కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 11/8 పేజీలు 16-18
  • వర్ధమాన దేశాల్లో ఉద్యోగాలను కల్పించటము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వర్ధమాన దేశాల్లో ఉద్యోగాలను కల్పించటము
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆఫ్రికా పద్ధతిలో—ఆహార వ్యాపారము
  • సేవాపరిశ్రమలు
  • చాతుర్యాన్ని ఉపయోగించుట
  • సెనెగల్‌లో క్రైస్తవ నిరీక్షణను పంచుకోవటం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • ‘తన ఇంటివారిని పోషించడం’—వర్ధమాన దేశాల్లో సవాలునెదుర్కోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • నేను కాస్తంత డబ్బును ఎలా సంపాదించగలను?
    తేజరిల్లు!—1998
  • స్త్రీలనూ, వారి పనినీ మెచ్చుకోవడం
    తేజరిల్లు!—1998
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 11/8 పేజీలు 16-18

వర్ధమాన దేశాల్లో ఉద్యోగాలను కల్పించటము

సెనెగల్‌లోని తేజరిల్లు! ప్రతినిధి

ఓ యౌవనస్థురాలు బాలికగా వున్నపుడే, ఆమె తండ్రి ఎనిమిదిమంది పిల్లలు కలిగిన పెద్ద కుటుంబాన్ని ఆమె తల్లికి వదిలిపెట్టి మరణించాడు. ఇప్పుడు ఆమె తల్లి వృద్ధురాలు అవుతోంది, ఆ యౌవనస్థురాలు ఒక ఉద్యోగాన్ని వెదుక్కొని కుటుంబానికి మద్దతూనిస్తూ తోడ్పడాలి. పాఠశాల విద్యను కొనసాగించాలనే తన కల సమసిపోయింది. ఆమెకు ఏ నిపుణతలు, కనీస విద్యాభ్యాసముకూడ లేకపోయినప్పటికి, ఆమె తప్పనిసరిగా ఉద్యోగము చేయాలి.

వర్ధమాన దేశాలలో యిలాంటి పరిస్థితులు సర్వసాధారణము. యూనివర్సిటీ డిగ్రీలున్నప్పటికి ఉద్యోగాలు దుర్లభంగా ఉన్నాయి. ఏమైనప్పటికీ, పట్టుదలతోను, మంచి సృజనాత్మకశక్తితోను చాలామంది తమకు తామే ఉద్యోగాలను పొందగల్గుతున్నారు. అటువంటి ఉద్యోగాలు ఏ వ్యక్తినికూడ ఐశ్వర్యవంతునిగా చేయలేకపోవచ్చు, కాని 1 తిమోతి 6:8లో బైబిలు యిలా చెబుతుంది: “అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.”

అట్టి సమతుల్యమైన ఉపదేశ పలుకులను మనస్సులో పెట్టుకొని, వర్ధమాన దేశాలలోని క్రైస్తవులు యుక్తమైన మార్గాలను చేపట్టుతూ బ్రతుకగల్గుతున్నారో, వర్ధిల్లుతున్నారో యిప్పుడు పరిశీలిద్దాము.

ఆఫ్రికా పద్ధతిలో—ఆహార వ్యాపారము

ఆహారానికి ఎల్లప్పుడు గిరాకీవుంది. యిక్కడ ఆఫ్రికాలో, వ్యాపారముచేసే స్త్రీలు, యీ వాస్తవాన్ని లాభసాటిగా మార్చుకోవటంలో అద్భుతమైన వివిధ మార్గాలను కనుగొన్నారు. ఉదాహరణకు, కొంతమంది, భవన నిర్మాణాలు జరిగే స్థలానికి దగ్గరలోనే ఒక చిన్న షెడ్డు వేసికొని ఆ పనివాళ్లకు మధ్యాహ్న భోజనాన్ని వండిపెడుతుంటారు. ఇతరులు ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లేవారికి ఆహారాన్ని అందిస్తుంటారు. చిన్న బల్లతోపాటు బెంచీలను వేసి, బొగ్గులపై నీళ్లను వేడిచేసి, సామాన్యమైన ఫలహారాన్ని—వేడి కాఫీతో తాజాగావున్న రొట్టెను, వెన్నను అందిస్తుంటారు. సూర్యుడస్తమిస్తుండగా పనివాళ్లకు మరల అల్పాహారాన్ని అందించేందుకు సాయంకాలము దుకాణాన్ని మరలా తెరుస్తారు. యిటువంటి టీ దుకాణాన్ని నడపటం అంటే కష్టతరమైన పట్టికను అనుసరించాల్సి ఉంటుంది, అయితే కష్టపడి పనిచేసే పనివాళ్లకు వాళ్ల ఖర్చులకు సరిపడే డబ్బు లభిస్తుంది.

అల్పాహారాలన్నీ అమ్ముకొనే అవకాశంకూడా ఉంది. కొంతమంది స్త్రీలు మార్కెట్‌కు దగ్గరలోనే జనము రద్దీగావున్న ప్రాంతాలను చూసుకొని, వేరుశనగకాయలను వేయిస్తుంటారు. ఫాటాయా—చిన్న మాంసపు ముక్కలు వేడిపులుసుతో—త్వరగా అమ్ముడుపోతాయి. ఆవిధంగా మాంసపు సాండ్‌విచ్‌లను, మసాలా మాంసంకూరతో తయారుచేస్తుంటారు. గాంబియా, మాలీ ఆఫ్రికా దేశాలలో యివి చాలా త్వరగా అమ్ముడుపోయే పదార్థాలు.

గూనీయా-బీసాయా, సెనెగల్‌ ప్రాంతాలలో, యెహోవాసాక్షులైన యౌవనస్థులలో చాలామంది తమ పూర్తికాల పరిచర్యలో తమ్మును తాము పోషించుకునేందుకు వేరొక జనప్రియమైన పదార్థాన్ని బెక్‌చేసి, అమ్ముతూవుంటారు: అవే చిన్న కేకులు. సెనెగల్‌ రాజధానియైన ధాకర్‌నందున్న మోసేస్‌, వివరిస్తున్నాడు: “నా భార్య నేను ప్రత్యేక పయినీర్లుగా పనిచేస్తున్నప్పుడు మాకు పిల్లలు కలిగారు. యిప్పుడు నేను వారిని పోషించటానికి ఒక మార్గాన్ని కనుగొనాలి, అందుచేత చిన్న కేకులను తయారుచేసి అమ్మాలనే యీ ఉపాయము నాకు తోచింది.

“అది ఆరంభించటానికి నా దగ్గర కొంత డబ్బేవుంది, కాబట్టి నాకు వచ్చిన డబ్బులో లాభమెంతో, వ్యాపారానికి అవసరమైన పిండి మరియు గ్రుడ్లువంటి సామాన్లు మళ్లీ కొనటానికి డబ్బు ఎంత అవసరమో అప్రమత్తముగా నేను చూసుకోవాలి. ఇపుడు నేను నా చిన్న కుటుంబములోని అనేక అవసరాలను తీర్చటానికి కావలసినన్ని కేకులను అమ్మగల్గుతున్నాను.

“నాకు తోడ్పడేందుకు, నా భార్య ఎస్తేరు, యింట్లో మిషన్‌ కుడుతుంది. ఇది మా యిద్దరు పిల్లలతో యింటిలోనే ఉండటానికి ఆమెను అనుమతించింది. వాస్తవానికి మేము కష్టకాలాల్లో జీవించినప్పటికీ, అలా మేమిద్దరం కలిసి, మా కుటుంబాన్ని బాగా చూసుకోగలిగాము.”

ఇక్కడ చిన్న వ్యాపారము చేసికొనటానికి మరొక ఉపాయమున్నది: ఉద్యోగాలు చేసేవాళ్లు పనిరద్దీలో ఉంటారు, కావున తరచుగా మార్కెట్‌కు చాలా దూరము వెళ్లి రావటానికి వాళ్లకు సమయముండదు, కాబట్టి ఆ ప్రాంతములో స్టాండ్లపై ఫలాలను లేదా కాయగూరలను అమ్మేవాళ్లకు వాళ్లు ప్రాపకమిస్తుంటారు. కొంతమంది స్టాండు యజమానులు బట్వాడా పనులనుకూడ చేస్తుంటారు, తాజాగావున్న కాయగూరలను వినియోగదార్లు గృహాలవద్దకే తీసుకొని వెళ్తారు. మీరు నిజాయితీగా వుండి, నాణ్యతగల వస్తువులను విక్రయిస్తున్నారన్న వార్త చాలా త్వరగా వ్యాపించగలదు. ఏమైనప్పటికి, జాగ్రత్తగా వుండండి, ఎక్కువ ధరను వసూలుచేయవద్దు, లేకపోతే ప్రజలు వాడుకగావెళ్లే మార్కెట్‌కే తిరిగి వెళ్తారు.

సేవాపరిశ్రమలు

వస్తువులను అమ్మటం యిష్టపడకపోతే, వివిధరకాల సేవలను అందించే వాటిని పరిశీలించండి. ఇంటిని శుభ్రపర్చటం, వంటచేయటం, బట్టలుతుకటం, ఇస్త్రీ చేయటంవంటి, గృహసంబంధమైన పనులకు ఎల్లప్పుడు గిరాకీ ఉంటుంది. మరి లెక్కలేనన్ని యితర అవకాశాలుకూడ వున్నాయి.

ఉదాహరణకు, మీరు సముద్రానికి దగ్గరలోనో లేదా చేపల మార్కెట్‌కు దగ్గరలోనో నివసిస్తున్నారా? త్వరగా మరియు తక్కువ ధరకు శుభ్రపర్చిన చేపలను మీరు ఎందుకు అందించకూడదు? మీకు కావలసినవి ఒక మంచి చెక్కదిమ్మ మరియు బాగా పదునున్న చేపలను కోసే కత్తిమాత్రమే. కార్లను శుభ్రపరచటంకూడ మరొకరకమైన లాభసాటి వ్యాపారం. దానికి కావలసిన ఉపకరణములేమిటి? ఒక బక్కెట్టు, కొన్ని నీళ్లు, చిన్న సబ్బు, ఒక మంచి బట్ట మాత్రమే. ధాక్కర్‌లో, వ్యాపారము చేయాలనే దృక్పథము గల యౌవనస్థులు అన్ని పార్కింగ్‌ స్థలాల్లోను మరియు ఒక నీడగావున్న వీధుల్లోను యీ సేవలను చేస్తుంటారు.

మీరున్న ప్రాంతాల్లో నీటి కొరత ఉన్నదా? కొన్నిసార్లు స్త్రీలు కుళాయిదగ్గర మామూలు నీటిని వారి కుండల్లో నింపుకోవటానికి కొన్ని గంటలసేపు క్యూలో నిల్చొని ఉండవలసివస్తుంది. వాళ్ల తలపైన బరువైన పాత్రలను పెట్టుకొని యింటివరకు మోసుకొని వెళ్లవలసివస్తుంది. నీళ్లు తెచ్చిపెట్టే వాళ్లకు అనేకులు డబ్బులు చెల్లించటానికి యిష్టపడుతుంటారు. ఉపాయమేమిటంటే, మీ పాత్రలన్నీ నింపుకొని తోపుడు బండిమీద లేక గాడిదబండిమీద వాటినెక్కించుకొనేందుకు, మీరు ప్రొద్దున్నే కుళాయి దగ్గరకు వెళ్లడమే. ఆ విధముగా మీరు యిప్పుడు పనిచేసే స్థలాల్లోకిగాని లేదా గృహాలకుగాని నీళ్లను అందచేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట.

మీరు లౌకిక విద్యను కలిగియున్నారా? బహుశా వారాంతములో చిన్నపిల్లలకు ప్రైవేటు చెప్పగలరు. వర్ధమాన దేశాలలో తరగతి గదుల్లో ఎక్కువమంది ఉంటారు గనుక, తల్లిదండ్రులు తమ పిల్లలు వ్యక్తిగత శ్రద్ధను పొందడంకొరకు మూల్యమును చెల్లించటానికి యిష్టపడవచ్చు.

మీరు యిప్పటికే మరొక ఉపయుక్తమైన నిపుణతగల జడవేయటమనే కళను కలిగియుండవచ్చు. ఆఫ్రికా దేశములోని స్త్రీలలో వివిధరీతులలో తలవెండ్రుకలను జడలు వేయటం యిప్పటికే ప్రఖ్యాతిగాంచింది, కావున ఈ కళలో నిపుణతగల వ్యక్తులు డబ్బు సంపాదించుకోగలరు.

చాతుర్యాన్ని ఉపయోగించుట

బైబిలుకాలాల్లో, సామర్థ్యముగల భార్య ఆదాయాన్ని కలుగజేయటానికి యుక్తమైన మార్గాలను కనుగొనగల్గేది. “ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును” అని సామెతలు 31:24 చెబుతుంది. అదేమాదిరిగా, వర్ధమాన దేశాల్లోని అనేకులు, సొంతముగా కుటీరపరిశ్రమలను నడపడం లేదా చిన్న వ్యాపారాలు చేయడం ఫలదాయకమని కనుగొన్నారు. ఉదాహరణకు, వడ్రంగివాడు ఒక చిన్న దుకాణాన్ని ఏర్పాటుచేసుకొని, బెంచీలను, యింటికి కావలసిన మరితర సామాగ్రిని, చిన్న పరికరాలను తయారుచేస్తాడు. చాల ముఖ్యమైన వడ్రంగి పరికరాలు మాత్రమే అవసరము. వ్యవసాయములో మీకు కొన్ని నైపుణ్యతలుంటే, బహుశా కోళ్ల వ్యాపారమును ఆరంభించి గ్రుడ్లను, కోళ్లను అమ్మవచ్చు.

చిన్నపరిశ్రమలను ఆరంభించటానికి ప్రాముఖ్యముగా చాతుర్యము ఆవశక్యం. కొంతమంది, పనికిరానివని పారేసిన టిన్నులను అందమైన సూటుకేసులుగా, ట్రంకు పెట్టెలుగా మార్చుతున్నారు. మరి కొంతమంది వాహనాల టైర్లతో చెప్పులను తయారుచేశారు. మరితరులు పాత ట్యూబులనుండి బక్కెట్లనుకూడ తయారుచేస్తున్నారు. అవకాశాలు మీ కల్పనాశక్తికి మాత్రమే పరిమితమై ఉండవచ్చును.

వర్ధమాన దేశాల్లో బ్రతకాలంటే మీరు కల్పనాశక్తిని, నైపుణ్యతను మాత్రమేకాక, సహనమును, అనుకూల దృక్పథమునుకూడ కలిగియుండాలి. వాటిని త్వరగా వదిలివేయవద్దు. అనుకూలతతో, అవసరమైతే ఉద్యోగాలను మారటానికికూడ సిద్ధముగా ఉండేటట్లు అనుకూలంగా ఉండాలి. ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా, సేవను అందించాలన్నా, నిశ్చయముగా స్థానికముగావున్న చట్టాలను మరియు అవసరమైన శాసనాలను మీరు పరిశీలించాలి. క్రైస్తవులు దేశచట్టానికి తగిన గౌరవమును చూపవల్సిన అవసరమున్నది.—రోమీయులు 13:1-7.

ఒక వస్తువునుగాని లేదా సేవనుగాని అందించాలని ప్రయత్నము చేసేముందుగా మీకై మీరు యీ విధముగా ప్రశ్నించుకోండి: ‘స్థానికముగావున్న అవసరతలు, సాంప్రదాయాలేమిటి? స్థానికముగావున్న ఆర్థికస్థితి ఎలావుంది? నేను అందించే వాటిని వినియోగదార్లు కొనుక్కోగలరా? ఎంతమంది అలాంటి వస్తువును అందిస్తున్నారు లేక సేవ చేస్తున్నారు? యీ వ్యాపారాన్ని కొనసాగించటానికి అవసరమైన నైపుణ్యతను, శక్తిని, చొరవను, వ్యక్తిగత క్రమశిక్షణను, వ్యవస్థీకరించే చాతుర్యాన్ని నేను కల్గివున్నానా? దీనికి ఎంత మూలధనము అవసరమౌతుంది? నేను అప్పు చేయాలా? తీసుకున్న ఋణాన్ని నేను సరిగ్గా తిరిగి చెల్లించగలనా?’

లూకా 14:28 నందు యేసు ప్రశ్నించినది సమయానుకూలమైంది: “మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తనయొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా?”

నిజమే, స్వయం-ఉపాధి కల్పించుకునే నిపుణత లేక మనోప్రవృత్తి అందరికి ఉండదు. ఏమైనప్పటికి సరైన దృక్పథముతో మీరు తీసుకున్న చొరవను, మీ యథార్ధ ప్రయాసను యెహోవా దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. (2 పేతురు 1:5 పోల్చండి.) మీయంతట మీరే పనిని కల్పించుకోవల్సి వచ్చినప్పటికి—ఆ పనిని కనుగొనటానికి శాయశక్తుల ప్రయత్నం చేయండి!

[16,17వ పేజీలోని చిత్రాలు]

బట్టలను కుట్టటం, కార్లను కడుగటం, మంచినీళ్లను అందచేయటం మరియు చేపలను శుభ్రంచేయటం వంటి కొన్ని పద్ధతులద్వారా ప్రజలు తమ జీవనోపాధిని కల్పించుకుంటున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి