కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 10/8 పేజీలు 8-11
  • జూదానికి క్రొత్తగా అలవాటుపడినవారు—యౌవనులు!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూదానికి క్రొత్తగా అలవాటుపడినవారు—యౌవనులు!
  • తేజరిల్లు!—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • జూదం క్రైస్తవులకు తగునా?
    తేజరిల్లు!—1994
  • జూదం నిజంగా అంత చెడ్డదా?
    తేజరిల్లు!—1992
  • బానిసలైన జూదగాళ్లు—తుదకు నష్టపోయేవారే
    తేజరిల్లు!—1995
  • జూదమాడడాన్ని బైబిలు ఖండిస్తోందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 10/8 పేజీలు 8-11

జూదానికి క్రొత్తగా అలవాటుపడినవారు—యౌవనులు!

వయోజనులు, స్త్రీపురుషులిరువురూ జూద వ్యసనమనే ఊబిలో ఎంతో లోతుకు కూరుకుపోయారన్న విషయాన్ని తెలుసుకుని మీరు అపనమ్మకంతో తల అడ్డంగా ఊపుతారా? వయోజనులైన జూదగాళ్లు తాము జీవితాంతం కష్టపడి సాధించిన పనులను, కార్యాలను అంటే ఉద్యోగాలను, వ్యాపారాలను, కుటుంబాన్ని మరియు కొందరు తమ జీవితాన్ని కూడా జూదం కొరకు వదులుకున్నారని చదవడానికి మీరు సంశయిస్తారా? జూదంలో 15 లక్షల డాలర్లను గెలుచుకున్న తర్వాత అదే రాత్రి 70 లక్షల డాలర్లను ఓడిపోయేంత వరకూ జూదమాడటంలో కొనసాగిన ఒక పరిపక్వత చెందిన, విద్యావంతుడైన వ్యక్తి యొక్క సహేతుకతను మీరు గ్రహించగలరా? అనేక సందర్భాల్లో అది పేరాశే, చేజిక్కని పైసా వెనుక పరుగెట్టడమే. అయితే అదంతా తరచూ జూదమాడటంలోని సరదా కొరకు మాత్రమే అయ్యుంటుంది.

మీరు ఒకవేళ చిన్న పిల్లలున్న తలిదండ్రులైతే, జూదమాడటం పరిపక్వత చెందిన పెద్దల ఆట అని సరిపెట్టుకోగలరా? మళ్లీ ఆలోచించండి. ఆడేందుకు సిద్ధంగా ఉన్న లేక ఇప్పటికే రంగంలోకి దిగిన యౌవన జూదగాళ్లను పరిశీలించండి. వాస్తవాలు మిమ్మల్ని ఆశ్చర్యచకితులను చేయవచ్చు.

ఇటీవలి వార్తాపత్రికల్లోను, పత్రికల్లోను ఇటువంటి శీర్షికల క్యాప్షన్‌లు కనిపించాయి: “జూదమాడటం 90లలో యౌవనుల ఆట అయ్యేలా ఉంది.” “అనేకమంది యౌవనులు జూదానికి అలవాటుపడిపోయారు.” “తొంభైలలోని ధూమపాన పొడి: పిల్లలు జూదమాడటానికి అలవాటుపడిపోయారు.” “నా కుమారుడు జూదమాడటం ఆపలేకపోతున్నాడు.”

ఇప్పుడు, ఈ క్రింది హెడ్‌లైన్‌లను చదవండి. “రాష్ట్రం మరియు చర్చి ప్రోత్సహిస్తున్న జూదం ఎక్కువ కావడం వల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని అధికారులు నిందిస్తున్నారు. ముందటికన్నా నేడు అవకాశమున్న యౌవనులకు పందెం కట్టడం ఎంతో అందుబాటులో ఉంది. బానిసలైన జూదగాళ్లలో 90 కంటే ఎక్కువ శాతంమంది ఆ అలవాటును తమకు 14 ఏండ్లకంటే తక్కువ వయస్సున్నప్పుడే ప్రారంభిస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారని” ఒక వార్తాపత్రిక వ్రాసింది. “ఒకప్పుడు 14 ఏళ్లు కూడా రాకముందే ప్రారంభించినవారు ఎక్కువగా జూదానికి బానిసలయ్యేవారు. ఇప్పుడు ఆ వయస్సు 9 లేక 10 సంవత్సరాలకు తగ్గడాన్ని మనం చూస్తున్నాము. ఎందుకని? ఎందుకంటే ఇందుకు సానుకూలత ఉంది. జూదం యొక్క వాణిజ్య ప్రకటనలతో పిల్లలు హోరెత్తి పోతున్నారు. అది సాంఘికంగా అంగీకరించబడిన కాలక్షేపమని” మరో పరిశోధకురాలు చెబుతుంది. “మరీ క్షీణించిపోతుంది. పిల్లలు మరీ చిన్న వయస్సులో దాన్ని ప్రారంభిస్తున్నారు, మునుపటికంటే ఎక్కువమంది దానిలో చిక్కుకుపోతున్నారని” గాంబ్లర్స్‌ అనానిమస్‌ అని పిలువబడే సంస్థకు చెందిన వ్యాఖ్యాత చెప్పాడు.

ఒక అమెరికా రాష్ట్రంలోని యౌవన జూదగాళ్లపై జరిపిన ఒక అధ్యయనంలో, 3.5 శాతంమంది చాలామట్టుకు బానిసలైన జూదగాళ్లే; ఇతర 9 శాతంమంది జూదమాడేందుకు దేన్నైనా వదులుకునే “హై-రిస్క్‌” జూదగాళ్లు. “సాధారణంగా, వయోజనుల జనాబాకంటే యౌవనస్థులలోనే ఎక్కువమంది జూదమాడుతున్నారని సంఖ్యలు చూపించాయని” ఒక అమెరికా కళాశాలలో సలహాలిచ్చే సేవలకు నియంత్రికుడైన విలియమ్‌ సీ. ఫిలిప్స్‌ చెప్పాడు. “మనము రాబోయే దశాబ్దంలో లేక త్వరలో మాదక ద్రవ్యాల ఉపయోగం—ప్రాముఖ్యంగా చట్టవిరుద్ధ మాదక ద్రవ్యాల ఉపయోగంవలన వచ్చే సమస్యలకన్నా యౌవనుల జూదంతోనే ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటామని” వ్యసనాల మరో సలహాదారుడు చెప్పాడు. పండితుడైన హెన్రీ లషియర్‌, ప్రాధమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులపై ఒక అధ్యయనాన్ని నిర్వహించాడు. “ఆయన కనుగొన్న విషయాలు కళాశాల విద్యార్థుల అధ్యయనానికి ఎంతో దగ్గరగా ఉన్నాయి: ‘రోగలక్షణ సంబంధ’ లేక ‘బానిసలైన’ జూదగాళ్లుగా పరిగణింపబడే యౌవనుల శాతం—అంటే తమ జూదమాడే అలవాట్లపై ఎటువంటి అదుపులేని ప్రజల శాతం—దేశమంతటా ఉన్న యౌవనుల జనాబాను చూస్తే దాదాపు 5 శాతం వరకూ ఉండవచ్చని” ద లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌ నివేదించింది.

జూదం వైద్యులు ఒప్పుకునేదేమంటే జూదమాడే యౌవనస్థుల సంఖ్య కాదుగానీ “యౌవనస్థులు జూదమాడడం గురించి పిల్లలు, తలిదండ్రులు మరియు చివరకు అధ్యాపకులు కలిగివున్న దృక్పథం ఎక్కువ చింతను కలిగిస్తుంది. . . . జూదాన్ని అనేకమంది పిల్లలు మరియు వారి తలిదండ్రులు మాదకద్రవ్యాలు, మత్తుపానీయాలు లేక దౌర్జన్యం, లైంగిక దుర్నీతి వంటివాటిలో ఇమిడి ఉండడం వల్ల కలిగే పరిణామాలకంటే తక్కువ గంభీరమైన పరిణామాలు గల ‘నిరపాయకరమైన వినోదమని’ భావిస్తున్నారు.” అయితే, జూదమాడటం యౌవనులను నేరానికి, పాఠశాలను ఎగ్గొట్టడానికి మరియు సులభంగా లభించే డబ్బుపై కోరికకు అలవాటు పడేలా చేయగలవని ప్రవర్తనా సలహాదారుడైన డ్యూరన్ట్‌ జేకబ్స్‌ హెచ్చరించాడు.

ఉదాహరణకు, చాలా చిన్న వయస్సులోనే జూదమాడటం ప్రారంభించిన ఒక ఉన్నత పాఠశాల విద్యార్థిని పరిశీలించండి. పాఠశాలలో ఉన్నప్పుడు అతడు ఇతర విద్యార్థులతో జూదమాడటంలో తన తరగతి గంటల్లో చాలా సమయాన్ని గడిపాడు. అతడు ఓడిపోయి అతడి డబ్బు అయిపోయినప్పుడు, అవసరతల్లో ఉన్న కుటుంబాల కొరకు ఆహారాన్ని కొనేందుకు విద్యార్థులు ఇచ్చిన డబ్బును దొంగిలించాడు. దొంగతనం చేసిన డబ్బుతో జూదమాడటం ద్వారా, తన మునుపటి జూదపు అప్పులను తీర్చడానికి తాను వడ్డీకి పెట్టిన తన స్వంత కుటుంబ టెలివిజన్‌ సెట్టునూ మరియు ఒక సులిమానురాయి ఉంగరాన్ని విడిపించాలని ఆశించాడు. అతడు తొమ్మిదవ తరగతికి వచ్చేసరికి, 1,500 డాలర్లు దొంగిలించినందుకు అతడు అప్పటికే బాలల నేర గృహంలో 20 దినాలు గడిపాడు, మరియు అతడు జూదం, 5 డాలర్ల బిలియర్డ్స్‌ ఆటకు సంబంధించిన అప్పులో విపరీతంగా కూరుకుపోయి ఉన్నాడు. “నేను పెద్దవాన్ని అయ్యే కొలది ఆ అప్పులు ఎక్కువయ్యాయని” అతడు చెప్పాడు. అతడు కొంతకాలానికి తన జూదం అప్పులను తీర్చడానికి తన పొరుగువారి దగ్గర దొంగతనం చేయడం ప్రారంభించాడు. అతడి తల్లి బాధల్లో ఉంది. అతడు 18 ఏళ్ల వయస్సుకల్లా జూదానికి బానిసయ్యాడు.

ఇంగ్లాండులో, సున్నితమైన జూదపు చట్టాలు పిల్లలు స్లాట్‌ యంత్రాలపై ఆడటాన్ని అనుమతిస్తున్నాయని సమాజశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. విమానాశ్రయాలు మరియు వ్యాపారస్థలాల్లో, తమ తలిదండ్రులనుండి దొంగిలించడం ద్వారా మరియు దుకాణాల్లో దొంగతనం చేయడం ద్వారా అధిక సంఖ్యలో పిల్లలు తమ వ్యసనాన్ని కొనసాగిస్తున్నారు.

“యౌవనస్థుల్లో, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల మరియు కళాశాల ప్రాంగణాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన, త్వరితంగా పెరుగుతున్న జూదపు విధానం ఏమిటంటే, తమ [విద్యార్థుల్లో] క్రీడల గురించి పందెం కాయడమే, దీనికి కొన్నిసార్లు స్థానిక పుస్తకాల విక్రయదారుల మద్దతు ఉంటుంది. బాగా సంస్థీకరింపబడిన మరియు ఎక్కువ పందెం కాసే స్థలాలు ఉండని ఉన్నత పాఠశాల మరియు కళాశాల ప్రాంగణాలు చాలాతక్కువ ఉంటాయని నేను అంచనా చేస్తున్నానని” జేకబ్స్‌ చెబుతున్నాడు. దీనికి తోడు, అనేకమంది యౌవనులు తమ వయస్సుకంటే పెద్దగా కనిపిస్తున్నందుకు పేకాటలు, లాటరీలు మరియు జూదశాలల్లోకి అనుమతించబడుతున్నారు.

“చెప్పవలసిన ఒక విషయమేమంటే, జూదాన్ని యౌవనదశలో ప్రారంభించి, వారప్పుడు విజేతలయ్యారు గనుకనే ఇప్పుడు వారిలో అనేకులు జూదానికి బానిసలయ్యారు. యౌవనస్థులో ‘అత్యధిక శాతంమంది’ జూదాన్ని ఒక తమాషాగాను ఆటగాను భావించే తమ తలిదండ్రులు లేక బంధువుల ద్వారా దానికి పరిచయం చేయబడ్డారని జేకబ్స్‌ చెప్పాడని” కూడా ద లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌ తెలియజేసింది. మాదకద్రవ్యాల దుర్వినియోగం గురించి సలహాలిచ్చే మరో వ్యక్తి ఇలా వ్యాఖ్యానించాడు: “మాదకద్రవ్యాల దుర్వినియోగం విషయంలో తలిదండ్రులు ఎలా వ్యవహరించవలసి వచ్చిందో వారు ఈ విషయంలోను అలాగే చేయవలసి వస్తుంది. నా అభిప్రాయం ప్రకారం జూదమాడడం ఎంత ఎక్కువైతే, అంతమంది బానిసలైన జూదగాళ్లు తయారౌతారు.” మాదకద్రవ్యాలు మరియు మత్తుపానీయాలవలెనే జూదమాడే తమ వ్యసనాన్ని అనేకమంది యౌవనస్థులు దొంగతనం, మత్తుపదార్థాలతో ఆటలాడడం, వ్యభిచరించడం వంటివాటి ద్వారా తమ అలవాటును కొనసాగిస్తున్నారని బానిసలైన జూదగాళ్లకు చికిత్స చేసే నిపుణులు చెబుతారు. తలిదండ్రులు జూదాన్ని “ఆనందమని, ఆటలని” భావించవచ్చు, కాని పోలీసు అధికారులు అలా భావించరు.

“స్లాట్‌ మెషీన్లకు అలవాటుపడిన పిల్లలు . . . బానిసలైన జూదగాళ్లగు పెద్దవారి హానికరమైన గుణాలన్నింటినీ ప్రదర్శించారు. ఈ స్లాట్‌ మెషీన్లకు అలవాటుపడిన యౌవనస్థులందరూ 9 లేక 10 సంవత్సరాల వయస్సులో దాన్ని మొదలుపెట్టి ఉంటారు. తమ చేతి ఖర్చుల కొరకు ఇవ్వబడిన డబ్బు, పాఠశాలలో భోజనం చేయడానికి ఇచ్చిన డబ్బు, ఇంట్లో అక్కడక్కడా ఉండే చిల్లర ఇవన్నీ వాళ్లు వాడేస్తారు. ఒకటి లేక రెండు సంవత్సరాల తర్వాత వాళ్లు వస్తువులు దొంగతనం చేయడం మొదలు పెడతారు. తమ స్వంత గదిలో నుండే అన్నీ అంటే బ్యాట్లు, పుస్తకాలు, చివరికి రికార్డు ప్లేయర్‌ వంటి పెద్ద వస్తువులు అమ్మివేయబడతాయి, ఇతర పిల్లల బొమ్మలు కూడా వాళ్లు దొంగిలిస్తారు. ఇంట్లో ఉన్నదేది క్షేమంగా ఉండదు. నిరాశ చెందిన తల్లులు తమ వస్తువులన్నీ ఒక గదిలోపెట్టి దానికి కాపలాకాయడం లేదా తాము నిద్రించేటప్పుడు తమ హ్యాండ్‌బాగ్‌లను పడక క్రింద దాచుకోవడం చేస్తున్నట్లు మూడి అనే రచయిత విన్నది. కోయిల ఎత్తుకుపోయిన తమ పక్షికూనలకు ఏమి జరుగుతుందో పక్షులు ఎలా తెలుసుకోలేవో అలాగే అలాంటి తల్లులు తమ పిల్లలకు ఏమౌతుందో అంతకంటే ఎక్కువేమీ తెలుసుకోలేరు. అయినప్పటికీ, పిల్లలు మరెక్కడి నుండో దొంగిలించగలుగుతున్నారు. పదహారు సంవత్సరాల వయస్సుకు వచ్చేసరికి, పోలీసులు వారికొరకు వెదకడం మొదలు పెడతారు.”—ఈజీ మనీ: ఇన్‌సైడ్‌ ది గాంబ్లర్స్‌ మైండ్‌, డేవిడ్‌ స్వానియర్‌ వ్రాసినది.

ఈ శీర్షికల్లో చూపించబడినట్లుగా, అనేకమంది పెద్దవారికి యౌవనస్థులకు జూదమాడడం వారి చర్చీల ద్వారా బింగో, లాటరీలు, మరితరమైనవాటి ద్వారా పరిచయం చేయబడింది. క్రీస్తు అనుచరులమని చెప్పుకునే మతసంబంధమైన సంస్థలు, వారి నాయకులు ఏవిధమైన జూదాన్నైనా ప్రోత్సహించి, వృద్ధిచేసి, పురికొల్పవచ్చా? కచ్చితంగా చేయకూడదు! ఏవిధమైన జూదమైనప్పటికీ అది మానవులలో అత్యంత హీనమైన గుణం ఏర్పడడానికి కారణమౌతుంది అదేమిటంటే ఏమి పెట్టకుండానే ఏదైనా సంపాదించుకోవాలనే కోరిక, లేదా నిష్కర్షగా చెప్పాలంటే, లోభత్వం. దాన్ని వృద్ధి చేసేవారు ఇతరుల నష్టాల నుండి లాభం పొందడం సరైనదని ప్రజలను ప్రోత్సహిస్తారు. అది కుటుంబ విచ్ఛిన్నం, అవమానం, అనారోగ్యం, ఒకరి జీవితానికి నాశనం కలుగజేసేదైతే యేసు అటువంటి చర్యను వృద్ధిచేసివుండేవాడా? ఎంతమాత్రం కాదు! బదులుగా, లోభులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని దేవుని ప్రేరేపిత వాక్యం స్పష్టం చేస్తుంది.—1 కొరింథీయులు 6:9, 10.

ఏవిధమైన జూదమైనప్పటికీ అది తప్పేనని తలిదండ్రులు పిల్లలకు చిన్న వయస్సు నుండే బోధించాలి. దాన్ని తమాషాగా, ఆటలన్నట్లుగా దృష్టించకండి కాని అది సోమరితనానికి, అబద్ధాలకు, మోసానికి, అవినీతికి ప్రారంభమన్నట్లుగా దృష్టించండి. అనేక నగరాల్లో గాంబ్లర్స్‌ అనానిమస్‌ అని పిలువబడే సహాయక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. అంతకంటే ముఖ్యంగా, మీకు సమస్య ఉంటే దేవుని వాక్యమైన బైబిలులోనున్న ప్రేరేపిత ఉపదేశాన్ని గైకొనండి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కొంతమంది అలాంటి ప్రేరేపిత ఉపదేశాన్ని గైకొన్నందుకు తమ జీవితాలను రుణపడి ఉన్నామని చెబుతారు.

ఆసక్తికరంగా, బానిసలయ్యే జూదం యొక్క ఉరిలో చిక్కుకుపోయిన అనేకమంది విడుదల పొందడానికి యెహోవాసాక్షులు సహాయం చేశారు. మునుపు జూదానికి బానిసై ఉండి, అనేక సంవత్సరాలు దుర్నీతిలో చేరి విపరీతంగా జూదమాడుతుండిన ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు, “నేను నా స్నేహితురాలు యెహోవాసాక్షులతో బైబిలు పఠించడం ప్రారంభించిన వెంటనే మా ప్రవర్తనలో సత్వరమైన, విశేషమైన మార్పులు రావడం మొదలయ్యాయి. జూదమన్నది వ్యసనంలా తయారయ్యే శక్తిగలది, దానితో వ్యవహరించడం ఎంతో కష్టమైనదని నిరూపించబడింది. యెహోవా సహాయంతో, నా స్నేహితురాలి మద్దతుతో, వాటితోపాటు పఠనం, ప్రార్థన, ప్రాముఖ్యంగా దురాశను గూర్చి దేవుని ఉద్దేశాన్ని ధ్యానించడం వీటన్నిటితో జూదమాడే ఈ వ్యసనం అదుపులోకి వచ్చింది, ఇప్పటికి 38 సంవత్సరాల నుండి నాకు భార్యగావున్న నా స్నేహితురాలు, నేను ఇద్దరం మా జీవితాలను యెహోవాకు సమర్పించుకున్నాము. అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మేము సేవచేసి, అనేక సంవత్సరాలుగా పూర్తికాల సేవచేస్తూ, వాచ్‌టవర్‌ సంస్థ ప్రయాణ ప్రతినిధిగా సేవ చేస్తున్నప్పటికీ, ఆ వ్యసనం నాలో ఇంకా ఉన్నప్పటికీ, కేవలం యెహోవా సహాయ నడిపింపులతోనే అది అదుపుచేయబడుతోంది.”

మీకు జూదమాడే సమస్య ఉంటే, మీరు ఆ వ్యసనం నుండి విడుదల పొందగలరా? దేవుని సహాయాన్ని పొందుతూ, అది కావాలన్న అవసరత గల ఇతరులకు దాన్ని అందజేయడంలో కొనసాగినట్లయితే, మీరు అలా చేయగలరు.

[9వ పేజీలోని చిత్రం]

మత్తుపదార్థాలతో కంటే యౌవనుల జూదంతో త్వరలోనే అనేక సమస్యలొస్తాయి

[11వ పేజీలోని చిత్రం]

లోభులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు

[10వ పేజీలోని బాక్సు]

లాస్‌ వేగాస్‌ కాథోలిక్‌ ఆలయం వద్ద జూదం చిప్ప్‌ అంగీకరించబడతాయి

మోస్ట్‌ హోలీ రిడీమర్‌ ఆలయానికి వచ్చే సందర్శకులు ప్రీస్టును తరచూ ఇలా అడుగుతారు: “ఫాదర్‌, నేను గెలవాలని నా కొరకు ప్రార్థన చేస్తావా?”

కోట్లాదిమంది ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ నలుమూలల నుండి అమెరికాలోని నెవాడా నందలి లాస్‌ వెగాస్‌ను సందర్శిస్తారు. జననం, ప్రభురాత్రి భోజనం, శిలువవేయబడడం వంటి విగ్రహాలు గోడల వెంబడి చెక్కబడి, వెచ్చని కాంతులతోవున్న ఈ రోమన్‌ కాథోలిక్‌ చర్చి యొక్క ఆలయంలో జూదం ద్వారా వచ్చిన డబ్బు ఉపయోగింపబడుతుంది: ఆరాధికులు చందా గిన్నెలో జూదశాల చిప్స్‌ వేస్తారు.

“అప్పుడప్పుడు చందా గిన్నెల్లో ఒకదానిలో 500 డాలర్ల చిప్‌ ఉంటుంది,” అని దైవపీఠం యొక్క ఫాదర్‌ ల్యిరీ సుతిమెత్తని స్వరంతో చెప్పాడు.

లాస్‌ వెగాస్‌ స్ట్రిప్‌కు కొంతదూరానవున్న ఒక రోమన్‌ కాథోలిక్‌ చర్చి దశాబ్దాలుగా ఆరాధికులకు ఉపయోగపడింది, కాని ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద జూదశాల హోటళ్లయిన—ది ఎమ్‌జిఎమ్‌ గ్రాండ్‌, ది లక్సర్‌, ది ఎక్స్‌కాలిబర్‌, ట్రాపికానా—స్ట్రిప్‌ యొక్క దక్షిణ చివరన నిర్మించబడినప్పుడు, అతి పరిశుద్ధ విమోచకుని క్రొత్త ఆలయం కేవలం ఒక బ్లాకు దూరంలో నిర్మించబడింది.

ఇలా ఎందుకు చేయబడిందని ప్రీస్టును అడిగినప్పుడు, ఆయనిలా చెప్పాడు: “ఎందుకు నిర్మించకూడదు? ప్రజలు ఉండేది అక్కడే.”

డబ్బు ఉండేది కూడా అక్కడే. మరెందుకు నిర్మించకూడదు?

[9వ పేజీలోని చిత్రం]

జూదం చెడు సహవాసాలకు దారితీస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి