండి 89,000 డాలర్ల డబ్బును దోచుకున్నాడు. అప్పులవాళ్లకు ఎక్కువ డబ్బు చెల్లించేందుకు ఒత్తిడి చేయబడిన జూదగాళ్లు తుపాకీ చూపి ఇతర బ్యాంకులను దోచుకున్నారు.

“బానిసలైన జూదగాళ్లు తమ అలవాటును మానుకోడానికి ప్రయత్నించినప్పుడు, వారు పొగ త్రాగే వారిలా లేక మాదక ద్రవ్యాల వ్యసనపరుల్లా మానుకున్నందున వచ్చే ఫలితాలను అనుభవిస్తారని” ద న్యూయార్క్‌ టైమ్స్‌ చెబుతుంది. అయితే, జూదం అలవాటును మానుకోవడం ఇతర అలవాట్లను మానుకోవడం కంటే కష్టంగా ఉండగలదని జూదగాళ్లు ఒప్పుకుంటారు. “మాలో కొందరం త్రాగుబోతుతనాన్ని మరియు మాదక ద్రవ్యాల వ్యసనాన్ని కూడా అనుభవించి ఉండవచ్చు, కాని బానిసలై ఆడే జూదం ఇతర ఎలాంటి వ్యసనాలకన్నా చాలా కష్టతరమైనదని మేమంతా ఒప్పుకుంటామని” ఒకరు చెప్పారు. ఆపాలని ప్రయత్నించిన బానిసలైన జూదగాళ్లలో కనీసం 30 శాతంమంది “చిరాకు లక్షణాలు చూపించారు లేక కడుపులో బాధలు, నిద్రలో అస్తవ్యస్తత, రక్త పోటు మరియు నాడి స్పందనలలో మామూలు కంటే ఎక్కువ ఒత్తిడిని అనుభవించారని” హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలోని వ్యసనాల అధ్యయన కేంద్రం యొక్క డా. హోవర్డ్‌ షాఫర్‌ చెప్పాడు.

వారు పందెం కాస్తూనే ఉన్నప్పటికీ, బానిసలైన “జూదగాళ్లు వైద్యపర సమస్యలు ఎదుర్కొంటారు: దీర్ఘకాల తలనొప్పులు, వికారం, ఊపిరి పీల్చుకోవడంలో కష్టం, గొంతు నొప్పులు, గుండె నొప్పులు, చేతులు కాళ్లు తిమ్మిరెక్కడం వంటివి ఉంటాయని” అమెరికా, మేరిలాండ్‌ బాల్టీమోర్‌లోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పాథలాజికల్‌ గాంబ్లింగ్‌ శాఖ డైరెక్టర్‌ డా. వలెరీ లోరెన్జ్‌ చెప్పింది.

ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. “మరణకరంకాని వ్యసనం” అని సాధారణంగా పిలువబడేది మరణానికి దారి తీస్తుంటే దానికి మించిన ఘోరం ఏమి ఉండగలదు? ఉదాహరణకు, జూదశాలలు ఇటీవలనే తెరువబడిన అమెరికాలోని ఒక ప్రాంతంలో, “ఆత్మహత్యల శాతం వివరించలేనంతగా రెండింతలైంది, అయినప్పటికీ ఆరోగ్య సంరక్షణ అధికారులు ఎవరూ కూడా ఆ పెరుగుదలను జూదంతో ముడిపెట్టడానికి సుముఖంగా లేరని” ద న్యూయార్క్‌ టైమ్స్‌ మ్యాగజైన్‌ నివేదించింది. దక్షిణాఫ్రికాలో, ఒక వారంలోనే ముగ్గురు జూదగాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. జూదం వలన మరియు దాని మూలాన వచ్చిన చట్టబద్ధమైన లేక చట్టవిరుద్ధమైన అప్పుల వలన జరిగిన ఆత్మహత్యల సంఖ్య నిజంగా ఎంతో తెలియదు.

జూదాన్ని వదిలించుకోవడానికి ఆత్మహత్య చేసుకోవడం విచారకరమైన మార్గం. తదుపరి శీర్షికలో, కొందరెలా ఒక శ్రేష్ఠమైన మార్గాన్ని కనుగొన్నారో పరిశీలించండి.

[6వ పేజీలోని చిత్రం]

వడ్డీ వ్యాపారుల దుకాణాలు, వాటితోపాటు నేరం వృద్ధి చెందుతున్నాయి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి