అపాయము నుండి రక్షించిన నీటిగుర్రము!
భూమి పై జీవించే అతి పెద్ద సస్తన జంతువులలో రెండవదైన నీటిగుర్రము, నాలుగు టన్నుల బరువుంటుంది. దాని శక్తివంతమైన దవడలు చిన్నపడవను ఒక్కసారి కొరికి రెండు ముక్కలు చేయగలవు. అయితే, హవాన్జ్ నేషనల్ పార్క్, జింబాబ్వే, నందు ఒక పురుషుల గుంపు, నీటిగుర్రము అసాధారణంగా ప్రవర్తించడం వారు చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయారంటే—అతిశయోక్తికాదు.
ఆ పురుషులు, నీటి అడ్డుకట్ట దగ్గర ఉన్నప్పుడు, తొమ్మిది అడవి కుక్కలచే తీవ్రంగా వెంబడించబడిన రెండు పెద్దజింకలను చూసారు. తప్పించుకొనే మార్గం లేక, ఆ పెద్దజింకలు నీటిలోకి దూకినవి. ఆ పెద్దజింకలు ఎక్కడ నుండి పైకితేలుతాయోనని అపేక్షిస్తూ, నీటి అంచు పొడుగున కుక్కలు పరుగెత్తినవి.
ఆ కుక్కలు అక్కడ నిలిచివున్నాయని గ్రహించకుండానే, ఒక అలసిపోయిన పెద్దజింక చివరకు, దూరమునున్న ఒడ్డుకు ఈదడము ప్రారంభించింది. ఆ పెద్దజింక ఒడ్డుకు వస్తుండగానే, దగ్గరవున్న ఒక నీటిగుర్రము పెద్దజింక వైపుకు ఈదడాన్ని ఆ పురుషులు చూసారు. దాని దగ్గరకు రాగానే, ఆ నీటిగుర్రము, “దాన్ని చుట్టు తిప్పి వ్యతిరేక దిశలో ఈదడానికి మెల్లిగా నెడుతూ దాన్ని బలవంతపెట్టిందని” ఆఫ్రికన్ వైల్డ్‌లైఫ్ అను పత్రిక తెలియజేస్తుంది. పెద్దజింక ఆ ప్రకారమే చేసింది. పెద్దజింక స్థిమితంలేనట్టు సూచనలు చూపించినప్పుడు నీటిగుర్రము అప్పుడప్పుడు నెడుతూ కొనసాగింది.
పెద్దజింక నీటి ఒడ్డుకు చేరగానే, నీటిగుర్రము పెద్దజింకను ఒడ్డుకి మెల్లిగానే కాని స్థిరంగా నెట్టడాన్ని ఆ పురుషులు చూసారు. ఆ పెద్దజింక ఆగి, వణుకుతూ నిలిచి తడబడుతూ కొన్ని అడుగులు వేసింది. వెంటనే, పెద్దజింక నీటికి దూరంగా నడవడము ప్రారంభించింది. దృష్టి నుండి కనుమరుగయ్యేంత వరకు నీటిగుర్రము వెంబడించింది.
మరో పెద్దజింక ఏమయ్యింది? అడవి కుక్కలు “రక్షించడాన్ని చూస్తుండడంలో లీనమైయున్నప్పుడు ఆ పెద్దజింక గమనింపబడకుండానే తప్పించుకొందని” ఆ పురుషులు తెల్పారు. (g94 10/8)