కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 4/8 పేజీ 29
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎయిడ్స్‌ రక్తం మూలంగానా?
  • ఢిల్లీలో కనిపించని వ్యక్తులు
  • టి.వి. హింస లెక్కించబడింది
  • భూవ్యాప్త కుపోషణ
  • క్యూబాలో యెహోవాసాక్షులు
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1997
  • నత్తి నుండి విముక్తి!
    తేజరిల్లు!—1998
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1993
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1994
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 4/8 పేజీ 29

ప్రపంచ పరిశీలన

ఎయిడ్స్‌ రక్తం మూలంగానా?

రక్తాన్ని ఎక్కించుకోవడం వలన లేక రక్త ఉత్పన్నాల వల్ల ఎయిడ్స్‌ వచ్చే అవకాశాలేమిటి? జోహన్నస్‌బర్గ్‌లోని ది స్టార్‌ ప్రకారం, ఎయిడ్స్‌ వ్యాధి గుర్తించబడినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా 6,00,000 మందికి అంటే వ్యాధి సోకిన 15 శాతం మందిలో అందరికీ, రక్తం లేదా రక్త ఉత్పన్నాల వల్ల ఎయిడ్స్‌ వైరస్‌ సోకింది. ప్రస్తుతం, హెచ్‌.ఐ.వి. కొరకు రక్తాన్ని పరీక్షించాలంటే సమయం పడుతుంది, ఖరీదైనది కూడాను. రక్తాన్ని కనీసం ఏడు సార్లయినా పరీక్ష చేయాలనే నిర్ధారణకు కొందరు వచ్చారు. ఈ పరీక్షలను ఉపయోగించడానికి తరచూ అభివృద్ధి చెందుతున్న దేశాలకు డబ్బు లేదు. సంపన్న దేశాల్లో పరీక్షలు జరుగుతున్నప్పటికీ, అక్కడ కూడా పొరపాట్లు జరుగుతున్నాయి. డచ్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూషన్‌ సర్వీస్‌ వైద్య అధ్యక్షుడైన పౌల్‌ సెంజర్స్‌ ఈ విధంగా ఒప్పుకుంటున్నారు: “ఏ రక్తపు ఉత్పన్నాన్నైనా హెచ్‌.ఐ.వి. వైరస్‌ లేదా హెపటైటిస్‌ లేనిదని, వంద శాతం సురక్షితమైందని చెప్పలేము.” (g95 3/22)

ఢిల్లీలో కనిపించని వ్యక్తులు

ప్రతి సంవత్సరం, ఇండియా రాజధానియగు ఢిల్లీలో, 10,000 కంటే ఎక్కువ మంది ప్రజలు కనిపించకుండా పోయినట్లు నివేదించబడింది. వీరిలో కేవలం మూడవ వంతు మంది ఆచూకీ మాత్రమే దొరికింది. యాభై శాతం మంది 18 ఏండ్లకు తక్కువ ప్రాయము కలవారు, మగవారి సంఖ్య ఆడవారికన్నా ఒకటి లేక రెండు రెట్లు ఎక్కువ. తమంతట తామే పారిపోయినవారి ఆచూకీ తెలుసుకోవడం చాలా కష్టమని ఢిల్లీ పోలీసు కమీషనర్‌ ఎమ్‌. బి. కౌశల్‌ ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా అనే పత్రికలో చెప్పాడు. అయితే, వారు తమంతట తామే కనిపించకుండా వెళ్ళారా లేదా అని గంభీరంగా ప్రశ్నించబడింది. వేలకొలది అమ్మాయిలు వేశ్యాగృహాలకు చేరుకుంటున్నారు. అబ్బాయిలు భిక్షమెత్తుకోవడానికి లేదా చిన్న రెస్టారెంట్లలో తక్కువ వేతనానికి పనిచేయడానికి నేరస్థుల గుంపులచే బలవంతం చేయబడుతున్నారు. ఢిల్లీలో 1991లో 12,540 మంది 1992లో 11,936 మంది కనిపించకుండా పోయినట్లు నివేదించబడింది. కనిపించకుండా పోయారని 1993లో నివేదించబడిన 10,348లో 7,538 మంది ఆచూకీని ఇంకా కనుక్కోవలసి ఉందని పత్రిక చెబుతుంది. కనిపించకుండా పోయినవారి ఆచూకీని తెలుసుకోవడానికి సాధారణంగా గట్టి ప్రయత్నాలేమీ జరగలేదని ఒక సీనియర్‌ పోలీసు చెప్పారు. (g95 4/8)

టి.వి. హింస లెక్కించబడింది

వివాదాస్పదమైన కొత్త అధ్యయనం తెల్పేదేమంటే, అమెరికా టి.వి.లోని హింస మీద ద్వేషం ఎంత ఉన్నా, దానిని మానివేస్తామని టి.వి. నెట్‌వర్క్‌లు వాగ్దానం చేసినా, టి.వి.లో హింస అనేది గత రెండు సంవత్సరాల్లో నిజంగా అధికమౌతుంది. సెంటర్‌ ఫర్‌ మీడియా అండ్‌ పబ్లిక్‌ అఫయర్స్‌ దాన్నిగూర్చి పఠనం మరియు పరిశోధనలను జరిపింది. అది ఒకేరోజు పది స్టేషన్లలో ప్రసారం చేయబడిన కార్యక్రమాలను గమనించి, రెండు సంవత్సరాల క్రితం నాటి అదే తేదీని పోల్చి చూడడం ద్వారా ఈ నిర్ధారణకు వచ్చింది. శారీరక హానికలిగించడానికి, ఆస్తులను నాశనం చేయడానికి ఉపయోగించే బలప్రయోగపు క్రియలు అని వర్ణించబడిన ఈ హింసాత్మక క్రియలు రెండు సంవత్సరాల కాల వ్యవధిలోనే 41 శాతానికి పెరిగాయి. తీవ్రమైన హింసాత్మక క్రియలు ప్రాణాలను భయపెట్టేవిగాను, లేదా పెద్ద గాయాన్ని కలిగించేవిగాను వర్ణించబడ్డాయి మరియు ఈ సంఖ్య 67 శాతానికి పెరిగింది. “హింసాత్మక సంఘటనల ఈ సగటు రేటు ప్రతి గంటకు ప్రతి చానల్‌లోను కనిపించే దృశ్యాలు దాదాపు 10 నుండి 15 వరకు పెరిగాయి,” అని టి.వి. గైడ్‌ అనే పత్రిక నివేదిస్తుంది. (g95 3/22)

భూవ్యాప్త కుపోషణ

భూవ్యాప్తంగా, కుపోషణను గూర్చిన శుభవార్త మరియు దుర్వార్త ఉన్నాయి. గ్లోబల్‌ చైల్డ్‌ హెల్త్‌ న్యూస్‌ అండ్‌ రివ్యూ ప్రకారం 1975లో కుపోషణ వలన బాధపడుతున్న ఐదేండ్ల లోపు పిల్లల సంఖ్య 42 శాతం నుండి 1990లో 34 శాతానికి తగ్గింది. అయితే, కుపోషణకు గురైన పిల్లల సంఖ్య నిజంగా పెరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని దాదాపు 19.3 కోట్లమంది ఐదేండ్లలోపు పిల్లల బరువు కొంత లేక తీవ్రంగా తక్కువగా ఉంది. మరి వారిలో దాదాపు మూడో వంతు మంది తీవ్రంగా కుపోషణకు గురవుతున్నారు. ఆ వార్తాపత్రిక చెప్పినదేమంటే, బిడ్డ కొంత కుపోషణకు గురైతే, వ్యాధి వలన మరణించే సాధ్యత రెండింతలవుతుంది. మరింత కుపోషణకు గురయ్యే పిల్లల్లో ఈ అపాయమనేది మూడు రెట్లు. అమిత కుపోషణకు గురయ్యే పిల్లల్లో రోగం వల్ల కలిగే మరణం 11 రెట్లు ఎక్కువగా ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణమైన కుపోషణ ఏమంటే క్రొవ్వెక్కిపోవడమే. ఉదాహరణకు ఉత్తరమెరికాలో పిల్లలు దాదాపు తమ 50 శాతం శక్తిని క్రొవ్వునుండి పొందుతారు, అది “సిఫారసు చేయబడిన దానికన్నా రెండు రెట్లు అధికము.” (g95 3/22)

క్యూబాలో యెహోవాసాక్షులు

క్యూబాలోని యెహోవాసాక్షులు తమ పరిచర్యను నిర్వహించుటకు మరింత స్వేచ్ఛను అనుభవిస్తున్నారు, అది దేవుని రాజ్యసువార్తను ప్రజలతో పంచుకోవడాన్ని సాధ్యం చేసింది. ఆ పని అధికారికంగా గుర్తించబడకపోయినప్పటికీ, చట్టబద్ధం చేయకపోయినప్పటికీ, వారు తమ ముందటి కార్యాలయాలను ఉపయోగించుకోవడానికి అనుమతించబడ్డారు, చిన్న సమావేశాలను జరుపుకునేంత స్థాయిలో, ఆరాధనకు వారు మరింత స్వేచ్ఛగా కూడుకుంటున్నారు. వారు పత్రికలను ముద్రించుకోవడానికి అధికారం ఇవ్వబడింది. ఇటీవల ఈ సంఘటనలను బట్టి సంతోషంతోను ఉత్సాహంతోను నింపబడినవారై, సాక్షులు నిరీక్షణకొరకైన బైబిలు సందేశాన్ని తెలపడానికి ప్రయత్నం చేస్తూ తమ ప్రకటనా పనిని కొనసాగిస్తున్నారు. (g95 4/8)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి