మీ కుటుంబ జీవితాన్ని సంతోషభరితం చేసుకోండి
అమెరికా, దక్షిణ కారోలీనాలోని ఒక రోగి, తన నర్సులలో ఒకరికి కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి అనే కరపత్రాన్ని పంపినప్పుడు, దాని గురించి ఆమెకు కృతజ్ఞతలు తెలుపడానికి ఆ నర్సు టెలిఫోన్ చేసింది. తను ఆ కరపత్రాన్ని తన భర్తకిచ్చానని, తామిద్దరూ కలిసి దానిని ఎంతో మెప్పుతో చదివామని నర్సు చెప్పింది. వాస్తవానికి, కుటుంబాలకు సహాయం చేయడానికి ఎంతో అనుకూలమైనది యిలాంటిదొకటి లభ్యమౌతుందంటే వారు విశ్వసించలేకుండా ఉన్నారని ఆ నర్సు చెప్పింది.
రోగి యిలా వివరించింది: “కుటుంబంలో ఎటువంటి ఆదర్శవంతమైన, అనుకూలమైన విషయాలు ఉండాలని తను, తన భర్త చర్చించారో, ఆ సంగతులే అందులో ఉన్నాయని, అలాంటి విషయాలు ప్రచురింపబడి ఉంటాయని తాము తలంచనేలేదని ఆ నర్సు నాతో చెప్పింది. తాను ఎక్కడికి వెళ్లినా ఆ చిన్న కరపత్రాన్ని తన వెంట ఉంచుకుంటున్నానని దాన్ని మళ్లీ మళ్లీ చదువుతున్నానని చెప్పి ఆమె ఫోన్‌కాల్ ముగించింది. కుటుంబ జీవితానికి సంబంధించిన యితర సమాచారం మీవద్ద ఉంటే దయచేసి వాటిని నాకు చూపండని ఆమె చెప్పింది.”
ఆ రోగి నీ కుటుంబ జీవితమును సంతోషభరితము చేసికొనుము అనే పుస్తకాన్ని నర్సుకు పంపి, దానిని నర్సుతో కలిసి పఠించడానికి ఆమె వద్దకు వెళ్లే ఏర్పాటును చేసింది. మీ కుటుంబ జీవితాన్ని సంతోషభరితం చేయడానికి సహాయపడే సమాచారం కావాలని మీరు కూడా యిష్టపడవచ్చు. ఒకవేళ మీరు కూడా కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి, అలాగే నీ కుటుంబ జీవితమును సంతోషభరితము చేసికొనుము అనేవాటి ప్రతి లేక ఉచిత గృహ బైబిలు పఠనం కావాలని యిష్టపడితే, దయచేసి Watch Tower, H–58 Old Khandala Road, Lonavla 410 401, Mah.,కు లేక ఐదవ పేజీలో ఇవ్వబడిన చిరునామాలలో మీకనుకూలమైన దానికి వ్రాయండి.