కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 8/8 పేజీ 32
  • నేటి అవసరతలను తీర్చే పత్రికలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేటి అవసరతలను తీర్చే పత్రికలు
  • తేజరిల్లు!—1994
తేజరిల్లు!—1994
g94 8/8 పేజీ 32

నేటి అవసరతలను తీర్చే పత్రికలు

ప్రతి నెల వందకన్నా ఎక్కువ భాషల్లో, ఐదు కోట్ల ఎనభై లక్షల ప్రతుల్లో ముద్రించబడుతున్న కావలికోట, తేజరిల్లు! పత్రికలు ఆ పనే చేస్తున్నాయి. అది గ్రహించిన ఒక పాఠకుడు యిలా రాశాడు:

“అనేకులు ఎదుర్కొనే నిజమైన సమస్యలను చర్చించే శీర్షికలను ప్రచురిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు.” ఆయన యిలా కూడా అన్నాడు:

“ఈ లోకము అంతాన్ని సమీపిస్తుండగా, ప్రజలు తమ సమస్యలను ఎదుర్కోవడానికి వారికి సహాయపడేందుకు అవగాహన, గ్రహణశక్తి, పరిజ్ఞానము అవసరము. కొన్నిసార్లు ప్రజలు వారికున్న సమస్యలను ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారో, అందుకు గల కారణాలను కావలికోట, తేజరిల్లు! పత్రికలు మరీ మరీ చెబుతున్నాయి. . .

“చాలా మంది సరైనది చేయాలని ఆశిస్తారు, కాని తరచూ వారు నిరాశతో, తప్పు చేశామనే భావంతో, ప్రతికూల భావాలతో, భయంతో, ఆత్మ న్యూనతా భావంతో, హీనమైన మానసిక అలవాట్లతో, తమకు తాము సహాయపడేందుకు శక్తి లేదనే భావనతో పెనుగులాడుతూ ఉంటారు. తమ జీవితాలను, భావోద్రేకాలను తిరిగి అదుపులో ఉంచుకోడానికి మీ వ్యాసాలు అనేకులకు తోడ్పడుతున్నాయి. . . .

“విశేషంగా జనవరి 22, 1994, అవేక్‌!లోని ‘కమ్యూనికేషన్‌ ఇన్‌ మ్యారేజ్‌’ అనే శీర్షికను ప్రచురించినందుకు మీకు కృతజ్ఞతలు. సంభాషణ యొక్క ప్రాముఖ్యతను ఎక్కువ చేసి చెప్పే బదులు, స్త్రీ పురుషులు పరస్పరం అర్థం చేసుకోవడంలో విఫలులవడానికి గల కారణాల కొరకు జాగ్రత్తగా పరిశోధించారు. జనసంఖ్యలోని సగం మంది, మిగిలిన సగం మందిని అర్థం చేసుకొనేందుకు సహాయపడడం వల్ల, మానవ కోటికి, దేవుడిచ్చిన వివాహ నిబంధనకు గొప్ప సేవ చేసినవారౌతారు.”

మీకు కావలికోట, తేజరిల్లు! పత్రికల ప్రతులు తపాల ద్వారా మీ యింటికి అందడానికి మీరు యిష్టపడుతున్నట్లయితే, దయ చేసి Praharidurg Prakashan Society, Plot A/35, Nr Industrial Estate, Nangargoan, Lonavla 410 401, Mah., లేదా ఐదవ పేజీలోని మీకనుకూలమైన చిరునామాకు వ్రాయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి