కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 8/8 పేజీలు 14-16
  • మనం నిజంగా దేవుని స్నేహితులం కాగలమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనం నిజంగా దేవుని స్నేహితులం కాగలమా?
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు దేవుని స్నేహితులు ఎందుకు కాగలరు
  • మీరు గంభీరమైన పాపంలోపడిపోతే ఎలా?
  • దేవుని స్నేహితులుగా కొనసాగండి
  • ఆయన యెహోవా హృదయాన్ని మెత్తబర్చాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • తప్పును సరిదిద్దుకోవడానికి ధైర్యం చూపించాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • యెహోవా క్షమాగుణం వల్ల మనకు లభించే ప్రయోజనం ఏమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • మీరు యెహోవాకు స్నేహితులు అవ్వవచ్చు
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 8/8 పేజీలు 14-16

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

మనం నిజంగా దేవుని స్నేహితులం కాగలమా?

దేవుని స్నేహితులమవ్వడమా? అది అసాధ్యమని 20 ఏళ్ల డారిస్‌ నమ్ముతుంది. “నన్ను ఎవరైనా ఇష్టపడటానికి నేను అల్పురాలినని, అనర్హురాలినని నేను భావిస్తాను. నేను యెహోవా దేవునికి ప్రార్థన చేయడం కూడా మానుకుంటున్నాను, ఎందుకంటే నేనాయన సాన్నిధ్యంలో ఉండేందుకు కూడా తగనని నేను అనుకుంటున్నానని” ఈ యౌవనురాలు విలపిస్తోంది. తమ అంతరంగంలో, కొందరు యౌవనులు దేవుని స్నేహాన్ని పొందడానికి పూర్తిగా అనర్హులమని భావిస్తారు. దేవుని స్నేహితులవ్వాలన్న తలంపును వారు ఇష్టపడినప్పటికీ, తాము దాన్ని పొందలేమని వారు భావిస్తారు. మీరెప్పుడైనా అలా భావించారా?

కొన్నిసార్లు, అతని స్వంత బలహీనతలు ఒక యౌవనుడు కనీసం దేవున్ని సమీపించడానికి కూడా తాను అనర్హున్నని భావించేలా చేస్తాయి. ఉదాహరణకు యౌవనస్థుడైన మైకెల్‌ను పరిగణించండి. దైవిక మార్గాలను గుణగ్రహించక ముందు, తాను “దాదాపు సర్వ విధాలైన పాపభరితమైన, హానికరమైన తలంపులు మరియు క్రియలతో నిండుకొని ఉన్నానని” అతను చెబుతున్నాడు. అయితే, తన బైబిలు పఠనం ద్వారా తాను నేర్చుకున్న విషయాలు, తాను దేవునికి ఎంత దుఃఖాన్ని, నిరాశను కలిగిస్తున్నాడో గ్రహించేందుకు సహాయం చేశాయి. అతనిలా వివరిస్తున్నాడు: “ప్రతి సంఘ కూటం నా తప్పిదాల్లో కనీసం ఒకటి నాకు కనిపించేలా చేసింది. . . . నన్ను నేనే క్షమించుకోలేక పోతున్నప్పుడు అంతం లేనివిగా కనిపించే నా పాపాలను యెహోవా క్షమించడాన్ని నేను ఊహించుకోలేక పోయాను.”

ఇతర సందర్భాల్లో, యౌవనులతో ఇతరులు ప్రవర్తించే పద్ధతి తాను యెహోవాతో స్నేహాన్ని పొందేందుకు అనర్హున్నని భావించేలా చేయగలదు. ఉదాహరణకు, ముందు చెప్పబడిన డారిస్‌ పసిపాపగా ఉన్నప్పుడు ఆమె తల్లి ఆమెను వదిలేసింది. “నన్ను ఎవరైనా ప్రేమిస్తారని నేననుకోను. నా స్వంత తల్లి, కుటుంబం నన్ను వదిలేసినప్పుడు, నాపట్ల ఎవరికైనా శ్రద్ధ ఉంటుందని నేనెలా నమ్మగలను?” అని ఆమె చెబుతుంది. ఒక యౌవనుడు బాల్యంనుండి అవమానింపబడుతూ, దురాచారానికి గురై ఉంటే, దేవుడు తనను స్నేహితునిగా ఎన్నడూ ఇష్టపడడని అతను యథార్థంగా నమ్మవచ్చు.

మరో వైపు, ఒక యౌవన వ్యక్తి దేవునితో స్నేహాన్ని కలిగి ఉండి ఉండవచ్చు, అయితే బలహీనత వలన గంభీరమైన పాపంలోకి పడిపోవచ్చు. ట్రేసీకి ఇదే జరిగింది. “నేనెంతో అవమానకరంగా భావిస్తున్నాను, నా బాధ, వేదన ఎంతో ఎక్కువగా ఉన్నాయి. నా తండ్రియైన యెహోవాను నేనెంతగానో గాయపర్చానని” 21 సంవత్సరాల ఆ అమ్మాయి విలపిస్తోంది.

ముందు చెప్పబడినటువంటి పరిస్థితిలో మీరుండవచ్చు. కానీ నిరీక్షణకు కారణముంది: మీరు దేవున్ని మీ స్నేహితునిగా పొందవచ్చు!

మీరు దేవుని స్నేహితులు ఎందుకు కాగలరు

పాపభరితమైన క్రియలు దేవుని స్నేహితులుగా ఉండకుండా మనల్ని అడ్డగించగలవన్నది వాస్తవం. సంతోషకరంగా, మన ప్రేమగల తండ్రి మనకు సహాయం చేయడానికి చొరవ తీసుకున్నాడు. “దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమైయుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (రోమీయులు 5:8) తన మరణం ద్వారా, గుణగ్రహించే వారిని పాపం యొక్క పూర్తి అధికారం నుండి విడిపించడానికి యేసు విమోచనా క్రయధనాన్ని చెల్లించాడు. (మత్తయి 20:28) అందుకని, అపొస్తలుడు ఇంకా ఇలా చెబుతున్నాడు: “మనం దేవుని శత్రువులమైయుంటిమి, అయితే తన కుమారుని మరణం ద్వారా ఆయన మనల్ని తన స్నేహితులను చేసుకున్నాడు.”—రోమీయులు 5:10, టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌.

యెహోవా ప్రమాణాలను గుణగ్రహించకముందు, ముందు చెప్పబడిన మైకెల్‌ వలె కొందరు యౌవనులు, ఘోర పాపాల్లో పాల్గొని ఉంటారు. అయిననూ, యేసు విమోచనా క్రయధనం ద్వారా, ఒకరి పూర్వపు పాపాలు ఎంత గంభీరమైనవి అయినప్పటికీ, అవి క్షమించబడగలవు. బైబిలు, హృదయాన్ని ఉప్పొంగజేసే ఈ అభయాన్నిస్తుంది: “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.” (1 యోహాను 1:9) అయినప్పటికీ, అలా పవిత్రపర్చడాన్ని తను గుణగ్రహిస్తున్నానని దేవునికి చూపేందుకు ఒక వ్యక్తి చర్యలు గైకొనాలి. అన్వయించుకోగల ఒక సూత్రాన్ని అపొస్తలుడైన పౌలు చెప్పాడు: “అపవిత్రమైనదానిని ముట్టకుడి, . . . నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును” అని యెహోవా చెబుతున్నాడు. (2 కొరింథీయులు 6:16-18) అలాంటి తప్పిదాలు చేయకుండా ఒకవేళ ఒక వ్యక్తి మారి యథార్థంగా పశ్చాత్తాపపడితే, దేవుడు అతన్ని తన స్నేహితునిగా తన దయాప్రాప్తునిగా చేసుకుంటాడని తెలుసుకోవడం ఎంత స్పందింపజేసేదిగా ఉంటుందోకదా.

దురాచార పర్యావరణంలో పెంచబడిన యౌవనుల సంగతేమిటి? తమ ఇష్టానికి విరుద్ధంగా తమపట్ల జరిగిన కొన్ని సంగతులను బట్టి ప్రజలను అపరాధులని దేవుడు పరిగణించడని గ్రహించండి. అలాంటి వారు పాపంలో పాలివారు కాదుగానీ దానికి బాధితులు మాత్రమే. వ్యక్తిగా మీ యోగ్యత మరో మానవుని తీర్పుపై ఆధారపడి లేదని కూడా జ్ఞాపకముంచుకోండి. మీ పరిస్థితులెలా ఉన్నా యెహోవా మీ స్నేహితుడు కాగలడు. త్రాగుబోతైన తన తండ్రి వలన ఇంట్లో దౌర్జన్యమున్నప్పటికీ, మౌరీన్‌ క్రైస్తవ తల్లి చేత పెంచబడింది. అయిననూ ఆమె ఇలా చెబుతుంది: “అంత గొడవలు ఉన్నప్పటికీ, ఎలాగో నేను యెహోవాతో సంబంధాన్ని వృద్ధి చేసుకోగల్గాను. నన్ను ఎన్నడూ ఎడబాయని వానిగా నేను ఆయన్ను గుర్తెరిగాను.”

మీరు గంభీరమైన పాపంలోపడిపోతే ఎలా?

దైవభక్తిగల తలిదండ్రుల చేత పెంచబడిన డాగ్‌ 18 ఏళ్ల ప్రాయంలో లైంగిక అవినీతిలో ఇమిడిపోయాడు. అది అతని చెడు సహవాసాల వలన జరిగింది. “అది తప్పని నాకు తెలుసు, కానీ నేను సరదాగా గడపాలని అది చేస్తూ పోయానని,” డాగ్‌ ఒప్పుకుంటున్నాడు. కొంత కాలం తర్వాత, తన మార్గం ఎంత అవివేకమైనదో డాగ్‌ తెలుసుకున్నాడు. అతనిలా చెబుతున్నాడు: “నేను స్నేహితులని చెప్పుకున్న వారంతా నా డబ్బు కొరకు లేక సరదాగా గడపడానికి నన్ను ఉపయోగించుకున్నారు.” యెహోవా స్నేహాన్ని మళ్లీ పొందడానికి అతను చర్యలు గైకొనడం ప్రారంభించాడు. అయితే ఒక పెద్ద అడ్డంకు అతని అభివృద్ధిని అడ్డగించింది.

“వెనక్కి రావడాన్ని చాలా కష్టతరం చేసిన ముఖ్య విషయం, నేనెంతో అనర్హున్నని భావించడమే. నేను చేసిందంతా యెహోవా దృష్టిలో చెడ్డదని నేను భావించాను. ఆయనెంత మంచివాడు, నన్నెంతగా సహించాడు అనేది తెలుసుకున్నాక, నేనెంత చెడ్డ వాన్నంటే ఆయన నన్ను క్షమించే మార్గమే లేదని నేను భావించానని” డాగ్‌ ఒప్పుకుంటున్నాడు. అయినప్పటికీ, ఒక సంఘ పెద్ద సహాయం మరియు మనష్షే యొక్క బైబిలు వృత్తాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా డాగ్‌ ఈ అడ్డంకును అధిగమించగల్గాడు.

మనష్షే ఎవరు? ప్రాచీన యూదాలో ఒక రాజు. దైవభక్తిగల తన తండ్రియైన హిజ్కియా ద్వారా, యెహోవాను ప్రేమించాలని అతనికి బోధింపబడిందని బైబిలు సూచిస్తుంది. అయితే తన తండ్రి చనిపోయి, 12 ఏళ్ల వయస్సులో తను రాజైన తర్వాత, ఇప్పుడు తనకేది ఇష్టమైతే అది చేయగలనని అతను భావించాడు. అతను యెహోవాను ఎడబాసి బయలును ఆరాధించాడు. అలాంటి ఆరాధనలో నీచమైన అనీతి మరియు అదుపులేని లైంగిక ఆచారాలు ఇమిడి ఉంటాయి. మనష్షే “యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడచుచు ఆయనకు కోపము పుట్టించెను.” నమ్మకమైన ప్రతినిధుల ద్వారా, “యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి.” తర్వాత, యెహోవా తీర్పుల వ్యక్తీకరణగా, మనష్షే బబులోనుకు బంధీగా కొనిపోబడ్డాడు.—2 దినవృత్తాంతములు 31:20, 21; 33:1-6, 10, 11.

మనష్షే తన పూర్వపు క్రియలను గురించి ఆలోచించి, యెహోవా నియమాలను గురించి తనకు జ్ఞాపకమున్న వాటిని వీటితో పోల్చిచూస్తే, అతను అపరాధ భావంతో కృంగిపోయాడు, మరి క్షమాపణ కొరకు వేడుకున్నాడు. దేవుని ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు మరి “ఆయనకు మొర”పెట్టుకున్నాడు. దేవుడు “అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చెను.” అవును, “కనికరము చూపు తండ్రి” ఈ పశ్చాత్తాపం చెందిన పాపి మళ్లీ తన వద్దకు రాడానికి అనుమతించాడు. అలాంటి కనికరాన్ని పొందిన తర్వాత, వ్యక్తిగత అనుభవంతో “యెహోవా [సత్య] దేవుడైయున్నాడని మనష్షే తెలిసికొనెను.”—2 దినవృత్తాంతములు 33:12, 13; 2 కొరింథీయులు 1:3.

యెహోవా మనష్షేను మళ్లీ వెనక్కి తీసుకోగల్గినప్పుడు, దారి తప్పిన యౌవనులు పశ్చాత్తాప దృక్పథాన్ని చూపిస్తే, ఆ యౌవనులు తనతో మళ్లీ సంబంధాన్ని పొందడానికి ఆయన తప్పక అనుమతిస్తాడు. తన సంఘంలోని ఆత్మీయ కాపరుల సహాయానికి డాగ్‌ ప్రతిస్పందించాడు. దేవుడు “ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు” అని స్పష్టంగా తెలుసుకోడానికి అతనికి సహాయం చేయబడింది.—కీర్తన 103:9.

దేవుని స్నేహితులుగా కొనసాగండి

దేవుడు ఒకసారి మీ స్నేహితుడైతే, ఆ సంబంధాన్ని ఎప్పటికీ కలిగుండేందుకు మీరు దాన్ని గుణగ్రహించాలి. బాప్తిస్మం తీసుకున్న 18 సంవత్సరాల అమ్మాయి పెళ్లికాకుండానే తల్లి అయ్యింది. అయినప్పటికీ, ఆమె విషయాలను యెహోవాతో సరిచేసుకోడానికి సహాయం లభించింది. (యెషయా 1:18 చూడండి.) ఆమె కోలుకోడానికి ముఖ్యంగా సహాయపడినది ఏమిటి? “యెహోవా ప్రేమగల తండ్రి కానీ తీర్పరి కాదని నేను తెలుసుకున్నాను. నేను చేసిన దాన్నిబట్టి ఆయన నొచ్చుకున్నాడని నేను గ్రహించాను. యెహోవాను ఒక స్నేహితునిగా పరిగణించడం చాలా ప్రాముఖ్యం, ఎప్పటికీ సత్యంగా ప్రేమించబడని, కేవలం విధేయతను చూపవలసిన ఒక ఆత్మలా కాక, భావోద్రేకాలుగల వ్యక్తిగా చూడాలని” ఆమె వివరించింది. మనష్షే వలె, ఆమె యెహోవా ఆరాధనలో పూర్తిగా ఇమిడిపోడానికి పురికొల్పబడింది. (2 దినవృత్తాంతములు 33:14-16) అది ఆమెకు ఒక రక్షణగా పని చేసింది. ఆమె ఇతర యౌవనులకు ఇలా సలహా ఇస్తుంది: “పరిస్థితులు చెడ్డగా మారినా యెహోవాను స్తుతించడానికి కృషిచేస్తూ ఉండండి. యెహోవా ప్రేమపూర్వకంగా మీ మార్గాన్ని మళ్లీ సుగమం చేస్తాడు.”

దేవుని స్నేహితులైన వారి స్నేహాన్ని మీరు వెదకడం కూడా ప్రాముఖ్యం. అయితే, దైవిక సూత్రాలపట్ల స్పష్టంగా శ్రద్ధలేని వారిని పూర్తిగా దూరపర్చండి. (సామెతలు 13:20) యౌవనురాలైన లిండా ఒక యౌవనుడితో లైంగిక దుర్నీతిలో పాల్పంచుకుంది, మరి అతని స్నేహం “అన్ని విషయాల కంటే ఎక్కువ ప్రాముఖ్యం అయ్యింది.” తాను ఆత్మీయంగా కోలుకున్న తర్వాత, లిండా ఇలా ఒప్పుకుంటుంది: “యెహోవా మరియు మీ మధ్య ఉండాల్సిన ఆ ప్రత్యేక బంధం లేకపోవడంతో మీ జీవితాన్నంతటినీ మీరు నాశనం చేసుకోగలరు.”

మీకు అలాంటి బంధం ఉందా? ఒకవేళ లేకపోతే దాన్ని పొందడానికి కృషి చేయండి. ఇలా చెప్పడం ద్వారా, దేవుని స్నేహాన్ని కలిగి ఉండటం యొక్క విలువను గురించి లిండా టూకీగా చెప్పింది: “ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైన విషయం యెహోవాతో మంచి వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండటం. ఏ అబ్బాయి ఏ అమ్మాయి లేక ప్రపంచంలో మరేది దానికంటే గొప్పది కాదు. యెహోవాతో స్నేహం లేకపోతే, ఇక ఏదీ ప్రాముఖ్యం కాదు.”

[16వ పేజీలోని చిత్రం]

దేవుని స్నేహితులుగా ఉండేందుకు కొందరు యౌవనులు తాము అనర్హులమని భావించవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి