“నేనిక ఏ ప్రతులను చదివేంతవరకూ ప్రక్కన పారేయను”
ఒక మనిషి తేజరిల్లు! ప్రకాశకులకు ఈ విధంగా వివరించి వ్రాశాడు: “నేను ఇటీవలే మా మెష్లో ఏప్రిల్ 8, 1994, తేజరిల్లు! (ఆంగ్లం) ఉండడం చూశాను. ఆహా! ఏం జరిగింది? మీరు 90వ పడికి తగిన నవీనమైన విజ్ఞానదాయకమైన ప్రచురణను సృష్టించారు. నమ్మశక్యంకాని మార్పును చూశాను, మరి మొదటిసారిగా నేను శీర్షికలను నిజంగా చదివాను. (మామూలుగా అయితే, ‘ఓ వాళ్ళు మళ్ళీ వచ్చారు,’ అని అనుకుంటూ దాన్ని విసిరివేసేవాడ్ని.) ప్రతి ఒక్కరికి కావలసింది అందులో ఉంది.”
ముగింపులో ఆయన ఈ విధంగా వ్రాశాడు: “మీరు సరైన పంథాలోనే ఉన్నారు. ఈ మంచి పనిని కొనసాగించండి, నేనిక ఏ ప్రతులను చదివేంతవరకూ ప్రక్కన పారేయనని మాటిస్తున్నాను.”
మీరు తేజరిల్లు! పత్రికను మీ ఇంటికి తెప్పించుకోవాలనుకుంటే లేదా ఉచిత గృహ బైబిలు పఠనం కావాలనుకుంటే దయచేసి Praharidurg Prakashan Society, Plot A/35, Near Industrial Estate, Nangargaon, Lonavla 410 401, Mah., India, లేదా 5వ పేజీలోని తగిన చిరునామాకు వ్రాయండి.
[Picture Credit Line on page 32]
Top: Courtesy of ROE/Anglo-Australian Observatory, photograph by David Malin