కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 7/8 పేజీలు 16-17
  • మీరు తిలసిన్‌ను చూశారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు తిలసిన్‌ను చూశారా?
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎంత విస్తృతంగా ఉంది?
  • విశిష్ఠమైన వేట పద్ధతులు
  • కనిపించాయన్న నివేదికల విషయమేమిటి?
  • టాస్మేనియా చిన్న ద్వీపము, అపూర్వ గాథ
    తేజరిల్లు!—1997
  • పులి! పులి!
    తేజరిల్లు!—1996
  • నిజమైన భద్రత—ఒక కష్టసాధ్యమైన లక్ష్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1997
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 7/8 పేజీలు 16-17

మీరు తిలసిన్‌ను చూశారా?

ఆస్ట్రేలియాలోని తేజరిల్లు! విలేఖరి

‘నేను చూశానా ఏంటీ?’ అని మీరడగవచ్చు. ‘తిలసిన్‌ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు.’

నిజానికి “తిలసిన్‌” అనేది తిలసినస్‌ సైనోసిఫలస్‌ అనే శాస్త్రీయ నామము యొక్క సంక్షిప్త రూపం, అది ఆస్ట్రేలియాలోని టాస్మానియా పులి లేదా టాస్మానియా తోడేలు అనే పేరుగల గమ్మత్తయిన మృగము.

తిలసినస్‌ సైనోసెఫలస్‌ అంటే అక్షరాల “తోడేలుకున్నటువంటి తలను కలిగి, సంచిగల కుక్క” అని భావం, కాని ఆస్ట్రేలియాలోని చిన్న దీవియైన టాస్మానియాలోని ఐరోపా తొలి నివాసులు ఆ మృగానికి మరింత సులభమైన అనేక పేర్లను పెట్టారు. సాధారణంగా, జిబ్రా ఒపొసమ్‌, గురుపోతు, జిబ్రా తోడేలు, కుక్కతల గల ఒపొసమ్‌ వంటి పేర్లతో అది పిలువబడుతోంది. టాస్మానియాలో 200 సంవత్సరాల క్రితం, శ్వేతజాతీయులు రాకముందటి ఆదిమ నివాసులు తిలసిన్‌ను కొరిన్నా అని పిలిచేవారు.

టాస్మానియా పులి ఇప్పుడు అంతరించిపోయినట్లుగా లెక్కించబడుతుంది, కాని దానిని పోలినవి జంతు ప్రదర్శనశాలల్లో కనిపిస్తాయి. టాస్మానియా రాజధానియైన, హాబర్ట్‌లోని జంతుశాలలో 1936లో చివరిదని అనుకొనబడిన తిలసిన్‌ చనిపోయింది. ఇప్పటికీ బ్రతికి ఉన్న తిలసిన్‌లు టాస్మానియా వనాల్లో దాక్కున్నాయని వాదించేవారున్నారు, తిలసిన్‌ కనిపించిందనే నివేదికలు వస్తూనే ఉన్నాయి.

కాబట్టి నిజంగా ఈ మృగం పులి జాతికి చెందినది కాకపోయినప్పటికీ, నిస్సందేహంగా అది టాస్మానియా పులి అనే పిలువబడుతుంది, ఎందుకంటే దీని చర్మం చారలుగలది, అలాగే ఇది మాంసాహారి కూడా. విభిన్నమైన, ముదురు గోధుమ వర్ణంలో, దాదాపు నల్లని చారలు దాని వీపు నుండి దాని పొడవైన గట్టి తోక వరకూ ఉంటాయి. మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే, తిలసిన్‌ కోష్ఠంగల సస్థన జీవి, అంటే ఆడదానికి పొట్టలో సంచి ఉంటుందన్నమాట. పిల్లలు చిన్నగా, పూర్తి ఎదుగుదల లేకుండా, కంటి చూపులేకుండా పుడుతాయి, కాని అవి తమ తల్లి కడుపులోని సంచీలోకి వెళ్ళగలుగుతాయి, అవి పూర్తిగా పెరిగే వరకు, బయటికి రాగలిగే శక్తి లభించేవరకు అక్కడే పాలు తాగుతాయి. క్రొత్తగా పుట్టిన కూన బయటికి వెళ్ళే తెగువ చూపక ముందు, దాదాపు మూడు నెలలు తల్లి సంచిలో ఉంటుంది. ఒకసారి బయటికి వస్తే, అది పెద్ద తిలసిన్‌ కాకముందే ఆహారాన్ని వెదకడానికి తల్లి వెంబడి వెళ్తుంది.

ఇటీవలి కాలంలో ఎక్కువ మాంసం తినే కోష్ఠంగల సస్థనజీవి తిలసిన్‌ అని చెప్పబడుతోంది. కంగారువంటి కోష్ఠంగల సస్థన జీవులవలె కాక, ఆడ తిలసిన్‌ వెనుక భాగంలో సంచీ ఉంటుంది. అది ఒకేసారి నాలుగు పిల్లలను మోసుకు వెళ్ళగలదు, పాలివ్వగలదు.

ఎంత విస్తృతంగా ఉంది?

ఆదిమ శిల్ప ఖండాలు, శిలాజాలు, చనిపోయిన మరియు భద్రపరచబడిన తిలసిన్‌ అస్థిపంజరాలు ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాల్లో కనుగొనబడినప్పటికీ, తిలసిన్‌ల ముఖ్య నివాస స్థలం టాస్మానియానే అన్నట్లు కనిపిస్తుంది. అక్కడ కూడా ఎక్కువగా ఉండి ఉండకపోవచ్చు. అవి అంతరించిపోవడానికి ముఖ్యంగా మానవులే బాధ్యులు. టాస్మానియా పులులే, పర భక్షులు, అయినప్పటికీ, కుయుక్తిగల, పేరాశగలవారిగా నిరూపించబడిన స్థిరనివాసమేర్పరచుకున్న శ్వేత జాతీయుల బారినుండి అవి తప్పించుకోలేక పోయాయి. జిజ్ఞాసను, మానవుడంటే భయమేలేని తిలసిన్‌ తుపాకీకి మరియు వలకు సులభంగా ఎర అయ్యేది.

టాస్మానియా పులి గొర్రెలను తినేదని చాలామంది రైతులు వాదించేవారు కాబట్టి, గొర్రెల పరిశ్రమలు మరియు టాస్మానియా ప్రభుత్వం వాటిని చంపేవారికి గొప్ప బహుమతులను వాగ్దానం చేసేవి. విదేశీయ జంతు ప్రదర్శనశాలలు వలలో చిక్కుకుని బ్రతికివున్న మృగాలను వెంటనే పొందేవి. సంవత్సరాల క్రితం, టాస్మానియాలోని వన్యప్రాణులను నిర్మూలించిన ఏదో తెలియని పెద్ద వ్యాధి తిలసిన్‌ సంఖ్యను తగ్గించినప్పటికీ, వాటిలో చాలా మట్టుకు మానవుని చేతనే హతమార్చబడ్డాయి.

విశిష్ఠమైన వేట పద్ధతులు

తిలసిన్‌లు సాధారణంగా ఒంటరిగా వేటాడేవి, అయితే కొన్నిసార్లు జంటలుగా వేటాడేవి. చిన్న కంగారు వంటి జంతువును గురి పెట్టుకుని, జాగ్రత్తగా దాన్ని వెంటాడి, పట్టుకోవడం దాని పద్ధతి. ఒక్కసారి ఎర క్రింద పడి, నిస్సత్తువైనప్పుడు, తిలసిన్‌ దానిపై పడి తన బలమైన దవడలతో దాన్ని చంపివేసేది. దవడల మధ్య ఆశ్చర్యం కలిగించేలా 120 డిగ్రీల నిడివి ఉండడమే ఈ అసాధారణ జంతువు యొక్క అసమానమైన లక్షణం!

మృత కళేబరాల్లోని కొన్ని భాగాలను—సాధారణంగా అంతర్‌ అవయవాలను మాత్రమే తినే వాటి అలవాటును బట్టి కొందరు వాటిని క్రూరమైన హంతకీలని పిలిచారు. అయితే మిగిలిపోయిన వాటిని తీసివేసేందుకు, కోష్ఠముగల మరో చిన్న సస్థనజీవియైన, శుభ్రం చేసే (ఇప్పటికీ ఉనికిలో ఉన్న) టాస్మానియా డెవిల్‌ ఈ పులి వెంట వెళ్ళి మిగిలిన ఎముకలను, బొచ్చును, అన్నింటిని తినివేస్తుంది.

తిలసిన్‌ మానవునికి హానికారి కాదన్నది స్పష్టం. అవి మానవులను వేటాడినట్లు ఏ రుజువూ లేదు. చాలా కాలం క్రితం, ఒకరోజు సాయంకాలం చీకటిపడుతుండగా, తాను చలిమంట ముందు కూర్చుని చదువుకుంటుండగా, ఒక టాస్మానియా పులి వంగి వంగి నడుస్తూ, అంగలు వేస్తూ, భయంకరంగా తనను సమీపించడాన్ని మంటల్లోగుండా తాను అకస్మాత్తుగా చూశాడని ఒక వృద్ధుడు గుర్తుచేసుకుంటున్నాడు. అది తనపై దాడిచేస్తుందేమోనని భయపడి, ఆయన నెమ్మదిగా తన తుపాకీని తీసుకుని, జాగ్రత్తగా గురిపెట్టి, కాల్చాడు. తిలసిన్‌ భయంతో వెనుకకు గంతులువేసింది, అయితే, అది దుముకి చీకటిలో కనుమరుగైంది గనుక, దానికి దెబ్బలు అంతగా తగలలేదు అన్నది స్పష్టం. తాను ఆ పులిని ఎంత గాయపర్చాడో తెలుసుకొనేందుకు, రక్తమేమైనా కనిపిస్తుందేమోనని చూడడానికి ఆ మనిషి వెళ్ళినప్పుడు, ఆ మంట దగ్గరే తన బుల్లెట్‌తో పడివున్న ఓ పెద్ద ఒపొసమ్‌ను అతడు కనుగొన్నాడు. అది వంగి వంగి నడుస్తూ వచ్చిన తిలసిన్‌ అన్నమాట!

కనిపించాయన్న నివేదికల విషయమేమిటి?

గత 1936లో బంధించబడిన చివరి తిలసిన్‌ చనిపోయినప్పటినుండి వాటిని చూసినట్లు ఎన్నో నివేదికలు అందాయి, కాని ఇంతవరకు అవి ఏవైనా ప్రాణాలతో ఉన్నాయని నమ్మేందుకు జంతుశాస్త్రజ్ఞులకు ఏ ఆధారమూ లభించలేదు. కనీసం నిజమైన ఫోటోగ్రాఫ్‌ లేదా సజీవంగా పట్టబడినవి మాత్రమే తిలసిన్‌ ఇప్పటికీ బ్రతికి ఉన్నాయని అధికారులను నమ్మింపజేస్తాయి.

టాస్మానియా గ్రామ ప్రాంతాల్లో నివసించే అనేక మంది వృద్ధులు తాము ఒకవేళ టాస్మానియా పులిని చూసినప్పటికీ, దానిని గూర్చి తెలియజేయమని అంటున్నారు. తమ జీవిత తొలి కాలంలో ఈ అసమానమైన ప్రాణి అంతరించిపోవడానికి మానవులే బాధ్యులనే వాస్తవం వారిని కలతపరుస్తుంది. ఇంకా ఏవైనా తిలసిన్‌లు బ్రతికి ఉన్నట్లయితే, వాటిని శాంతితో జీవించనివ్వాలని అలాంటి ప్రజలు ఆశిస్తారు.

“మీరీ మధ్య తిలసిన్‌ను చూశారా?” అని వారినడిగితే, “చూడలేదు!” అనే వారు జవాబిస్తారు. ఆ జవాబు నిజం కావచ్చు, కాకపోవచ్చు.

[Picture Credit Line on page 16]

Tom McHugh/Photo Researchers

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి