కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 3/8 పేజీలు 16-17
  • జాంజిబార్‌—“లవంగాల దీవి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జాంజిబార్‌—“లవంగాల దీవి”
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • లవంగాలు మరియు వాటి ఉపయోగం
  • ప్రజలు
  • ప్రపంచవ్యాప్త దైవిక విద్యను వృద్ధి చేయడంలో నా పాత్ర
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • జగత్తును మలచిన జిహ్వరుచి
    తేజరిల్లు!—1993
తేజరిల్లు!—1995
g95 3/8 పేజీలు 16-17

జాంజిబార్‌—“లవంగాల దీవి”

కెన్యాలోని తేజరిల్లు! ప్రతినిధి ద్వారా

తూర్పు మధ్య ఆఫ్రికా కోస్తాతీరానికి ముఫ్పై అయిదు కిలోమీటర్ల దూరాన జాంజిబార్‌ దీవి ఉంది. హిందూమహాసముద్రపు వెచ్చని నీలి జలాలతో చుట్టుముట్టబడి, శ్వేత సైకత తీరాలను అంచులుగా కలిగి ఉండి, ఎగుడుదిగుడు కొండలతో మరియు వ్యాపారపవనాలకు ఊగిసలాడే ఖర్జూర వృక్షాలతో అలంకరించబడిన జాంజిబార్‌ నిజంగా సర్వసుందరమైన దీవే. సాపేక్షికంగా చిన్నదైనా—85 కిలోమీటర్ల పొడవు మరియు 39 కిలోమీటర్ల వెడల్పుగల—ఆ దీవి ఆఫ్రికా చరిత్రలో పెద్ద పాత్రే వహించింది.

శతాబ్దాలుగా పర్షియన్లు, అరబ్బులు, ఈస్ట్‌ ఇండియన్లు, పోర్చుగల్‌ వారు, ఆంగ్లేయులు, ఆసియా వారు, ఉత్తర అమెరికా వారు మరియు ఆఫ్రికా ముఖ్యప్రాంతంలోని వారు కూడా జాంజిబార్‌ను దర్శించారు. విస్తరిస్తున్న బానిస వ్యాపారం అప్పట్లో ప్రముఖ ఆకర్షణగా ఉండేది. వర్తకులు మరియు అన్వేషకులు తమ సరుకులను ఇక్కడినుండే పొందేవారు. వాస్తవానికి, 19వ శతాబ్దంలో ఆఫ్రికాకు వచ్చిన ఐరోపా అన్వేషకులు ఈ దీవిగుండానే వెళ్లారు! అది ఆఫ్రికా ముఖద్వారమని పిలువబడిందంటే అందులో ఆశ్చర్యం లేదు.

లవంగాలు మరియు వాటి ఉపయోగం

ఒమాన్‌ సుల్తాన్‌ అయిన సయ్యద్‌ సెయీద్‌, 18వ శతాబ్దపు తొలి అర్థభాగంలో తన స్వదేశమైన పర్షియా సింధుశాఖను విడిచి జాంజిబార్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ఈ దీవి పాలకునిగా అతడు, అరబ్బు పొలాల యజమానులు కొబ్బరి చెట్లను పెంచడం మానేసి మరింత లాభదాయకమైన పంటను పండించేలా చేశాడు: అవే లవంగాలు. ఆయన జీవితావసాన దశలో, లవంగాల లాభాలకంటే బానిస మరియు దంతపు వాణిజ్యం యొక్క లాభాలే ఎక్కువయ్యాయి. కావున బానిసల వ్యాపారం నిషేధించబడినప్పుడు, జాంజిబార్‌ లవంగాల దీవిగా పేరుగాంచింది. నేడు ప్రపంచానికి కావల్సిన లవంగాలకు అదే ముఖ్య మూలం.

వాస్తవానికి లవంగాలు ఉష్టమండల సతతహరిత చెట్టు యొక్క ఎండిన పూమొగ్గలు. ఆ చెట్టు యొక్క శాస్త్రీయ నామం యూజెనియా కార్యోఫిలాటా. జాంజిబార్‌లో, ఒక మోస్తరు చెట్టు 9 మీటర్ల ఎత్తు ఉంటుంది. పూమొగ్గలు సాధారణంగా ఎరుపు గోదుమ వర్ణంలో వుండి, సుమారు 1.3 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్నప్పుడు కోయబడతాయి. ఒక ఫలదాయకమైన చెట్టు దాదాపు 34 కిలోగ్రాముల మొగ్గల వరకు దిగుబడినివ్వగలదు. కోయబడిన తర్వాత అవి ఉష్ణమండలపు వేడి ఎండలో ఎండేందుకు వేయబడతాయి.

వాటి సుమధుర సువాసన మరియు ఘాటైన రుచి వలన లవంగాలు ప్రాముఖ్యంగా వంటకాల్లో ఉపయోగించబడుతున్నాయి. మాంసం మరియు కూరగాయల వంటకాల రుచి తరచూ లవంగాలచే అధికం చేయబడుతుంది. మీరు నాల్గు లేక ఐదు మొగ్గలను కొద్దిగా నలగ్గొట్టి, వాటిని మరుగుతున్న నీళ్లలో కలిపి, మసాలా టీ చేసుకోవచ్చు! చల్లని శీతాకాల దినాన, ఎర్రని ద్రాక్షారసాన్ని వేడిచేసి దానికి కొన్ని లవంగాలను కలపడం ద్వారా దాన్ని ఉత్తేజాన్నిచ్చే పానీయంగా మార్చవచ్చు. కొందరు, దాదాపు 20 లవంగాలను ఒక కమలాపండుకు అక్కడక్కడా గుచ్చి, దాన్ని ఒక వారంపాటు తమ స్నానాలగదిలో తగిలించి ఉంచడం ద్వారా దానిలో తాజా వాసన వచ్చేందుకు లవంగాలను ఉపయోగించుకుంటారు. దంతవైద్యులు పంటి నొప్పి ఉపశమనానికి లవంగనూనెను నోటి భాగం కొరకు అనస్తెటిక్‌లా ఉపయోగించారు. లవంగమొగ్గ నోటి దుర్వాసన పోగొట్టే వాటిలో మరియు పరిమళద్రవ్యాలలో కూడా ఉపయోగించబడింది. ఈ చిన్న దీవి దాని లవంగ పంటనుబట్టి ప్రఖ్యాతిగాంచడంలో ఆశ్చర్యం లేదు.

ప్రజలు

జాంజిబార్‌ యొక్క నిజమైన మసాలా దాని స్థానికప్రజలే. మీరు ఆ దీవిలో అడుగు పెట్టిన మరుక్షణమే, జాంజిబార్‌ వాస్తవ్యులచేత మీరు ఆప్యాయంగా ఆహ్వానింపబడతారు. వారు చాలా కులాసాగా ఉన్నట్లు కనిపిస్తారు, ఇతరుల కొరకు సమయాన్ని వెచ్చిస్తారు. సంభాషిస్తున్నప్పుడు, వారు చాలాసార్లు కరచాలనం చేయవచ్చు, బహుశా పది నిమిషాల వ్యవధిలో మూడు లేక నాల్గుసార్లు అలా చేస్తారు. సరదాగా చెప్పబడిన దేనికైనా వారు ఈ విధంగానే అయత్నంగా ప్రతిస్పందిస్తారు.

మీరు వాళ్ల గృహాన్ని దర్శిస్తే, వాళ్లు మీకు తమదైన ప్రసిద్ధ పద్ధతిలో ఆతిథ్యాన్ని అందిస్తారు. అతిథులకు ఎప్పుడైనా సర్వశ్రేష్ఠమైనదే ఇవ్వబడాలి. అతను అనుకోకుండా భోజనసమయాల్లో వచ్చినా, ఆ విషయంలో సందేహమే లేదు: అతను కూడా కలిసి తృప్తితీరా తినాలి. అటువంటి అతిథి సత్కారం బైబిలు కాలాలను జ్ఞప్తికి తెస్తుంది.—ఆదికాండము 18:1-8 పోల్చండి.

జాంజిబార్‌ వారు చూడటానికి వివిధవర్ణాలలో, విశేషంగా ఉంటారు. స్త్రీలు బయటకి వెళ్లేటప్పుడు—వాళ్లను తలనుండి పాదాల వరకు కప్పే ఒక పెద్ద అంగీ వంటి బూయిబూయి ధరిస్తారు. ఆసక్తికరంగా, ఇది పాశ్చాత్య శైలి వస్త్రధారణను కప్పగలదు. మరి పురుషులైతే, తెల్లని లేక సుద్ద రంగు వస్త్రమైన కాంజూ ధరించుకుని కనిపిస్తారు. వారు అల్లిక టోపీ అయిన కోఫియా ధరిస్తారు.

రాతి పట్టణం (స్టోన్‌ టవున్‌) అని పిలువబడే, జాంజిబార్‌ నగర చారిత్రాత్మక భాగం గుండా నడుస్తున్నప్పుడు, ఒకడు తాను కాలప్రవాహంలో వెనక్కు తీసుకువెళ్లబడినట్లు భావిస్తాడు. వీధులు, వాడల సందుగొందుల్లో బాట ప్రక్కన కాలిబాటలు (ఫుట్‌పాత్‌లు) ఉండవు. అనేక దుకాణాల తలుపులు వీధుల్లోకే తెరువబడి ఉంటాయి! అల్లం కలిపిన తీయని అరబ్బు కాఫీయైన కహావాను అమ్మే వారివంటి అనేకమంది అమ్మకందార్లు ఉంటారు.

అయితే, మాటలుకానీ, ఛాయా చిత్రాలు కానీ జాంజిబార్‌ సౌందర్యాన్ని తగినంతగా వర్ణించలేవు. “లవంగాల దీవి”గా దాని ఖ్యాతి అనేకానేక విధాలుగా సరియైనదే.

[16వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

జాంజిబార్‌

[Picture Credit Line on page 17]

Africa and border map: The Complete Encyclopedia of Illustration/J. G. Heck

ఆఫ్రికా మరియు సరిహద్దు మానసచిత్రం: ది కంప్లీట్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ఇలస్ట్రేషన్‌/జే. జి. హెక్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి