అశ్లీలసాహిత్యం కళాశాలకు చేరుతోంది
సాన్ ఫ్రాన్సిస్కో క్రానికిల్, నవంబరు 1, 1993లోని “ది మాటైర్ & రాస్ రిపోర్టు” సాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీలో వివాదాస్పద క్లాసులు జరిగినట్లు చెబుతుంది. మానవ లైంగికత అనే విషయంపై, ప్రొఫెసర్ జాన్ డెచకో క్లాస్ యిచ్చాడు. మాటైర్, రాస్ యీ క్రింది విధంగా వ్యాఖ్యానించాడు;
“అదేం క్లాసు. మీరు ఎస్.ఎఫ్.ఎస్.యు. డిగ్రీ కోసం కామవాంఛకు సంబంధించిన మూడు యోగ్యతాపత్రాల కొరకు చూస్తున్నట్లయితే, క్లాస్ సిలబస్లో యివ్వబడిన శృంగార (కొన్నిసార్లు రాజకీయంగా ఒప్పే) విషయాలను చూసుకోవాలి.”
ఆ రిపోర్టు, హస్తప్రయోగం, స్త్రీ, పురుషుని దుస్తులను, పురుషుడు, స్త్రీ దుస్తులను ధరించడం, పురుష సంయోగం, స్త్రీల మధ్య సంయోగం, మృగ సంయోగం, శారీరకంగా నొప్పించి అనుభవించాలన్న లైంగిక తృష్ణలతో సహా మరి కొన్నింటి పట్టికను చూపిస్తుంది. ఈ పనులలో కొన్నింటిని గూర్చి యిచ్చిన ప్రసంగాల్లో వీడియో టేపులు కూడా ఉన్నాయి.
లేవీయకాండము 18వ అధ్యాయంలో మోషే ధర్మశాస్త్రం పేర్కొన్నట్లుగా, అలాంటి కార్యాలను యెహోవా అసహ్యించుకొనే “హేయమైన క్రియలతో” పోల్చవచ్చు. రక్త సంబంధం గలవారితో లైంగిక సంబంధము, వ్యభిచారం, మరితర లైంగిక దురలవాట్లను ఖండించిన తర్వాత, 22, 23 వచనాలు యిలా చెబుతున్నాయి: “స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు; అది హేయము. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము.”
యెహోవా అసహ్యించుకొనే యీ పనులను చేయడం మూలాన ఆయన శాపానికి గురౌతాము: “వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్నవారిని వెళ్లగ్రక్కివేయుచున్నది. ఎవరు అట్టి హేయక్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు.”—లేవీయకాండము 18:24, 25, 29.
ఎస్.ఎఫ్.ఎస్.యు. కోర్సు చదువుతున్న ఒక విద్యార్థి, “అనైతిక ప్రజలను గూర్చి ప్రచారంలో ఉన్న అభిప్రాయాలను తొలగిస్తున్నందుకు, వారు యితర ప్రజలవంటివారేనని తెలుపుతున్నందుకు” డిసెకోను ప్రశంసించాడు. ఈ ప్రజలు ఇతరుల్లాగే ఉన్నారా? సాధారణంగా, ప్రజలు సలింగ సంయోగం, స్త్రీల మధ్య సంయోగం, శారీరకంగా బాధపెట్టి అనుభవించడం వంటి లైంగిక దురలవాట్లకు నిశ్చయంగా పాల్పడరు, మృగాలతో లైంగిక సంబంధాన్ని కలిగివుండరు. నేటి సమాజంలో నైతిక పతనం కలతపరచేదిగా ఉంది. అయినా యూనివర్సిటీ క్లాసులో బోధించబడే యీ క్రియలన్నీ పండితుల పఠనం లేదా పరిశోధన అనే ముసుగులో, నీచమైన, అశ్లీలమైన సాహిత్యంలో భాగంగా వర్ణించబడుతున్నాయని ఒప్పుకోవలసిందే.