పాఠశాల ప్రాజెక్టులకు విలువైన సహాయం
“నేను చదివిన పత్రికలన్నింటిలోకెల్లా కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలు కచ్చితంగా ఎంతో ఉపదేశాత్మకమైనవి, చదవడానికి గ్రహించడానికి అతి సులభమైనవి, చాలా సమయానుకూలమైనవి మరియు చాలా ప్రోత్సాహకరమైనవి,” అని ఒక యౌవన పాఠకురాలు వ్రాసింది. “నా పాఠశాల ప్రాజెక్టుల్లో చాలా వాటికొరకు సమాచారం ఈ పత్రికలనుండే లభించింది. నేను పాఠశాలలో ఏదైనా ఒక అంశాన్ని పఠిస్తున్నప్పుడు, నన్ను ప్రోత్సహించేందుకు మరియు ఆ అంశాన్ని, దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోటానికి నాకు సహాయం చేసేందుకు, అదే విషయంపై ఒక శీర్షిక వస్తుంది.
“ఉదాహరణకు, మేము పాల్గొనవలసిన విజ్ఞానశాస్త్ర ప్రదర్శనను గూర్చిన విజ్ఞానశాస్త్ర ప్రాజెక్ట్ కొరకు అంశము నాకు అవసరమైందని,” ఆమె వివరించింది. “ఆ ప్రాజెక్ట్‌కు మూడు పోస్టర్లు, ఒక నివేదిక మరియు ఒక నమూనా అవసరమయ్యాయి. కాబట్టి సెప్టెంబరు 8, 1989 తేజరిల్లు! (ఆంగ్లం)నందు చర్చించబడిన హరిత గృహ ప్రభావం అనే అంశాన్ని వివరించాలని నిర్ణయించుకున్నాను. ఆ శీర్షికలలో వచ్చిన దృష్టాంతాలను నా పోస్టర్లకు ఆధారంగా తీసుకున్నాను, నా నివేదిక కొరకు అందులోని సమాచారాన్ని ఉపయోగించుకున్నాను. మా జీవశాస్త్ర అధ్యాపకుడు నాకు ఎ గ్రేడునిచ్చాడు, ఆవరణశాస్త్రం మరియు దాని పరిరక్షణయనే విభాగమందు నేను ప్రథమ అవార్డును పొందాను!”
మీరు కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలను మీ ఇంటికి తెప్పించుకోవాలనుకుంటే, లేక ఉచిత గృహ బైబిలు పఠనాన్ని కావాలనుకుంటే దయచేసి, Praharidurg Prakashan Society, Plot A/35, Nr Industrial Estate, Nangargaon, Lonavla 410 401, Mah., లేదా 5వ పుటలోని మీకనుకూలమైన చిరునామాకు వ్రాయండి.