కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 10/8 పేజీలు 3-5
  • జూదం—90లలోని వ్యసనం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూదం—90లలోని వ్యసనం
  • తేజరిల్లు!—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • జూదానికి క్రొత్తగా అలవాటుపడినవారు—యౌవనులు!
    తేజరిల్లు!—1995
  • జూదం క్రైస్తవులకు తగునా?
    తేజరిల్లు!—1994
  • జూదమాడడాన్ని బైబిలు ఖండిస్తోందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • జూదం నిజంగా అంత చెడ్డదా?
    తేజరిల్లు!—1992
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 10/8 పేజీలు 3-5

జూదం—90లలోని వ్యసనం

రంగుల ఫిలిమ్‌రీల్‌ పెట్టబడివున్న ఒక కెమేరా దృశ్యాన్ని తీస్తుంది. ఆ చిత్రం ఒక ఆదివారం వార్తాపత్రికలో మొత్తం రెండు పేజీల్లో వేయబడుతుంది—మన కన్ను చూడగల్గినంత దూరం అంటే, వేల చదరపు మీటర్లుగల ఒక పెద్ద గోడౌను బింగో ఆటస్థలంగా మార్చబడింది, అది అన్ని వయస్కుల మరియు జాతుల జూదగాళ్లతో కోలాహలంగా ఉంది. వారి అలసిపోయిన ముఖాలను, ఎరుపెక్కిన కళ్లను గమనించండి, వారు ఎడతెరిపి లేకుండా గంటలతరబడి ఆడారనడానికి అవి సూచనలా? బహుశా విజయం సాధించలేని ఆ రాత్రంతటి తర్వాత అది తమకు విజయం తెస్తుందేమోనని వారు తర్వాతి సంఖ్య కొరకు ఆతురతతో వేచివున్నారు.

వార్తాపత్రిక పేజీలను త్రిప్పండి. చేతులనిండా పేకముక్కలతో వ్యాకులతగల ఆ ముఖాలను చూడండి, తామిప్పుడు ఓడిపోతామేమోనని వారు భయపడుతున్నారా? అనేక సందర్భాల్లో తర్వాత పేకముక్క తీసుకోగానే వేలకొలది డాలర్లను గెలుచుకోవడమో, పోగొట్టుకోవడమో జరుగుతుంది. చిత్రాల్లోవున్నదానికన్నా ఎక్కువే ఊహించుకోండి. వణుకుతో చెమటలు పట్టిన అరచేతులను మీరు చూడగల్గుతున్నారా? వేగంగా కొట్టుకుంటున్న ఆ హృదయస్పందనను, మళ్లీసారి మంచి ముక్క రావాలని ఇతర ఆటగాళ్లకు ఓటమి కలగాలని కోరుకుంటున్న ఆ మౌనప్రార్థనను వినగల్గుతున్నారా?

ఆడంబరమైన హోటళ్లలో మరియు రివర్‌బోట్‌లలోని విలాసవంతమైన జూదశాలల్లోకి అడుగుపెట్టండి. రంగురంగుల స్లాట్‌ మెషీన్‌ల వ్యూహంలో మీరు దారితప్పిపోయారా? వాటి హ్యండిల్‌లను లాగినప్పుడు వచ్చే శబ్దంతో, స్పిన్నింగ్‌ చక్రాల తిరుగుడు శబ్దంతో మీ చెవులకు చిల్లులు పడుతున్నాయా? వాళ్లు ఓడినా గెలిచినా ఆ శబ్దం ఆటగాళ్లకు సంగీతంలా ఉంది. “ఆ స్లాట్‌ మెషీన్‌ హ్యండిల్‌ను మళ్లీసారి లాగినప్పుడు ఏమి జరుగుతుందనే ఉత్సుకతే వారికున్న సరదా” అని ఒక జూదశాల యజమాని చెప్పాడు.

గుంపులు గుంపులుగావున్న ప్రజల మధ్యనుండి రోలెట్‌ టేబుల్‌వద్ద గుమికూడిన వాళ్ల దగ్గరకు వెళ్లండి. ఆ చక్రం దాని ఎరుపు, నలుపు డబ్బాలతో మీ కళ్లముందు తిరుగుతూ ఉంటే దాని కదలికను బట్టి మీరు వశీకరింపబడవచ్చు. ఎగిరి పడుతున్న బంతి చప్పుడు దాని మంత్రంలా ఉంటుంది. ఆ చక్రం తిరిగీ తిరిగీ ఎక్కడైతే ఆగుతుందో అది గెలుపూ ఓటమికి మధ్యనున్న తేడాను చూపుతుంది. ఆ చక్రం ఒక్కసారి తిరగటాన్నిబట్టి తరచూ వేలకొలది డాలర్లు ఓడిపోవడం జరుగుతుంది.

ప్రపంచవ్యాప్తంగా, ఈ చిత్రాలనూ దృశ్యాలను వేవేలతోను, ఆటగాళ్లను లెక్కలేనన్ని లక్షలతోను, స్థలాలను వేలతోను హెచ్చవేయండి. జూదంపట్ల తమకు గల తృష్ణను తీర్చుకోడానికి వారు విమానం, రైలు, బస్సు, నౌక మరియు కారులో ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వస్తారు. “తప్పనిసరి జూదం: ఒక గుప్త వ్యాధియని, 90లలోని వ్యసనమని” పిలువబడింది. జూదగాళ్ల ప్రవర్తనను అధ్యయనం చేసే ఒక జాతీయ అధికారియైన డ్యూరన్ట్‌ జేకబ్స్‌ అనే పరిశోధకుడు “ప్రపంచవ్యాప్తంగా చట్టబద్ధంగా జూదమాడటానికి 1990వ పడి చారిత్రక ఉన్నత సమయంగా సూచింపబడుతుందని నేను అంచనా వేస్తున్నాను” అని చెప్పాడు.

ఉదాహరణకు, అమెరికానందు 1993లో మేజర్‌-లీగ్‌ బేస్‌బాల్‌ ఆటలకంటే జూదశాలలకు ఎక్కువమంది అమెరికన్లు వెళ్లారు అంటే 9.2 కోట్లసార్లు వెళ్లారు. జూదమాడే కొత్త స్థలాలను నిర్మించడం ఎడతెగక జరుగుతుంది. అమెరికాలోని తూర్పు కోస్తాలో ఉన్న హోటల్‌లను నడిపే వారు తన్మయత్వం చెందుతున్నారు. “జూదశాలను ఒక దినానికి దర్శిస్తారని అంచనా వేయబడిన 50,000 మందికి వసతి కల్పించడానికి ప్రస్తుతం తగినన్ని గదులు లేవు.”

అమెరికాలోని అనేక దక్షిణ రాష్ట్రాల్లో జూదమాడటం ఒక పాపకరమైన పనిగా ఎక్కడ పరిగణించబడేదో అక్కడే నేడు అంటే 1994లో అది బాహాటంగా ఆహ్వానింపబడి, రక్షకునిగా పరిగణింపబడుతుంది. “నేడు, మిసిసిపి మరియు లూసియానా అంతటా తేలే, నేలపైనున్న జూదశాలలు ఉండటంతో మరియు ఫ్లోరిడా, టెక్సాస్‌, అలబామా మరియు అర్‌కాన్‌సాస్‌లో ఇంకా ఎక్కువ నెలకొల్పడానికిగల పథకాలను కలిగి ఉండటంతో, బైబిల్‌ బెల్ట్‌ ప్రాంతానికి బ్లాక్‌జాక్‌ బెల్ట్‌ అని పేరు మార్చవచ్చు” అని యుఎస్‌ న్యూస్‌ & వరల్డ్‌ రిపోర్ట్‌ గమనించి చెప్పింది. జూదం పాపమన్న విషయాన్ని గూర్చిన తమ ఆలోచనా విధానాన్ని కొందరు మతనాయకులు ఇప్పుడు పూర్తిగా మార్చుకుంటున్నారు. ఉదాహరణకు, లూసియానా, న్యూ ఆర్లియన్స్‌ నగర అధికారులు మిసిసిపి నదిపైనున్న తమ మొదటి తేలే జూదశాలను 1994లో ప్రారంభించినప్పుడు, ఒక మతనాయకుడు “జూదమాడగల సామర్థ్యం: పట్టణానికి నీవు అనుగ్రహించిన ఒక సుగుణము” అని దేవునికి వందనాలు చెబుతూ ప్రార్థించాడు.

2,000వ సంవత్సరానికల్లా అమెరికన్లందరిలో 95 శాతంమంది జూదశాలకు రావడానికి మూడు లేక నాలుగు గంటలు మాత్రమే కారు నడిపి రావలసి ఉంటుందని అంచనా వేయబడుతుంది. అమెరికా అనాగరిక జాతుల వారు కూడా జూదం వ్యాపారంలో అధిక భాగాన్ని కలిగివున్నారు. దేశమంతటా వారికున్న 225 జూదశాలలను మరియు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టే బింగో ఆట హాలులను నడుపుకోడానికి అమెరికా ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి అనుమతినిచ్చిందని యుఎస్‌ న్యూస్‌ & వరల్డ్‌ రిపోర్ట్‌ నివేదించింది.

పేకాట గదులు, క్రీడలపై పందెం కట్టడం, గుర్రం మరియు కుక్క పందెం, చర్చి బింగో మరి అలాంటివాటినన్నిటినీ కలపడంతో, అమెరికన్లు 1993లో 39,400 కోట్ల డాలర్లను చట్టబద్ధంగా ఎలా పందెంకాశారో స్పష్టమౌతుంది, అది గత సంవత్సరం కంటే 17.1 శాతం అధికం. జూదాన్ని వ్యతిరేకించే వారు విస్మయం చెందారు. తప్పనిసరిగా జూదమాడే విషయంపైని ఒక కౌన్సిల్‌ నందలి కార్యనిర్దేశకుడు ఇలా చెప్పాడు: “ప్రజలకు సహాయం చేయడానికి మనకుగల అతిపెద్ద సంస్థలు చర్చీలు, దేవాలయాలు మరియు ప్రభుత్వం. అయితే ఇప్పుడు అవే జూదం వ్యాపారంలో ఇమిడి ఉన్నాయి.” ఒక అమెరికా వార్తాపత్రిక అమెరికాను “జూదమాడే దేశం” అని సంబోధిస్తూ జూదమాడటం “అమెరికా యొక్క నిజమైన జాతీయ కాలక్షేపమని” చెప్పింది.

ఇంగ్లాండ్‌ తన మొదటి లాటరీని 1826లో ప్రారంభించింది, అప్పటినుండి అమ్మకాలు ఎంతో పెరిగి పోయాయని చెప్పబడుతుంది. అది ఎంతో త్వరితంగా అభివృద్ధి చెందుతోంది కూడా అని ద న్యూయార్క్‌ టైమ్స్‌ మ్యాగజైన్‌ నివేదించింది. “మాస్కో ఇప్పుడు రద్దీగా ఉండే జూదశాలలతో నిండిపోయింది. లెబనాన్‌కు చెందిన జూదగాళ్లు పశ్చిమ బీరూట్‌ జూదశాలలను దర్శించడానికి అక్షరార్థంగా తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు, ఆ శాలలు సైనికులు మరియు మత ప్రామాణ్యవాదుల దాడికి కూడా గురౌతున్నాయని” టైమ్స్‌ నివేదించింది. “ఎక్కువ డబ్బు గెలుచుకున్న వారిని, మెషీన్‌ గన్‌లు ధరించిన జూదశాల గార్డులు ఇంటికి క్షేమంగా తీసుకు వెళతారు.”

“తమది జూదగాళ్ల దేశమని కెనడా వారు గుర్తించడంలేదు. బహుశా కొన్ని విషయాల్లో కెనడా అమెరికాకంటే ఎక్కువ జూదమాడుతుందని” కెనడా సరిహద్దు జూద నియంత్రణాకర్త చెప్పాడు. “కెనడా వారు చట్టబద్ధమైన పందెములపై మరియు పందెం కాయడంపై 1,000 కోట్ల డాలర్లను వ్యయం చేశారు—అది వారు సినిమాలకు వెళ్లడానికి ఖర్చు చేసిన దానికి దాదాపు 30 రెట్లు ఎక్కువ” అని ద గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ వార్తాపత్రిక నివేదించింది. “అమెరికాలో ఇప్పుడున్న లేక ముందెప్పుడైనా ఉండిన బింగో పరిశ్రమకంటే కెనడాలోనిది అత్యంత అభివృద్ధి చెందినది. కెనడాలో లాటరీ వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. గుర్రపు పందెముల విషయంలో కూడా అది వాస్తవమే” అని వార్తాపత్రిక తెలియజేసింది.

“దక్షిణాఫ్రికాలో జూదానికి బానిసలైన వారెందరున్నారో ఎవరికీ తెలియదు, అయితే కనీసం ‘వేలమంది’ ఉండవచ్చు” అని ఒక దక్షిణాఫ్రికా వార్తాపత్రిక వ్రాసింది. అయితే, స్పెయిన్‌ ప్రభుత్వానికి మాత్రం తన సమస్య గురించి, పెరుగుతున్న జూదగాళ్ల సంఖ్య గురించి బాగా తెలుసు. స్పెయిన్‌కు ప్రపంచంలోని అత్యున్నత జూదమాడే రేటును ఒకదాన్ని ఇస్తూ, ఒక సంవత్సరంలో దాని 3.8 కోట్లమందిలో అనేకులు 2,500 కోట్ల డాలర్లను వ్యయం చేశారని అధికారిక లెక్కలు చూపుతున్నాయి. “స్పెయిన్‌వారు తదేకంగా జూదమాడేవారు. వారు ఎప్పుడూ అలా ఆడుతూనే ఉంటారు. . . . వారు గుర్రాలపై, సాకర్‌పై, లాటరీలపై పందెం కాస్తారు, రోలెట్‌పై, పేకాటపై, బింగోపై డబ్బునులాగే ఆ యంత్రాలపై పందెం కాస్తారన్నది తెలిసిన విషయమే” అని జూదగాళ్లకు సహాయం చేయాలని ఒక సంఘాన్ని స్థాపించిన వ్యక్తి చెప్పాడు. జూదానికి బానిసలవ్వడం మనస్తత్వ సంబంధ రోగమని స్పెయిన్‌లో ఇటీవలి సంవత్సరాల్లో గుర్తించబడింది.

ఇటలీ కూడా జూదం పిచ్చిచేత పీడింపబడుతుందని అందుబాటులో ఉన్న సాక్ష్యాలు సూచిస్తున్నాయి. కోట్ల రూపాయలను లాటరీలపై, క్రీడలపై పందెములపైనేకాక వార్తాపత్రికల పోటీలు మరియు ఆటల టేబుళ్లపై కూడా పిచ్చిగా ఖర్చు చేస్తున్నారు. “అనుదిన జీవితపు ప్రతి అంశంలోకి జూదం ప్రవేశించిందని” ప్రభుత్వం ఆర్థిక మద్దతు ఇచ్చిన ఒక పరిశోధనా బృందం అందించిన ఒక నివేదిక చెబుతుంది. నేడు “జూదం ఒకప్పుడు అసలు ఊహించని ఎత్తులకు చేరుకుందని మరి ప్రభుత్వాధికారుల నుండి మత గురువుల వరకు లాభం సంపాదించడానికి పోటీపడుతున్నారని” ద న్యూయార్క్‌ టైమ్స్‌ చెబుతుంది.

ఎంత నిజం! తదుపరి శీర్షిక చూపబోయేలా అనేక సందర్భాల్లో జూదం ప్రజల జీవితాలలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది.

[4వ పేజీలోని చిత్రం]

ఒకప్పుడు పాపకార్యం—ఇప్పుడు “రక్షకుడు”

[5వ పేజీలోని చిత్రం]

జూదమనే అంటువ్యాధి ప్రపంచమంతటా వ్యాపిస్తోంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి