కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 4/8 పేజీ 31
  • “చీమల యొద్దకు వెళ్లుము”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “చీమల యొద్దకు వెళ్లుము”
  • తేజరిల్లు!—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక దండు దూసుకు వస్తోంది!
    తేజరిల్లు!—2003
  • చీమలు ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా ఎలా ప్రయాణిస్తాయి?
    సృష్టిలో అద్భుతాలు
  • నైపుణ్యంగల చిన్న గృహనిర్వాహకులు
    తేజరిల్లు!—1994
  • యెహోవాకు ఘనత తెచ్చే నిర్మాణ పని
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 4/8 పేజీ 31

“చీమల యొద్దకు వెళ్లుము”

“అసాధారణ చీమలు”—అనే అసామాన్యమైన వార్తాశీర్షిక త్వరగా నిర్మించబడిన యెహోవాసాక్షుల ఒక రాజ్యమందిరాన్ని గూర్చి సంవత్సరాల క్రితం ఒక వార్తాపత్రిక శీర్షికలో వచ్చింది. ఆ వార్తాశీర్షికను ఏది పురికొలిపింది? మీరు అలాంటి నిర్మాణ స్థలం యొక్క ఊహా చిత్రాన్ని చూసినప్పుడు దానిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉండదు. అదే వార్తాపత్రికలోని ఉపశీర్షిక ఈ విధంగా వివరించింది: “నిర్మాణ స్థలంలో ఐదువందల మంది యెహోవా సాక్షులు—అతివాస్తవమైన చీమలపుట్ట.”

పోలిక సరియైనదే, బహుశ, ఆ విలేఖరి గ్రహించినదానికన్నా ఎక్కువే. నిజంగా, కొన్ని వందల మంది ప్రజలు నిర్మాణ స్థలమందు అటు ఇటు వెళ్ళడాన్ని ఎంతో పై నుండి చూస్తే నిజంగా చీమలపుట్టల్లోని చీమలను పోలి ఉంటుంది. అయితే ఇక్కడ పోలిక అనేది పైపైన కనిపించేది మాత్రమే కాదు. ఎందుకిలా? సామెతలు 6:6నందలి బైబిలు ఉపదేశాన్ని యెహోవాసాక్షులు గంభీరంగా తీసుకుంటారు, అది ఈ విధంగా చెబుతుంది: “చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.” చీమలను గమనించడం వలన ఏ విధంగా ఒకరు జ్ఞాని కాగలరు?

ఒక విషయమేమంటే, చీమలు ఎంతో సాధిస్తాయి. బైబిలు విజ్ఞాన సర్వస్వమగు లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) అనే పుస్తకం ఈ విధంగా చెబుతుంది: “భవిష్యత్తుకొరకు సిద్ధం చేయాలన్న వాటి సహజస్వభావమే కాక, తరచూ తమ కన్నా రెండు రెట్ల బరువున్న వస్తువులను మోసుకువెళ్తూ, ఈడ్చుకువెళ్తూ, తమ పనిని పూర్తిచేయడానికి సాధ్యమైనదంతా చేస్తూ, నిటారుగానున్న కొండ పార్శ్వం నుండి తాము క్రిందపడినా, జారిపోయినా, దొర్లిపోయినా వెనుకంజవేయడానికి నిరాకరించే వాటి పట్టుదల మరియు దృఢ నిశ్చయము కూడా గమనార్హమే.”a

అలాగే, యెహోవాసాక్షులు తమ శరీరం కన్నా రెండు రెట్లు బరువు గల నిర్మాణ వస్తువులను ఈడ్వకపోయినా, ఎంతో తక్కువ సమయంలో తమ నిర్మాణ పథకాలను పూర్తి చేయడం ద్వారా తరచూ తమ పొరుగువారిని ఆశ్చర్యపరుస్తారు. కేవలం రెండు లేదా మూడు రోజుల వ్యవధిలోనే యెహోవాసాక్షుల రాజ్యమందిరాల పునాది వేయబడడం మరియు నిర్మాణ పని పూర్తి కావడాన్ని చూడడం అసాధారణమేమీ కాదు!

వీరు దీన్నంతా ఎలా సాధిస్తున్నారు? చీమను మరొక కీలకమైన విధంగా అనుకరించడం ద్వారా. లేఖనాలపై అంతర్దృష్టి అనే పుస్తకం చీమల గురించి ఈ విధంగా చెబుతుంది: “అసామాన్యమైన సహకారంతో ఉంటాయి, తమ పుట్టను ఎంతో శుభ్రంగా ఉంచుకుంటాయి, గాయపడిన లేదా అలిసిపోయిన చీమలను పుట్టకు తిరిగి చేర్చుతూ, తమ తోటిపని వారి ఎడల శ్రద్ధను కనబరుస్తాయి.” పైన పేర్కొన్న విలేఖరి సాక్షుల మధ్యలోను అలాంటి సహకార స్ఫూర్తిని చూసి ముగ్ధుడై, ఈ విధంగా వర్ణించాడు “ప్రశాంత వాతావరణంలో నిర్మాణంలోని ఒక్కో పనికి ప్రాతినిధ్యం వహించే దాదాపు 80 మంది నిపుణుల చేత మరియు మద్దతునిచ్చిన 400 మంది స్వచ్ఛంద సేవకుల చేత చిరునవ్వుతోనే పెద్ద పని పూర్తి చేయబడింది.”

అయినప్పటికీ, రాజ్యమందిర నిర్మాణంలో యెహోవాసాక్షులు చేసిన కష్టం, చూపిన సహకారం, దాని తర్వాతి సంవత్సరాల్లో రాజ్య మందిరం లోపల జరుగబోవు వాటికి ఒక సూచన మాత్రమే. తమ బోధనా మరియు ప్రకటనా పనుల్లోను సంస్థీకరించుకుంటూ, పురికొల్పే విద్యావంతులను చేసే కూటాలను జరుపుకుంటూ, వారు అక్కడ కష్టపడి పనిచేయడంలోను మరియు ఒకరికొకరు సహకరించడంలోనూ కొనసాగుతారు. మరింత ప్రాముఖ్యంగా, యేసు భూమి మీద ఉన్నప్పుడు తన అనుచరుల ఎడల చూపించినటువంటి శ్రద్ధను ఒకరియెడల ఒకరు చూపించడానికి పాటుపడతారు.—యోహాను 13:34, 35.

మీరెప్పుడైనా యెహోవాసాక్షుల రాజ్యమందిరాలను చూసి, లోపల ఏమి జరుగుతుందా అని ఆశ్చర్యపడి ఉంటే, మీరు వచ్చి అందులో జరిగేవాటిని మీరే చూడాలని మిమ్మల్ని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరు స్వాగతించబడతారని, అది మీకు విజ్ఞానప్రదమైన దర్శనము కాగలదని మేము గట్టి హామీ ఇవ్వగలము.

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినది. ఇన్‌కార్పోరేటేడ్‌

[31వ పేజీలోని చిత్రం]

ఫ్రాన్సులోని, ఆరిలాక్‌లో త్వరగా నిర్మించబడిన రాజ్య మందిరం

[Picture Credit Line on page 31]

Line drawings: Pharaoh’s ant. Lydekker

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి