“మెదడుపై విద్యుత్ ఆక్రమణ”
దూరదర్శిని వినోదం కలిగించేదిగాను, సమాచారాన్నందించేదిగాను ఉండవచ్చు. అయితే, అమితంగా దూరదర్శినిని చూడడం మీ ఆరోగ్యానికి హానికరం కాగలదని టెల్‌అవీవ్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్ మోషే ఆరాన్‌సన్ హెచ్చరిస్తున్నారు. ఎలా?
దూరదర్శినిని నిశ్చేష్టితంగా చూసేవారు దాని ముందు కూర్చున్నప్పుడు మారని మానసిక ఉద్రేకాన్ని అనుభవిస్తున్నారని ఆరోన్‌సన్ వాదిస్తున్నాడు. ఇది ఒత్తిడి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది, అవి ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు జ్ఞాపకశక్తికి అత్యవసరమైన— మెదడులోని చేపవంటి భాగంలోని నరాల కణాలను పాడు చేస్తాయి. మరిన్ని పఠనాలు అవసరమని గ్రహించిన ఆరోన్‌సన్ ఈ పతనం మానసిక అస్థిరతకు దారి తీయవచ్చని, బహుశ ఆల్‌జెయిమెర్స్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండవచ్చని కూడా అనుమానిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితిలోను దూరదర్శినిని ఎక్కువగా చూడడం అంటే “మెదడుపై విద్యుత్ ఆక్రమణ చేయడం” అని న్యూ సైంటిస్ట్ పత్రిక చెబుతుంది.
దూరదర్శినిని చూసే బదులు పుస్తకాలను చదివితే, అది కల్పనా శక్తిని వృద్ధిచేసి, ఆలోచనా సామర్థ్యాలను కలిగిస్తుంది, అది నిశ్చేష్టితమైన పని కాదు! ప్రతిదృశ్యము మరియు శబ్దం దూరదర్శినిని చూసేవారి కొరకు కల్పించబడుతుంది గాని, చదువరి తను స్వంతంగా దృశ్యాలను, శబ్దాలను ఊహించుకుంటాడు. మానసిక బలాన్ని ఈ విధంగా సృజనాత్మకంగా ఉపయోగించడం మానసిక మాంద్యాన్ని అరికడుతుంది, అలా అది ఒకరి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీని దృష్ట్యా, మీరు దూరదర్శిని ముందు కూర్చునే సమయాన్ని తగ్గించుకోవడం జ్ఞానయుక్తం కాదా?