ఉపాధ్యాయుడు దానిని చదివి ఆనందించాడు
“గత సంవత్సరం నా పదవ గ్రేడు ఆంగ్ల తరగతిలో, మేము ప్రపంచంలోని మతాల మధ్యగల పెద్ద తేడాను గూర్చి కొన్ని రోజులు పఠించాము,” అని అమెరికాలోని మిచిగన్ నుండి ఒక యౌవనస్థుడు వ్రాస్తున్నాడు. ఆ అబ్బాయి దేవుని కొరకైన మానవుని అన్వేషణ అనే ఆంగ్ల పుస్తకాన్ని పాఠశాలకు తీసుకువెళ్ళాడు. అతడు ఈ విధంగా వివరించాడు:
“ముఖ్యంగా మా ఉపాధ్యాయునికి అది ఆసక్తికరంగా ఉంటుందని నేను అనుకున్నాను. విద్యార్థులు పాఠశాల పనిని చేసుకుంటుండగా, మా ఉపాధ్యాయుడు ఆ పుస్తకాన్ని చదువుతుండడం చూసినప్పుడు నాకు సంతోషం అనిపించింది. అయితే, ఆ పీరియడ్ ముగియక ముందే, విద్యార్థులు చేస్తున్న దానిని ఆపివేసి, ఉపాధ్యాయుడు మొదటి అధ్యాయాన్నంతా మాకు బిగ్గరగా చదివి వినిపించినప్పుడు నేనెంతగా ఆశ్చర్యపోయానో మీరు ఊహించగలరు. ఆయన మాచేత కొంత నోట్స్ వ్రాయించాడు కూడా.
“కొన్ని రోజుల తరువాత, మరొక నివేదికను తయారు చేసేపనిని ఇస్తూ, దానికి ఆధారంగా దేవుని కొరకైన మానవుని అన్వేషణ అనే పుస్తకాన్ని ఉపయోగించవచ్చని చెబుతూ, తరగతిలో బోధించడానికి ఆ పుస్తకాన్ని మరోసారి ఉపయోగించాడు. ఆ పీరియడంతా ఆ పుస్తకం ఉపయోగించబడింది.”
మీరు దేవుని కొరకైన మానవుని అన్వేషణ అనే పుస్తకాన్ని కావాలని, లేక ఉచిత గృహ బైబిలు పఠనం కావాలని ఇష్టపడుతున్నట్లయితే, దయచేసి Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India అనే చిరునామాకు, లేదా 5వ పేజీలో ఇవ్వబడిన సరైన చిరునామాకు వ్రాయండి.