కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 9/8 పేజీలు 21-23
  • క్రమశిక్షణ నా రక్షణగా ఉంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రమశిక్షణ నా రక్షణగా ఉంది
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సవాళ్ళనెదుర్కొనుట
  • భిన్నమైన లోకంలోని జీవితం
  • వివాహం మరియు కుటుంబం
  • ప్రశ్నలకు జవాబులు ఇప్పటికీ లభించలేదు
  • చివరికి జవాబులు ఇవ్వబడ్డాయి
  • సత్యారాధనలో ఐక్యమయ్యాము
  • మరింత సంతృప్తినిచ్చే జీవితం మా సొంతమైంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఆస్ట్రేలియాలో నేను నిజమైన సంపదను కనుగొన్నాను
    తేజరిల్లు!—1994
  • బైబిలు జీవితాలను మారుస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • “ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి”
    మన రాజ్య పరిచర్య—2002
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 9/8 పేజీలు 21-23

క్రమశిక్షణ నా రక్షణగా ఉంది

నాకు నాలుగేండ్లున్నప్పుడు, నా తలిదండ్రులు నన్ను కసరతు క్లాసులో చేర్చారు. దానికి అభ్యాసం అవసరమైంది, నేను మిగిలిన అమ్మాయిల స్థాయిలో పనిచేయవలసి ఉండేది. కొంత కాలం తరువాత, నేను నర్తకిగా శిక్షణ పొందనారంభించాను. క్రమశిక్షణ నా జీవిత భాగంగా మారింది.

నా తలిదండ్రులు నిజమైన క్రమశిక్షణగలవారు, తమ పిల్లలు కూడా సభ్యత, సత్ప్రవర్తన, గౌరవం గలవారై ఉండాలని ఆశించారు. వారికి న్యాయం లేదని ఒక్కోసారి నేను అనుకునేదానిని, కాని ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తే, నా ముగ్గురు పిల్లలను పెంచాక క్రమశిక్షణ యొక్క విలువను గ్రహిస్తున్నాను. నిజానికి, అంత శ్రద్ధ తీసుకున్నందుకు నా తలిదండ్రులకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను.

స్వయం క్రమశిక్షణ ఇచ్చుకోవడంలోను అలాగే జట్టు భాగంగా పనిచేయడంలోను నాకు చిన్నప్పుడు లభించిన తర్ఫీదు తరువాతి నా జీవితంలో ఎంతగానో తోడ్పడింది.

సవాళ్ళనెదుర్కొనుట

ఎనిమిదేండ్ల వయస్సులో నాకు వాతరోగ సంబంధమైన జ్వరం వచ్చింది, ఆ రోగం నన్ను పడకమీదే ఉండేలా చేసింది. నాకు రెండు మోకాళ్ళలోను తీవ్రమైన నొప్పి కలిగింది, నేను 12 నెలలు నడవడానికి అనుమతించబడలేదు. నన్ను ప్రేమించే నా కుటుంబం అన్నిచోట్లకు నన్ను మోసుకువెళ్ళేవారు. నేను మళ్ళీ నాట్యం చేయగలనని ఎవరూ అనుకోలేదు. అయితే, మా కుటుంబ వైద్యుడు చూపిన సామర్థ్యము సహనములతోపాటు ముఖ్యంగా, నా తలిదండ్రులు చూపించిన శ్రద్ధ వల్ల నేను పూర్తిగా కోలుకుని, మంచి నర్తకి కావాలన్న దృఢనిశ్చయంతో నాట్య శిక్షణకు తిరిగి వెళ్ళాను.

నేను నర్తకిగా వృత్తిని చేపట్టగలిగేందుకు, నేను 16 ఏండ్లప్పుడు చదువు ఆపేసేందుకు నా తలిదండ్రులు నన్ను అనుమతించారు. నేను దీనిని ఆసక్తితోను, ఉత్సాహంతోను చేశాను. చివరికి, నేను ప్రామాణిక నృత్యనాటికలో తర్ఫీదు పొందనారంభించాను. దీనికి ముందటికన్నా మరింత ఎక్కువ స్వయం క్రమశిక్షణ అవసరమైంది. నేను మూడున్నర సంవత్సరాలు పఠించాను. ప్రతివారంలో ఆరు రోజులు తర్ఫీదు పొందాను.

నాకు 19 ఏండ్లున్నప్పుడు, ఆస్ట్రేలియా నృత్యనాటికలో నృత్యపరీక్షలు జరిగాయి. పేరుగాంచిన ఈ పాఠశాలలో ప్రవేశం పొందాలనే పోటీ మహా తీవ్రమైనది. ఆస్ట్రేలియా అంతటిలో కొంతమంది మాత్రమే ఎంపిక చేయబడనున్నారు. ఎంపిక చేయబడినవారిలో నేనొకదాన్ని అన్నది సంతోషకరం. అలా నేను 18 నెలల తీవ్రమైన తర్ఫీదు పొందనారంభించాను. పాఠశాలలో నృత్యనాటిక, హాస్యనాటిక, నాటకం, కళల తరగతులు ఇమిడి ఉండేవి. నృత్యనాటిక ఎంతో చక్కని కళ, కాని దానికి అంత ప్రయత్నం అవసరం లేనట్లు కనబరచేందుకు నిజమైన శక్తి అవసరమై ఉంది. కాబట్టి మా కాళ్ళను బలపరచుకునేందుకు వ్యాయామ పాఠశాలల్లో ఏర్పాటు చేయబడిన అభ్యాసాలను మేము చేశాము.

చివరికి, జూన్‌ 1970లో ఆస్ట్రేలియా నృత్యనాటిక కంపెనీలో నృత్యపరీక్షలు జరుపబడ్డాయి. నేను మళ్ళీ ఎంపిక చేయబడి, ఒక్క వారంలోనే ఆ కంపెనీలో చేరాను.

భిన్నమైన లోకంలోని జీవితం

ఏమి జరుగుతుందన్న విషయాన్ని నేను తెలుసుకునేలోగానే, నేను జీవితంలో మొదటిసారిగా ఇంటి నుండి దూరమై, పూర్తి భిన్నమైన పరిస్థితిలోకి త్రోసివేయబడ్డాను. మా కంపెనీ ఆస్ట్రేలియా అంతా తిరిగింది, ఆ తరువాత మేము ఆసియాకు వెళ్ళాము. అది తనదైన నియమాలతోను, ప్రమాణాలతోను ఉన్న మరో లోకంలో జీవించడంలాంటిది. పాదాలకు గాయం కలిగి రక్తం కారి, పొక్కులు వచ్చేవి, దానితో పాటు ఎంతో క్లిష్టమైన పని చేయవలసిన రేయింబవగళ్ళు ఉండేవి. అయితే, కార్యక్రమాలు కష్టపడి చేసిన పనిని ప్రశస్తంగా చేశాయి. స్టేజి మీద అది ఎంతో అద్భుతంగా జరిగింది.

మేము ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన తరువాత, ఫ్లూ మహమ్మారి మాలో చాలామందిని ఇక కార్యక్రమాలను నిర్వహించడానికి అశక్తులనుగా చేస్తూ కంపెనీ అంతటా వ్యాపించింది. నేను మూడు నెలలు నాట్యం చేయలేకపోయాను. నృత్యనాటిక కంపెనీకి తిరిగి వచ్చిన తరువాత, తీరిక లేకపోవడం, అలసిపోవడం సాంఘిక జీవితాన్ని నివారించింది, ఎందుకంటే పరిపూర్ణత కొరకు ఎల్లవేళలా ప్రయత్నిస్తుండగా, నృత్యనాటికకు వెలుపలనున్న ప్రతి విధమైన కార్యక్రమాన్ని పరిమితం చేసుకుంటూ నర్తకి జీవితంలో క్లిష్టతను ఎదుర్కోనారంభించాను. నా తర్ఫీదు సంవత్సరాలన్నీ ముగిసిన తరువాత, ఇది నా వృత్తికి అంతమై ఉంటుందా?

నాకు మిశ్రమ భావనలతో పిచ్చిపట్టడం మొదలైంది. నేను మరింత అంతర్ముఖంగా మారడం మరియు నన్ను నేను ఒంటరిగా చేసుకోవడం మొదలెట్టాను. చివరికి, దాదాపు ఒక సంవత్సరం తరువాత, తీవ్రమైన దద్దుర్లతో అలెర్జీవ్యాధి వచ్చింది. దాని ఫలితంగా, నా శరీరమంతా ఉబ్బిన, దురదతో కూడిన దద్దుర్లు వచ్చేశాయి. నేను ఒక పెద్ద ఎర్రని వస్తువుగా అయ్యేంతగా దురద కలిగించే ఎర్రని దద్దుర్లు వచ్చాయి. ఈ చివరి సంఘటనతో నేను ఆస్ట్రేలియా నృత్యనాటిక కంపెనీకి రాజీనామా ఇచ్చాను. నేను కోలుకునేందుకు ఎన్నో నెలలు పట్టింది. మళ్ళీ నేను కోలుకునేంతవరకు నా తలిదండ్రులు నాకు పరిచర్యలు చేశారు.

వివాహం మరియు కుటుంబం

నేను 1974లో ఓ చక్కని యువకున్ని కలిశాను. అతడొక నటుడు, అతనికి స్వంతంగా వ్యాపారముంది. మేము పెళ్ళిచేసుకుని ఐరోపా అంతా తిరిగాము. మేము ఆస్ట్రేలియా తిరిగి వచ్చిన తరువాత, మా మొదటి కుమారుడు జస్టిన్‌ 1976లో జన్మించాడు. తరువాత, మేము పశ్చిమ ఆస్ట్రేలియా రాజధానియగు పెర్త్‌కు వెళ్ళి, ఒక హోటల్‌ కొన్నాము. దానివల్ల జీవిత విధానం ఎంతగా మారిపోయిందో!

హోటల్‌ను మా అంతట మేమే నడపాలని ప్రయత్నం చేశాము గనుక, పని చాలా ఉండేది. నేను ఉదయం నాలుగు గంటలకు లేచేదాన్ని, కొన్నిసార్లు మరుసటి ఉదయం వరకు పనైపోయేది కాదు. ఈ పని ఒత్తిడే కాక, మా హోటల్‌లో దయ్యాల శక్తివంతమైన ప్రభావం ఉండేది. ఇది నెమ్మదిగా మా జీవితాలను, ముఖ్యంగా నా ప్రియమైన భర్త జీవితాన్ని బాధించింది. అలా మూడు సంవత్సరాల తరువాత, వివాహ మరియు ఆర్థిక సమస్యల వల్ల మేము హోటల్‌ను అమ్మి, మా వివాహజీవితాన్ని రక్షించుకోవాలని తీర్మానించుకున్నాము.

మరో ఇద్దరు కూతుళ్ళు బ్యాన్‌కా మరియు విక్టోరియా జన్మించడంతో మా కుటుంబంలో ఐదుగురు సభ్యులయ్యారు. హోటల్‌ను వెంటనే అమ్మలేకపోయాము, అయితే ఈ సమయంలోనే నేను దేవుని సహాయం కొరకు అన్వేషించడం మొదలెట్టాను. నేను చిన్నప్పుడు కంఠస్థం చేసిన మా పరలోక తండ్రి అనే ప్రార్థన నాకు గుర్తుకు వచ్చింది. అది ఎడతెగక నా మదిలో మెదిలింది, నేను దానిని ఉచ్ఛరిస్తూ ఉండేదాన్ని.

చివరికి హోటల్‌ను అమ్మేశాము. అయితే, మేము పెర్త్‌ నుండి మెల్‌బోర్న్‌కు వెళ్ళే మూడు వారాల ముందు నా భర్త రక్తనాళంలోని వాపు వలన చనిపోయాడు. ఆయనకు కేవలం 32 ఏండ్లే. నా దుఃఖం అతి తీవ్రమైనది, మెల్‌బోర్న్‌లోని ఒక కాథోలిక్‌ మతగురువు నా భర్తకు దయ్యాలతో సమస్యలుండినందు వల్ల నిస్సందేహంగా నాపై కూడా వాటి చెడ్డ ప్రభావం ఉందని చెప్పడంతో అది ఇంకా పెరిగింది. కనుక, అతడు నా మీద మరియు నా పిల్లల మీద, మేము నివసిస్తున్న నా తల్లి ఇంటిలో అంతా ప్రతి గదిలోను “పవిత్ర” జలాన్ని చిలకరించాడు.

ప్రశ్నలకు జవాబులు ఇప్పటికీ లభించలేదు

అనేక సంవత్సరాలు గడిచిపోయాయి, నేను దేవుని గూర్చిన ప్రశ్నలు అడుగుతూనే వచ్చాను కాని, కాథోలిక్‌ మతం నుండి నాకు సంతృప్తికరమైన జవాబులు లభించనేలేదు. అప్పుడు నేను నా కుటుంబాన్ని మెలోబోర్న్‌ నుండి మరింత వెచ్చని వాతావరణం ఉండే క్వీన్స్‌లాండ్‌కు మార్చాలని తీర్మానించుకున్నాను. బ్రిస్‌బేన్‌లో చర్చి కార్యక్రమాల్లో మేము బాగా పాల్గొనేవాళ్ళం. పిల్లలు కాథోలిక్‌ పాఠశాలలకు వెళ్ళేవాళ్ళు, మేమందరం చర్చికి క్రమంగా వెళ్ళేవాళ్ళం, ఉపవాసముండేవాళ్ళం, జపమాల ఉపయోగించి ప్రార్థన చేసేవాళ్ళం, దేవుడు మన నుండి కోరుతున్నాడని నేననుకున్నదంతా చేసేవాళ్ళం.

నా ప్రశ్నలకు జవాబులు లభించలేదు గనుక, నా అంతట నేనే జవాబులు కనుగొనేందుకు నేనే వ్యక్తిగతంగా ప్రతిరోజు బైబిలులో కొంత భాగం చదవాలని తీర్మానించుకున్నాను. చివరికి, నేను మత్తయి 7:7 చదివి, ఆశ్చర్యపోయాను. అడుగుతూ, వెదుకుతూ ఉండండి అని అది చెప్పింది. ‘ఇది సులభమైన మార్గం’ అని నేను తలంచాను. కాబట్టి నేను సరిగ్గా అదే చేశాను. నా ప్రశ్నలకు జవాబివ్వమని నేను దేవున్ని అడుగుతూనే ఉన్నాను.

చివరికి జవాబులు ఇవ్వబడ్డాయి

త్వరలోనే సాక్షులు నా ఇంటి ద్వారము దగ్గరకు రావడం ఆకస్మికం కాదని సింహావలోకనం చేసినప్పుడు తెలుసుకోగలిగాను. వాళ్ళు చెప్పిన విషయం అద్భుతమైనదిగా అనిపించింది. నేను ఆసక్తితో విన్నప్పటికీ, నేను వెదుకుతూ వచ్చింది దీని కోసమేనని గ్రహించలేదు. కనుక, కొన్ని దర్శనాల తరువాత, నన్ను దర్శించిన స్త్రీతో, మళ్ళీ రావద్దని చెప్పాను.

నేను ఆ సమయంలో అంటే, 1987లో చాలా పనితో తలమునకలై ఉన్నాను. మా ఇల్లు నవీకరణ చివరి దశల్లో ఉంది, పనిని ముగించేందుకు ఒక మంచి పెయింటర్‌ అవసరం ఉంది. ఆ నిర్మాణకుడు పీటర్‌ అనే పేరుగల కలివిడిగా ఉండే మర్యాదగల, సహాయపడే గుణాలు గల యువకుడైన ఇంటి పెయింటర్‌ను సిఫారసు చేశాడు. పీటర్‌ తన భార్యాపిల్లల గురించి ప్రేమగా చెప్పాడు, చూడడానికి ఆరోగ్యంగాను, శుభ్రంగాను ఉన్నాడు. నేను కూడా అలా కనిపించాలని ఆశించాను గనుక, ఒక రోజు ఉదయం పీటర్‌ అడ్డుకట్టెల మీద పడిపోకుండా జాగ్రత్తగా నిలబడడానికి ప్రయత్నిస్తుండగా, “మీరు ఏ చర్చికి వెళ్తారు?” అని ఆయనను అడిగాను.

ఆయన యెహోవాసాక్షుల్లో ఒకరని తెలుసుకున్నప్పుడు, ఆయన ఉదయం పనికి వచ్చినప్పటి నుండి, మధ్యాహ్నం అలసిపోయినంత వరకు నేను ఆయనను ప్రశ్నలతో వేధించాను. ఆయన వాటన్నింటికీ జవాబులు చెప్పగలిగాడు. నేను రేయింబవళ్ళు పఠించడం ఆరంభించాను, బైబిలు సజీవంగా అనిపించడం మొదలైంది. నేను ఎంతో ఆనందంతో కుటుంబమంతటికీ గృహ బైబిలు పఠనానికి ఒప్పుకున్నాను. మేము సత్యాన్ని కనుగొన్నామని ఎరిగినందున, అది మా జీవితంలోని అతి ఉల్లాసకరమైన సమయమైంది.

మేము మా మనస్సుల నుండి అన్ని అనవసర విషయాలను తొలగించుకున్నాం, విగ్రహారాధనకు సంబంధించిన వస్తువులనన్నింటినీ పారవేశాము. మా ఇంట్లోని అనవసర వస్తువులను సంచీలలో నింపి చెత్త కుప్పల్లో పడవేశాము. ఏ మాత్రం ఆలస్యం కాకుండా, నా పిల్లలు కాథోలిక్‌ పాఠశాలలను విడిచిపెట్టాలని మర్యాదగా కోరడం జరిగింది. పిల్లలు యెహోవా గురించి సాక్ష్యమివ్వడం వారికి నచ్చలేదు.

సత్యారాధనలో ఐక్యమయ్యాము

ఇప్పుడు మేము నలుగురం బాప్తిస్మం పొందిన సాక్షులమే. జస్టిన్‌ మరియు బ్యానకా పాఠశాల చదువును ముగించారు, పూర్తికాల సేవలో పయినీర్లుగా సేవ చేస్తున్నారు. విక్టోరియాకు 16 ఏండ్లు, ఇప్పటికీ పాఠశాలలో చదువుకుంటోంది. నేను ఆరవ సంవత్సరం పయినీరుగా సేవ చేస్తున్నాను.

మేము ఆరు సంవత్సరాలు బ్రిస్బేన్‌ సంఘంలో గడిపాం, అక్కడ నేను ఇద్దరు ప్రియమైన వృద్ధ స్త్రీలకు సహాయపడ్డాను, త్వరలోనే వారు తమ జీవితాలను సమర్పించుకున్నారు. మేము 1994లో రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్నచోటకు మా నివాసాన్ని మార్చాము. ఆగ్నేయ క్వీన్స్‌లాండ్‌లోని చార్లివిల్‌ అనే పేరుగల చిన్న పట్టణంలో మేమిప్పుడు సేవిస్తున్నాము. మా పరిచర్య ప్రాంతం చాలా పెద్దది, ఆస్ట్రేలియాలోని ద్వీప రాష్ట్రమైన టాస్మేనియా ఎంత పెద్దదో అది దాదాపు అంత పెద్దది మరి!

నా బాల్యాన్ని, నా తర్ఫీదును గూర్చి మళ్ళీ ఆలోచించినప్పుడు, నేను క్రమశిక్షణ నుండి ఎంతగా ప్రయోజనం పొందానో గ్రహించగలిగాను. నేను బైబిలు సూత్రాలను అన్వయించడానికి, జీవితంలో అవసరమైన మార్పులను చేసుకోవడానికి నాకది సహాయపడింది. నిజానికి, యెహోవా చేత క్రమశిక్షణ లభించడం నాకు, నా ప్రియమైన కుటుంబానికి ఎంతో ఆనందాన్ని అలాగే అనంతమైన ఆశీర్వాదాలను గూర్చిన నిరీక్షణను ఇస్తుంది.—సామెతలు 6:23; 15:33.—సూ బర్క్‌ చెప్పినది.

[23వ పేజీలోని చిత్రం]

నా ముగ్గురు పిల్లలతో

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి