ఆమె జీవితాన్ని మార్చివేసిన ఒక రోజు
అమెరికాలోని అరిజోనానందలి ఒక యువతి చెప్పినదేమంటే ఆమె చర్చికి వెళ్ళేదే గాని, ఆమెకు మతమంటే నిరాశ కలిగింది. ఆమె చివరికి ప్రార్థనలో దేవునితో ఈ విధంగా చెప్పింది: “నేను ఇక ఏ చర్చీలకు వెళ్ళను. నాకు తెలిసినంతవరకు శ్రేష్ఠమైన జీవితాన్ని గడుపుతాను, మరి నేను మంచి వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తాను.”
తర్వాత జరిగిన దాని గూర్చి ఆ స్త్రీ ఇలా చెబుతుంది: “మా పిన్ని ఫోను చేసి, యెహోవాసాక్షుల ప్రత్యేక సమావేశ దినమున తాను మా ప్రాంతంలో ఉంటుందని చెప్పింది. పిన్ని, పిన్ని పిల్లలు ఆ రాత్రి నా అపార్ట్మెంట్లో ఉండవచ్చా అని అడిగింది. ‘మాతో పాటు నువ్వు రావడానికి ఇష్టపడతావా?’ అని అడిగింది. ‘ఎందుకు రాకూడదు? అంతకన్నా మంచిది చేయడానికి నాకు ఏమీ లేదు,’ అని నేను జవాబిచ్చినట్లు నాకు జ్ఞాపకం ఉంది. మతం విషయంలో నా ఆసక్తి దాదాపు మృతమై ఉండేది.
“యెహోవాసాక్షులను గూర్చి జాగ్రత్తపడాలి అని నాకెల్లప్పుడూ చెప్పబడేది. కాబట్టి సమావేశ సమయంలో, నేను చాలా శ్రద్ధతో కూర్చున్నానని నాకు జ్ఞాపకముంది. అయితే, పరదైసు భూమి ఉండాలనే దేవుని మొదటి సంకల్పాన్ని గూర్చి మరియు దేవుడు తన సంకల్పాన్ని మార్చుకోలేదనే దానిని గూర్చి చెప్పబడిన దానిలో ఏ మర్మమూ లేదు. కుటుంబాలు కలిసి కూర్చుని, అలాంటి సంఘీభావాన్ని ప్రదర్శించడాన్ని పరికిస్తూ, నేను ఆనందకరమైన అనుభూతితో కూర్చున్నాను. నేను నా తల వంచుకుని మౌనంగా దేవున్ని ఇలా అడిగాను: ‘సత్యం ఇదేనా? దీని కోసమేనా నేను వెదుకుతూ వచ్చింది?’
“ఆ రోజు సాయంకాలం, ప్రజలు కౌగిలించుకుంటూ, ముద్దుపెట్టుకుంటూ, చిరునవ్వుతో గుడ్‌బై చెప్పుకోవడం నేను గమనించాను. తమ విశ్వాసాన్ని గూర్చి గాని, యెహోవా ఎవరు అనే విషయం గాని, ఆయన తమ కొరకు ఏమి చేశాడు అనే దాని గూర్చి గాని వారి మనస్సులోను, హృదయంలోను ఏ సందేహమున్నట్లు వారి ముఖంలో కనిపించడం లేదని నేను చూడగలిగాను. ఆ రోజు నుండి నేను యెహోవాసాక్షుల రాజ్యమందిరాలకు క్రమంగా హాజరు కావడం ఆరంభించాను, ఇంతవరకూ ఆపనూ లేదు. తరువాతి ప్రత్యేక సమావేశ దినమున 1988లో నేను నీటి బాప్తిస్మం ద్వారా యెహోవాకు నా సమర్పణను బహిరంగంగా తెలియజేశాను. మరి నేను ఈ చక్కని కుటుంబంలో సభ్యురాలినయ్యాను.”
మీరు యెహోవాసాక్షుల నమ్మకాలను మరియు ప్రవర్తనలను గూర్చి ఎక్కువగా తెలుసుకోవాలని ఇష్టపడుతున్నట్లయితే, దయచేసి వారి స్థానిక రాజ్యమందిరంలో వారిని సంప్రదించండి, లేదా 5వ పుటలో ఇవ్వబడిన విలాసాల్లో మీకు అతి సమీపంగా ఉన్నదానికి వ్రాయండి.
[32వ పేజీలోని చిత్రం]
ఇక్కడ రష్యాలో చూసినట్లుగా యెహోవాసాక్షుల పెద్ద సమావేశాల్లో కుటుంబ అనురాగం వెల్లివిరుస్తుంది